Netizens Trolls On Naresh Pavitra Movie Malli Pelli Teaser - Sakshi
Sakshi News home page

Malli Pelli Teaser: యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న 'మళ్లీ పెళ్లి' టీజర్.. నెటిజన్స్ దారుణ కామెంట్స్!

Published Sat, Apr 22 2023 9:07 AM | Last Updated on Sat, Apr 22 2023 11:41 AM

Netizens Trolls On Naresh Pavitra Movie Malli Pelli Teaser - Sakshi

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వీకే నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రేమాయణంపై ఏకంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'మళ్లీ పెళ్లి' పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించనుండగా.. నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్‌ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ టీజర్‌లో చివర్లో వచ్చే కన్నుకొట్టే సీన్‌ నెటిజన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం పవిత్ర లోకేష్, నరేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ టీజర్ వైరల్‌గా మారింది. 

అయితే ఈ టీజర్‌పై కొందరు నెటిజన్స్‌ దారుణ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఇలాంటి సినిమాలు మరిన్నీ రావాలని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఈ సినిమాను రాంగోపాల్ వర్మ తీసుంటే ఇంకా బాగుండేదని సలహాలు కూడా ఇస్తున్నారు. ఓ నెటిజన్‌ 'మళ్లీ  … శోభనం' !!  ఎప్పుడు రిలీజ్‌ అంటూ కామెంట్ చేశాడు. 

కాగా.. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రా‍న్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో జయసుధ, శరత్‌బాబు, వనితా  విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి  స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన‍్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

నెటిజన్స్ చేసిన కొన్ని కామెంట్స్!

  • 'నేను మాత్రం కామెంట్స్ చదివి నవ్వుకోవడానికి వచ్చాను'
  •  'పరువు మనకి మనమే ఎలా తీయాలి అని ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు'
  •  'బతుకుజట్కాబండి,  ఇది కథ కాదు జీవితం...'అనే టైటిల్ కి కరెక్టుగా సరిపోయే సినిమా ఇది. 
  •  'ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 భాషల్లో రిలీజ్ అయ్యి 3000 కోట్ల వసూళ్లు సాధించాలని కోరుకుంటూ- జేమ్స్ కామెరూన్ ఫ్యాన్స్'
  •  'ఈ సినిమాని ఆర్జీవి డైరెక్ట్ చేసి ఉంటే బాగుండు'
  •  'ఇలాంటి భాగోతాల సినిమాలు మరిన్ని రావాలి.'
  •  'మళ్లీ  … శోభనం  !!  ఎప్పుడు  రిలీజ్‌'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement