కావాలని కాదు.. అవసరం : బికినీలో సమంత | samantha post bikini photo in instagram | Sakshi
Sakshi News home page

కావాలని కాదు.. అవసరం : బికినీలో సమంత

Published Fri, Feb 9 2018 10:12 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

samantha post bikini photo in instagram - Sakshi

సమంత  మంచి ఫామ్‌లో ఉండగానే టాలీవుడ్‌ యువ నటుడు నాగచైతన్యతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రేమ సక్సెస్‌ అవుతుందా.? వీరు అసలు పెళ్లి పీటలు ఎక్కుతారా.? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.  నాగచైతన్య, సమంతల వివాహం విజయవంతంగా జరిగింది. అయితే వివాహానంతరం తాను నటనకు దూరం కాను అని సమంత ముందుగానే ప్రకటించినా, చాలా మంది పెళ్లి తరువాత హీరోయిన్‌ అవకాశాలు తగ్గుతాయి అని అనుకున్నారు. పెళ్లి అయిన వెంటనే నటించడానికి రెడీ అయిపోయిన సమంతకు అవకాశాలు ఏ మత్రం తగ్గలేదు. పెళ్లి తరువాత ఏమాత్రం విరామం తీసుకోకుండా ‘రంగస్థలం’, ‘మహానటి’  సినిమాలతో బిజీగా ఉన్నారు. 

అయితే సమంత ఇటీవల కాస్త తీరికదొరికిందని సమయాన్ని వృధా చేయకుండా ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. సమంత తమిళనాడులోని తెన్‌కాశీలో బికినీ వేసుకుని సేద తీరుతోన్న ఫోటోను పోస్ట్‌ చేశారు.  ‘చాలా అలసిపోయాను.  ఇది వెకేషన్‌ టైమ్‌. ఇది కావాలని కాదు, అవసరం’  అంటూ  పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషియల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement