
పోతిరెడ్డిపేటలో మాట్లాడుతున్న ఈటల
హుజూరాబాద్: ‘ఏకు మేకయ్యానని నన్ను ఖతం చేయాలని కుట్ర పన్నారు, ఎన్నికుట్రలు పన్నినా భయపడేదిలేద’ని మాజీమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో పథకం రచిస్తే హరీశ్‌రావు హుజూరాబాద్‌లో అమలు చేస్తు న్నారని ఆరోపించారు. ఆదివారం హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట, వెంకట్రావ్‌పల్లి, బోర్నపల్లి, కొత్తపల్లి, ఇప్పల్‌నర్సింగాపూర్, దమ్మక్కపేట ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కేసీఆర్ తనను ఓడించాలన్న ఆత్రుతలో కొంచెమైనా రైతుల కష్టాలపై పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మాటల్లో రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూ.. చేతలో రైతు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో వరి ధాన్యం కొన బోమని సీఎం కేసీఆర్ అంటే తానే కొనాలని చెప్పినట్లు గుర్తుచేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్తున్న కేసీఆర్ మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ ని ఎందుకు విడుదల చేయడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment