నెటిజన్లకు సమంత స్ట్రాంగ్‌ రిప్లే | Samantha Ruth Prabhu gives fitting reply to haters  | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 9 2018 4:48 PM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

Samantha Ruth Prabhu gives fitting reply to haters  - Sakshi

సమంత రిప్లే (ఇన్‌ సెట్‌లో)

టాలీవుడ్‌ హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకొని అక్కినేని వారి కోడలైన సమంత నెటిజన్లపై మండిపడ్డారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కాస్త తీరిక దొరికిందని సమయాన్ని వృధా చేయకుండా ఆస్వాదిస్తున్నాని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. దీనికి సమంత తమిళనాడులోని తెన్‌కాశీలో బికినీ వేసుకుని సేద తీరుతోన్న ఫొటోను పోస్ట్‌ చేశారు.  ‘చాలా అలసిపోయాను. ఇది వెకేషన్‌ టైమ్‌. ఇది కావాలని కాదు, అవసరం’  అంటూ  పేర్కొన్నారు.

అయితే ఈ బికినీ ఫొటోపై నెటిజన్లు మండిపడ్డారు. పెళ్లైన తరువాత ఇలాంటి ఫొటోలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. బాలీవుడ్‌ నటిలా ప్రవర్తించకు నీకు పెళ్లైందని గుర్తు చేస్తూ.. ట్రోల్‌ చేశారు. దీనికి సమంత దిమ్మతిరిగే రిప్లే ఇచ్చారు.‘ నేనిప్పుడు ఒక కోట్‌ను పోస్ట్‌ చేయాలి ఎందుకంటే నా గత పోస్ట్‌ అంత అసభ్యకరంగా ఏమి లేదు. ‘నా రూల్స్‌ నేను రాసుకుంటా.. మీరు నా నియమాలు రాయడం కాదు.. మీ రూల్స్‌ రాసుకోండి’ అని ఒక కోట్‌ను జత చేస్తూ పోస్ట్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement