State bandu
-
బంద్‌కు సహకరించండి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం నేడు చేపట్టే రాష్ట్రబంద్‌కు సహకరించాలని వివిధ వర్గాల ప్రజలను హఫీజ్‌ఖాన్ కోరారు. ఇప్పటికే బంద్‌కు పలు మర్చంట్ సంఘాలు, ఆటో యూనియన్లు, ప్రైవేట్ స్కూల్స్ అసోయేషన్, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మద్దతు తెలిపాయన్నారు. ఉదయం ఐదు గంటల నుంచే బస్సుల రాకపోకలను అడ్డుకుంటామన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేనిరాహారదీక్షలు ఆదివారంతో ఉదయం తొమ్మిదో రోజుకు చేరాయి. కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్షను ప్రారంభించిన హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. ఇటీవల వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్లో ఇచ్చిన అవిశ్వాస తీర్మాణంపై చర్చ జరగకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. బీజేపీ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన ఇచ్చిన రాష్ట్రబంద్‌ను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయ, కార్మికులు, మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు చేస్తోందని పార్టీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో నాయకులు సీహెచ్ మద్దయ్య, ధనుంజయాచారి, ఆదిమోహన్‌రెడ్డి, కొనేటి వెంకటేశ్వర్లు, ఫైజాన్, శౌరీ విజయకుమారి, విజయలక్ష్మి, సాంబశివారెడ్డి, «రామ్మోహన్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున, శ్రీనివాసరెడ్డి, ప్యాలకుర్తి రఘు, విజయాచారి, సుమీర్ అలిఖాన్, ఆర్టీసీ నాయకులు జార్జ్, ప్రసాద్, మహిళలు సఫియాఖాతూన్, వహిదా, సరోజా, గౌసియా, పార్వతమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
2 నుంచి సమైక్య ఉద్యమం ఉధృతం
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : నూతన సంవత్సరంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు ఏపీ ఎన్జీవోల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి చెప్పారు. సంఘ నాయకులతో కలసి ఆదివారం మచిలీపట్నం వచ్చిన ఆయన తూర్పు కృష్ణా ఎన్జీవోల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జనవరి రెండో తేదీ నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని చేయనున్నట్లు ఆయన వివరించారు. జనవరి రెండున విశాఖపట్నంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, మూడున రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. నాలుగున సీమాంధ్ర జిల్లాల్లో అన్ని పార్టీల నాయకులు, ఉద్యోగులతో ర్యాలీలు, 6 నుంచి 10 వరకు అన్ని ప్రాంతాల్లో రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. పీఆర్సీ, ఐఆర్ కోసం చర్చలు... ఉద్యోగులకు పీఆర్సీ, మధ్యంతర భృతి ఇప్పించేందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని చంద్రశేఖరరెడ్డి తెలిపారు. హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం తన చిత్తానుసారం వ్యవహరించిందన్నారు. ఉద్యోగులు కోరినవిధంగా నిబంధనలు మార్చి హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, లేకుంటే వాటిని తిరస్కరిస్తామని చెప్పారు. జూన్ 30 నాటికి తెలంగాణ అంశంపై అన్ని రాజకీయ పార్టీలూ తలోదారిగా వ్యవహరించాయన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణను విడగొడుతున్నట్లు ప్రకటించిందన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఏవీవీఎస్‌వీవీ నరసింహం మాట్లాడుతూ ఈ రాష్ట్రం ఇప్పటి వరకు సమైక్యంగా ఉందంటే ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌లోని ఉద్యోగుల ఉద్యమమే కారణమన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు సంబంధించి మలివిడత చర్చ ప్రారంభం కాగానే సీమాంధ్రలో మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. దీంతో అసెంబ్లీ, పార్లమెంట్లపై ఈ ప్రభావం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కృష్ణా ఎన్జీవో అసోసియేషన్ కన్వీనర్ ఉల్లి కృష్ణ, అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరావు, కోశాధికారి దారపు శ్రీనివాస్, కార్యదర్శి కె.శివశంకర్, వెస్ట్ కృష్ణా అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకుడు టీఎస్ఆర్ ఆంజనేయులు, అవనిగడ్డ, నాగాయలంక, కైకలూరు, బంటుమిల్లి, మొవ్వ, పామర్రు, గుడివాడ తదితర ప్రాంతాల ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.