Disha Patani Hilarious Reply To Who Asked Her Bikini Photo Went Viral - Sakshi
Sakshi News home page

Disha Patani: బికినీ ఫొటో అడిగాడు.. హీరోయిన్‌ రిప్లైకి షాక్‌ అయ్యాడు

Published Wed, Mar 16 2022 11:25 AM | Last Updated on Wed, Mar 16 2022 12:09 PM

Disha Patani Hilarious Reply Who Asked Her Bikini Photo - Sakshi

Disha Patani Hilarious Reply Who Asked Her Bikini Photo: డ్యాషింగ్ డైరెక్ట్ చేసిన 'లోఫర్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఫిట్‌నెస్ బ్యూటీ దిశా పటానీ. మెగా హీరో వరుణ్‌ తేజ్ సరసన హీరోయిన్‌గా ఆడి పాడి తన గ్లామర్‌తో అలరించింది. తర్వాత బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా మారింది. ఎంఎస్‌ ధోనీ, భాగీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు పుకార్లు కూడా ఎదుర్కొంటోంది. కాగా దిశాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. హాట్‌ ఫొటోస్‌, వర్క్‌ అవుట్‌ వీడియోస్‌తో అభిమానులను ఎప్పుడూ అలరిస్తూ ఉంటుంది.



చదవండి: హాట్‌ ఫొటోషూట్స్‌ ఎందుకు చేయరన్న నెటిజన్‌.. దిమ్మతిరిగేలా హీరోయిన్ రిప్లై 
చదవండి: టైగర్‌ ష్రాఫ్‌ యాక్షన్‌ సీన్స్‌ కోసం ఖరీదైన కార్లు !


ఈ క్రమంలోనే తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో 'ఆస్క్‌ మీ ఎనిథింగ్‌ (నన్ను ఏదైనా అడగండి)' అనే సెషన్‌ నిర్వహించింది. ఈ సెషన్‌లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు నవ్వు తెప్పించేలా రిప్లై ఇచ్చింది దిశా పటానీ. ఈ సెషన్‌లో ఆ యూజర్‌ దిశాను 'బికినీ వేసుకున్న మంచి ఫొటో'ను పోస్ట్‌ చేయాల్సిందిగా కోరాడు. దానికి దిశా బికినీ వేసుకున్న ఒట్టర్‌ (పాండాలాంటి జంతువు) ఫొటోను పెట్టి వ్యంగంగా సమాధానం ఇచ్చింది. దీంతో షాక్‌కు గురవడం ఆ యూజర్‌ వంతైంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన పులువురు నెటిజన్స్‌ దిశా స్పాంటెనిటీకి ఫిదా అవుతున్నారు. ఇవే కాకుండా తనకు ఇష్టమై బీటీఎస్‌ సాంగ్, గ్లామర్‌ సీక్రెట్‌ వంటి తదితర ప్రశ్నలకు సమాదానాలిచ్చింది దిశా పటానీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement