ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఏం చేసినా వైరల్‌గా మారుతుంది. ఇటీవల ట్విటర్‌ని హస్తగతం చేసుకున్నప్పటి ఆ సంస్థలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మస్క్ పేరు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ ట్విటర్ సీఈఓ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది.
ఏది బెటర్.. మస్క్ ట్వీట్
ఎలాన్ మస్క్ రూటే సెపరేటు.. ఇది ఆయన చేసే పనులను చూస్తే అర్థమవుతుంది. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటారు మస్క్. అంతేందుకు కొన్న సందర్భాల్లో తను తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ట్వీట్ రూపంలో నెటిజన్లను అడుగుతుంటారు. తాజాగా ఆయన ట్విటర్ వర్సెస్ ఇన్‌స్టాగ్రామ్ గురించి ప్రస్తావించారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ కూడా చేశారు.
Instagram makes people depressed & Twitter makes people angry. Which is better?
— Elon Musk (@elonmusk) January 15, 2023
అందులో "ఇన్‌స్టాగ్రామ్ ప్రజలను నిరాశకు గురిచేస్తుంది.. మరోవైపు, ట్విట్టర్ ప్రజలకు కోపం తెప్పిస్తుంది. ఈ రెంటిలో ఏది బెటర్ అని అడిగారు. అయితే మస్క్ ఈ రకంగా ట్వీట్ ఎందుకు చేశారో తెలియదు. కానీ దీని చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఇన్‌స్టాగ్రామ్ కంటే ట్విటర్ బెటర్ అని చెప్పేదగినవి చాలానే ఉన్నాయి. ట్విటర్‌లో ఎటువంటి ఫిల్టర్‌లు లేనందున ఇది బాగుంటుందన్నారు. ప్రజలు ఆన్‌లైన్‌లో స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించవచ్చని’ ఒక యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు ట్విటర్‌లో ఉన్న అల్గారిథమ్స్‌ను సరిచేయాలని కోరగా. .. ప్రస్తుతం ఈ విషయంలో మీరు గతం కంటె మెరుగ్గా ఫీల్ అవతారని నెటిజన్ రిప్లైకి మస్క్ స్పందించారు.
చదవండి: ర్యాపిడోకి గట్టి షాకిచ్చిన కోర్టు.. అన్ని సర్వీసులు నిలిపివేయాలని ఆదేశాలు!
Comments
Please login to add a commentAdd a comment