జాన్వీ కపూర్‌ వీడియోపై కామెంట్‌.. ఇచ్చిపడేసిన హీరోయిన్! | Janhvi Kapoor hits back at trolls mocking her shoulder injury | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: ఆ బాల్‌తో గాయాలా?.. నెటిజన్‌కు జాన్వీ స్ట్రాంగ్‌ కౌంటర్!

Published Fri, May 31 2024 6:14 PM | Last Updated on Fri, May 31 2024 7:07 PM

Janhvi Kapoor hits back at trolls mocking her shoulder injury

బాలీవుడ్ భామ జాన్వీకపూర్‌ మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌ రావుకు జంటగా నటించింది. ఈ సినిమాలో మహిమ పాత్రలో మెరిసింది. అయితే ఇటీవల ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన భూజానికి గాయమైనట్లు కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ నటనపై తన అంకితభావాన్ని కొనియాడారు.

అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్‌ జాన్వీ కపూర్‌ను ట్రోల్ చేశాడు.  టెన్నిస్‌బాల్‌తో ఆడిన క్రికెట్‌లో కూడా మీకు గాయమైందా? అంటూ నవ్వుతున్న ఎమోజీలను పెట్టారు. అయితే ఇది చూసిన జాన్వీ కపూర్‌ సైతం అతనికి   అదిరిపోయే రిప్లై ఇచ్చింది.  తనకు సీజన్‌ బాల్‌తో ఆడుతుండగానే గాయమైందని.. అందుకే టెన్నిస్‌ బాల్‌తో ఆడాల్సి వచ్చింది. నా భుజాలకు ఉన్న బ్యాండేజ్‌లను చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుందంటూ రాసుకొచ్చింది. ఇలాంటి వాటిపై కామెంట్‌ చేసే ముందు ఒకసారి వీడియో మొత్తం చూడండి.. అప్పుడు మీ జోక్స్‌కు నేను కూడా నవ్వుతా అంటూ కౌంటర్‌ ఇచ్చిపడేసింది. దీంతో దెబ్బకు సారీ జాన్వీ మేడమ్‌.. అంటూ  రిప్లై ఇచ్చాడు. 

కాగా.. 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రాన్ని కరణ్ శర్మ డైరెక్షన్‌లో తెరకెక్కించారు.  అభిమానుల అంచనాల మధ్య మే 31 థియేటర్లలో విడుదలైంది. కాగా.. జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లో దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement