
వచ్చిరాని మాటలు, తెలిసి తెలియని చేతలతో చిన్నపిల్లలు చేసే పనులు ఒక్కోసారి భలే నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ చిచ్చరపిడుగు.. గోదావరి యాస, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిజన్ల కంటపడ్డాడు. బుడ్డోడి మాటలకు, హావభావాలకు వీక్షకులు ఫిదా అవుతున్నాయి.
‘బల్లు బల్లు మని బాదెసడమ్మి.. తూస్తే ఏడుపొచ్చేత్తమ్మి’ అంటూ ముద్దుగా ముద్దుగా మాట్లాడిన చిన్నారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓ ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
టీచర్ అనవసరంగా తనను కొట్టాడంటూ గోదావరి యాసలో చెబుతూ చిన్నారి చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ మామూలుగా లేవు. ‘గట్టిగా కొట్టేశాడు ఎదవ. సార్‌దే తప్పు.. చిన్నపిల్లోడ్ని ఎందుకు కొట్టాడు’ అంటూ బుడ్డోడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అతడు మాట్లాడిన మాటలు చాలా మందికి అర్థంకాకపోయినా హావభావాలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్: వైరల్ వీడియో.. హృదయానికి హత్తుకుంటోంది!)
పెద్ద మనిషిలా మాట్లాడుతున్న ఈ చిన్నారి మంచి మాటకారి అవుతాడు. గోదావరి యాసను బతికిస్తున్నాడు. మంచి రెబల్ అవుతాడు. లవ్ యు రా బుజ్జి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ బాలుడు ఏ ఊరివాడు, ఈ వీడియో ఎప్పటిదనే వివరాలు వెల్లడికాలేదు.
Comments
Please login to add a commentAdd a comment