సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సంఘటనల విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వెలువడుతున్న నివేదికలకు తేడా ఉంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. ఆ లెక్కలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. ఆదివారం ఆన్‌లైన్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈశ్వరయ్య అనే వ్యక్తి గతనెల 29న చనిపోయారని గాంధీ ఆçస్పత్రి వర్గాలు చెబుతుంటే ప్రభుత్వం మాత్రం 30న అని అంటోందన్నారు. ఈశ్వరయ్య కొడుకు మధుసూదన్ 30వ తేదీ సాయంత్రం ఆస్పతిలో చేరారని, ఆ వెంటనే ఆయనను వెంటిలేటర్‌పై పెట్టామని ప్రభు త్వం చెబుతోందన్నారు. కానీ మే 1న మధ్యాహ్నం 12.05 గంటలకు మధుసూదన్‌తో ఆయన భార్య మాట్లాడారని, వెంటిలేటర్ పై ఉన్న వ్యక్తి తన భార్యతో ఎలా మాట్లాడారని సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వం మధుసూదన్ మృతిని ఎందుకు దాచి పెట్టే ప్రయత్నం చేస్తోంది? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment