
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లలో నవదీప్ ఒకరు. ఒకప్పుడు వరుస ప్రేమ కథా చిత్రాల్లో నటించి లవర్ బాయ్‌గా పేరొందిన నవదీప్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా అలరిస్తున్నాడు. ఆ మధ్యలో ‘అల వైకుంఠపురములో ’చిత్రంలో బన్నీ ఫ్రెండ్‌గా నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘మోసగాళ్లు’చిత్రంలోనూ హీరో విష్ణు స్నేహితుడిగా కనిపించారు. ప్రస్తుతం సన్నీ లియోని ప్రధాన పాత్రలో నటిస్తున్న వీరమాదేవి చిత్రంలోనూ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. దాదాపు 35 ఏళ్ల వయసు వచ్చినా.. పెళ్లికి మాత్రం ఇంకా టైమ్ ఉంటుంది అంటున్నాడు నవదీప్.
అయితే నెటిజన్స్ మాత్రం ‘ఇంకెప్పుడు పెళ్లి బాబు..’అంటూ ప్రతిసారి కామెంట్ చేస్తుంటారు. వాటికి చాలా ఫన్నీగా ఆన్సర్ ఇస్తుంటాడు నవదీప్. తాజాగా ‘గడ్డం నెరిసిపోతుంది.. ఇప్పటికైనా పెళ్లి చేసుకో’ అని సలహా ఇచ్చి ఓ నెటిజన్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. 'అన్నా గెడ్డం తెల్లబడుతోంది పెళ్లి చేసుకో అని కొంతమంది నాకు సలహాలు ఇస్తున్నారు. గెడ్డం తెల్లబడితే ట్రిమ్ చేసుకోవాలి. పెళ్లి కాదు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా’అని నవదీప్ కౌంటర్ ఇచ్చాడు.
Oddhu ra sodhara :) pic.twitter.com/IYKSAGFDVE
— Navdeep (@pnavdeep26) January 23, 2022