
మామిడాలపల్లిలో మాట్లాడుతున్న హరీశ్
వీణవంక (హుజూరాబాద్): ఈటల రాజేందర్ తన స్వార్థం కోసమే రాజీనామా చేశాడని, బట్ట కాల్చి మీద వేయడంలో ఈటల కన్నా మించినోళ్లులేరని ఆర్థిక మం త్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి, ఇప్పలపల్లి, ఎల్బాక, గంగారంతోపాటు పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి హరీశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్‌ను ఆశీర్వదించాలని కోరారు.
తన ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల బీజేపీ లో చేరారని, రైతుబంధు దండగ అన్న ఈటల రూ.10 లక్షలు రైతుబంధు కింద తీసుకున్నారని, ఇదెక్కడి న్యాయమో ప్రజలే నిర్ణయించాలన్నారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయని, పెరిగిన సిలండర్ ధరలపై ఇప్పటివరకు ఈటల మాట్లాడలేదని విమర్శించారు.
మామిడాలపల్లిని దత్తత తీసుకుంటా
మామిడాలపల్లిలో 90 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కు పడితే గ్రామాన్ని దత్తత తీసుకుంటా నని హరీశ్‌రావు ప్రకటించారు. మాజీ మం త్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి పేరును నిలబెట్టేలా మామిడాలపల్లిలో కార్యక్రమా లు చేపడతానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment