
గతంలో సినిమా హీరోలు నటన, డాన్స్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. ట్రెండ్ మారుతుండడంతో కాలానుగుణంగా హీరోలలోనూ మార్పులు వచ్చాయి. ప్రస్తుతం హీరోలు తమ శరీరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ఒకప్పుడు సిక్స్ ప్యాక్ హీరోల జాబితాలో ఒకరో ఇద్దరో ఉంటే ప్రస్తుతం చాలా మంది ఆ జాబితాలో చేరిపోయారు. ఇక ప్రత్యేకంగా బాలీవుడ్‌లో.. టైగర్ ష్రాఫ్ తన బాడీ ఫిట్‌గా ఉంచడంలో ఏ మాత్రం రాజీ పడడన్న విషయం తెలిసిందే.
అలా శ్రద్ధ తీసుకుంటున్నాడు కాబట్టే బీ టౌన్‌లో రకరకాల స్టంట్స్ చేస్తూ యాక్షన్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. తాజాగా టైగర్ ‘గణ్‌పత్’ సినిమా షూటింగ్ యూరప్‌లో జరుగుతోంది. యూరప్ లాంటి దేశాలలో ప్రస్తుతం గడ్డకట్టే చలి వాతావరణం ఉంటుందన్న సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్ అంతటి చలి వాతావరణంలో కూడా ఉదయాన్నే లేచి షర్టు లేకుండా కేవలం షార్ట్స్ ధరించి అలా జాగింగ్ చేశాడు. ఆ వీడియోని తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన వాళ్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. అందులో దిషా పటానీ.. ‘లోల్’, రకుల్.. ‘వావ్! అంత చలిలో ఎలా?’ అంటూ స్పందించారు. ‘గణ్‌పత్’ చిత్రంలో టైగర్ సరసన కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈ చిత్రం జాకీ భగ్నానీ నిర్మిస్తున్నారు. ఇది వరకే వీరిద్దరు హీరోపంతీ అనే సినిమాలో కలిసి నటించారు.
చదవండి: Vicky Kaushal-Katrina Kaif: భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకొచ్చిన కత్రినా, విక్కీ కౌశల్