నీ వెనుక నేనుంటా.. నెటిజన్‌ ప్రపోజల్‌కి సమంత ఎమోషనల్‌! | Citadel Honey Bunny Beauty Samantha Gets Emotional To Netizen Proposal, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

నీ వెనుక నేనుంటా.. నెటిజన్‌ ప్రపోజల్‌కి సమంత ఎమోషనల్‌!

Published Tue, Nov 5 2024 11:25 AM | Last Updated on Tue, Nov 5 2024 12:23 PM

Citadel : Honey Bunny Beauty Samantha Emotional To Netizen Proposal

సమంత ప్రస్తుతం ‘సిటాడెల్‌: హనీ బన్నీ ’ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ముంబైతో పాటు పలు నగరాలు తిరుగుతూ వెబ్‌ సిరీస్‌ని ఎక్కువ మందికి రీచ్‌ అయ్యేలా చేస్తోంది. ఒకవైపు మీడియాతో ముచ్చటిస్తూనే..మరోవైపు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులను పకలరిస్తోంది.

వీలున్నప్పుడల్లా నెట్టింట సందడి చేసే సామ్‌..తాజాగా తన ఫాలోవర్స్‌, అభిమానులతో మాట్లాడేందుకు ఇన్‌స్టాలో చిట్‌చాట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్స్‌ ఆమెకు పలు ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికి ఎంతో ఓపికగా సామ్‌ సమాధానం చెప్పింది. ఇక ఓ నెటిజన్‌ అయితే సమంతపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంటుంది. నీకు తోడుగా ఎవ్వరు లేకపోతే.. ఆ సమయంలో నేను ఉంటా. ఐ లవ్‌ యూ సమంత’ అని కామెంట్‌ చేశాడు. నెటిజన్‌ ప్రపోజ్‌కి సమంత ఫిదా అయింది. మీ ప్రేమే నాకు బలం అంటూ ఎమోషనల్‌ అయింది. 

సిటాడెల్‌’ భారీ అంచనాలు
సమంత, బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ కలిసి నటిచిన వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్నీ’. ‘దీ ఫ్యామిలీమేన్‌’ వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌ నవంబర్‌ 7 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రియాంక చోప్రా నటించిన అమెరిక్‌ వెబ్‌ సిరీస్‌ ‘సీటాడెల్‌’కి ఇది ఇండియన్‌ వెర్షన్‌. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి భారీ స్పందన వచ్చింది. ప్యామిలీమేన్‌ తరహాలో ఈ వెబ్‌ సిరీస్‌ కూడా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. ట్రైలర్‌ బట్టి చూస్తే.. ఇందులో సమంత భారీ యాక్షన్‌ సీన్స్‌ చేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ వెబ్‌ సిరీస్‌ ఎన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement