బంద్‌కు సహకరించండి | Ap State Should Cooperate with The Special Status | Sakshi
Sakshi News home page

బంద్‌కు సహకరించండి

Published Mon, Apr 16 2018 11:20 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

Ap State Should Cooperate with The Special Status - Sakshi

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని దీక్షాశిబిరంలో నినాదాలు చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం నేడు చేపట్టే రాష్ట్రబంద్‌కు సహకరించాలని వివిధ వర్గాల ప్రజలను హఫీజ్‌ఖాన్‌ కోరారు. ఇప్పటికే బంద్‌కు పలు మర్చంట్‌ సంఘాలు, ఆటో యూనియన్లు, ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోయేషన్, పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు మద్దతు తెలిపాయన్నారు. ఉదయం ఐదు గంటల నుంచే బస్సుల రాకపోకలను అడ్డుకుంటామన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేనిరాహారదీక్షలు ఆదివారంతో ఉదయం తొమ్మిదో రోజుకు చేరాయి.

కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్షను ప్రారంభించిన  హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఇచ్చిన అవిశ్వాస తీర్మాణంపై చర్చ జరగకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందన్నారు.

బీజేపీ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన ఇచ్చిన రాష్ట్రబంద్‌ను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయ, కార్మికులు, మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు చేస్తోందని పార్టీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు.

కార్యక్రమంలో నాయకులు సీహెచ్‌ మద్దయ్య, ధనుంజయాచారి, ఆదిమోహన్‌రెడ్డి, కొనేటి వెంకటేశ్వర్లు, ఫైజాన్, శౌరీ విజయకుమారి, విజయలక్ష్మి, సాంబశివారెడ్డి, «రామ్మోహన్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున, శ్రీనివాసరెడ్డి, ప్యాలకుర్తి రఘు, విజయాచారి, సుమీర్‌ అలిఖాన్, ఆర్టీసీ నాయకులు జార్జ్, ప్రసాద్, మహిళలు సఫియాఖాతూన్, వహిదా, సరోజా, గౌసియా, పార్వతమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement