Harish Shankar Strong Reply to Netizens Over Trolls on His Omicron Video - Sakshi
Sakshi News home page

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ వీడియోపై నెటిజన్ల ట్రోల్స్‌, వారిపై డైరెక్టర్‌ తీవ్ర వ్యాఖ్యలు

Published Mon, Jan 10 2022 2:54 PM | Last Updated on Mon, Jan 10 2022 5:23 PM

Harish Shankar Strong Reply To Netizens Over Trolls On His Omicron Video - Sakshi

ప్రముఖ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ ఓ నెటిజన్‌పై ఆగ్రహం​ వ్యక్తం చేశాడు. తాను షేర్‌ చేసిన ఓ వీడియోపై సదరు నెటిజన్‌ స్పందించిన తీరుకు ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యాడు. కాగా ‘ఒమిక్రాన్‌ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా అని నిర్లక్ష్యం చేయవద్దు. కేసులు పెరుగుతున్నాయి. కానీ మరణాలు మత్రం నమోదు అవ్వడం లేదు. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసంర లేదు’ అంటూ ఓ వైద్యుడు చెప్పుకొచ్చిన వీడియోను హరీశ్‌ శంకర్‌ ట్వీట్‌ చేశాడు.

చదవండి: హీరోయిన్‌కు కరోనా, మీ చావు కబురు కోసం ఎదురుచూస్తుంటామంటూ..

ఒమిక్రాన్‌ వెరియంట్‌ పట్ల ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిన సదరు వైద్యుడు వీడియో పంచుకున్న హరీశ్‌ శంకర్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరూ ఆయనను ట్రోల్‌ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మరికొందరూ నెటిజన్లు ‘హరీశ్‌ శంకర్‌ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఒమిక్రాన్‌ వెరియంట్‌పై ప్రజల్లో ఆందోళన, భయం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అయితే ప్రజల్లో భయం పోయి విచ్చలవిడిగా వ్యవహరిస్తారు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అలాంటి వారికొ హరీశ్‌ శంకర్‌ తనదైన శైలితె ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

చదవండి: ‘మణిరత్నంను ఇంతవరకు కలవలేదు, ఆయనతో నాకు చేదు అనుభవం ఉంది’

‘ఒక వైద్య నిపుణుడు ప్రజల్లో ఆశలు పెంచే దిశగా మంచి గురించి చెప్పినా మీలాంటి స్టుపిడ్స్ నిరాశ చెందుతూనే ఉంటారు’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కాగా హరీశ్‌ శంకర్‌ సోషల్‌ మీడియాల్లో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ నెటిజన్లతో పంచుకోవడంతో పాటు పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. అలాగే ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు.. దేశలోని రాజకీయ పరిణామాలపై ట్విట్టర్ వేదికగా స్పదిస్తుంటారు. అంతే కాదు వింతలు విశేషాలను పంచుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించే వీడియోలను తరచూ తన పేజ్ ద్వారా నెటిజన్లకు, తన ఫాలోవర్స్‌కు అందిస్తుంటాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement