
'ఎస్ఆర్ కల్యాణ మండపం' సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత సమ్మతమే చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. తాజాగా తన అభిమానులతో ఆస్క్ కిరణ్ అబ్బవరం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు హీరో సమాధానమిచ్చారు.
అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న నెట్టింట తెగ వైరలవుతోంది. ఆ నెటిజన్ ప్రశ్నకు హీరో ఆశ్చర్యానికి గురయ్యారు. 'అన్న నీ పెళ్లి ఎప్పుడు? మేసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వకపోతే ఎప్పటికీ సింగల్‌గానే మిగిలిపోతావ్' అంటూ ప్రశ్నించాడు. దీనికి హీరో స్పందిస్తూ.. 'ఎంత మాట అనేశావ్ తమ్ముడు' అంటూ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత నెటిజన్ల్ అడిగిన పలు ప్రశ్నలకు కిరణ్ సమాధామిచ్చారు.
Entha mata annav thammudu 😒 https://t.co/u6CEmJLX2P
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 6, 2023
Comments
Please login to add a commentAdd a comment