ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
Published Wed, Sep 21 2016 9:01 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
– ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సేవాదళ్ నిరాహార దీక్ష
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ బుధవారం స్థానిక కళావెంకట్రావ్ భవనం, జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద సేవాదళ్ విభాగం రాష్ట్ర చైర్మన్ భవానీ నాగేంద్ర ప్రసాద్, రాష్ట్ర ఆర్గనైజర్ చక్రపాణిరెడ్డి, జిల్లా చైర్మన్ సజ్జాద్‌హుసేన్, సేవాదళ్ నాయకులు నిఖిల్, సురేశ్‌లతో పాటు ఎస్సీసెల్‌కు చెందిన సత్యరాజు, నాగప్ప నిరాహార దీక్ష చేపట్టారు. శిబిరాన్ని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు
. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్యాకేజీ ప్రకటించి రాష్ట్ర ప్రజలను మోసగించారని ఆరోపించారు. ప్యాకేజీ మంచు ముక్కలాంటిదని, అది రాష్ట్రానికి చేరేలోపు ఆవిరవుతుందని, ఉన్న కాస్తోకూస్తో నిధులు చంద్రబాబు, మంత్రులు, తెలుగు తమ్ముళ్ల చేతుల్లో నీరుగారిపోతాయని ఆరోపించారు. ప్యాకేజీతో పాటు హోదా తప్పనిసరన్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చేపడుతున్నామని ఈ కార్యక్రమం వచ్చే నెల 7తో ముగుస్తుందని సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, కాంగ్రెస్ నగరాధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, డీసీసీ ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, మజరుల్‌హక్, వై.వి.రమణ, కార్యదర్శులు నారాయణరెడ్డి, చున్నుమియ్య, ఎస్.ఖలీల్‌బాష, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు నాగమధు యాదవ్, మహిళా నేతలు సారమ్మ, సూర్యకాంతమ్మ పాల్గొన్నారు.
Advertisement