పాట్నా: కరోనామహమ్మారి కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసుకునే అవకాశం కల్పించాయి. ఈ క్రమంలో చాల మంది కంపెనీల మీటింగ్స్, స్నేహితులతో , ఇంట్లోవారితో మాట్లాడటానికి వీడియో కాల్‌నే ఉపయోగిస్తున్నారు. అయితే, ఇది కొన్నిసార్లు నవ్వును కూడా పుట్టిస్తుంది. తాజాగా, పాట్నాకు చెందిన ఒక న్యాయవాది , సోలీసిటరీ జనరల్‌ల మధ్య వీడియోకాల్‌లో సెషన్ జరుగుతొంది. ఈ క్రమంలో లాయర్‌కు బాగా ఆకలేసినట్టుంది. వెంటనే తనకు నచ్చిన చపాతి తెప్పించుకొని తినడం మొదలెట్టేశాడు. అయితే వీడియోకాల్ ఆఫ్ చేయడం మరిచిపోయాడు.
అప్పుడు ఆన్‌లైన్‌లో జడ్జి ప్రత్యక్ష మయ్యాడు. లాయర్‌ను చూసి నవ్వుకుంటూ నాక్కుడా చపాతి పంపు అని సరదాగా కామెంట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతొంది. దీన్ని చూసిన నెటిజన్లు బుర్ర పనిచేయాలంటే తిండి కూడా ముఖ్యమే...ఆకలేస్తే అంతే మరీ! అని సరదాగా కామెంట్‌లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment