Expression
-
మాటే మహాత్మ్యం
మాటకున్న మహత్తు ఇంతా అంతా కాదు. బయటి నుంచి తెచ్చుకోవాల్సిన పని లేని ఆయుధం. ప్రతి మనిషికి సహజంగా ఇవ్వబడినది. ఎవరికి వారికి తగిన రీతిలో ప్రత్యేకంగా తయారు చేసి ఇవ్వబడింది. మనిషి తనంత తానుగా చేయ వలసినది దానిని పదును పెట్టి, పాడవకుండా, తుప్పు పట్టకుండా చూసుకోవటం. దానికి ముందుగా అందరూ అప్రయత్నంగా చేసేది పెద్దలని చూసి అనుకరించటం. తరువాత శిక్షణ తీసుకోవటం. ఈ శిక్షణ పాఠశాలలలో కాని, విడిగా శిక్షణాతరగతులలో కాని జరుగుతుంది. ఇతర జీవులకి వేటికి లేని ప్రత్యేకత మానవుడికి మాత్రమే ఇవ్వ బడింది. అదే మనస్సు. దాని లక్షణం ఆలోచించటం. ఆపై తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవటం. దానికి సాధనం భాష. మానవులకి మాత్రమే ఇవ్వ బడిన భాష అనే విలువైన సాధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా! అపార్థాలు కలగకుండా, అనర్థాలు వాటిల్లకుండా, సమర్థవంతంగా తన భావనలని వ్యక్తం చేయటానికి, దానికి సాధనమైన మాటని జాగ్రత్తగా ఉపయోగించాలి. మాటతో మనుషులు, కుటుంబాలు, సంస్థలు, దేశాలు కలుస్తాయి, విడిపోతాయి కూడా. మాట ప్రాణం పోస్తుంది, మాట ప్రాణం తీస్తుంది. వీటి అన్నిటికీ చరిత్రలో ఉదాహరణలు కోకొల్లలు. రామకథలో ప్రతి మలుపుకి ఒక మాట కారణమయింది. స్వతంత్ర భారత దేశం ముక్కలు కావటానికి ఒక మాట కారణం అంటారు ఆనాటి రాజనీతివేత్తలు. కుటుంబ కలహాలకి చెప్పుడు మాటలే కారణం అని విన్నవాళ్ళకి కూడా తెలుసు. కాని, ఆ క్షణాన ఆ మాటలు ఇంపుగా అనిపిస్తాయి. దీనినే కైటభుడుగా పురాణాలు సంకేతించి చెప్పాయి. వినగా వినగా నిజమే నేమో అనిపిస్తుంది, క్రమంగా నిజమే అనిపిస్తుంది. చిన్నప్పుడు విన్న బ్రాహ్మణుడు – నల్లమేకకథ గుర్తు ఉంది కదా! (ప్రస్తుతం మన ప్రచార, ప్రసార సాధనాలు ఈ సిద్ధాంతాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి.) ఆంగ్లంలో ఒక సామెత ఉంది. ఒక కుక్కని చంపాలి అంటే ముందు అది పిచ్చిది అని ప్రచారం చేయాలి అని. మాటకి ఉన్న శక్తి అర్థమయింది కదా! ఉచ్చారణ, వ్యాకరణం, వాక్యనిర్మాణం, కాకువు, ముఖకవళికలు, ముఖ్యంగా కళ్ళు, కనుబొమల కదలికలు, శరీర భంగిమ, కాళ్ళు చేతుల కదలికలు మొదలైనవి అన్నీ మాటలతో పాటు భావ ప్రకటనకి సహకరిస్తాయి. ఉచ్చారణ స్పష్టంగా లేక పోతే ‘కళ్ళు’ తెరవటం ‘కల్లు’ తెరవటం అవుతుంది. ‘శకలం’ (ముక్క) ‘సకలం’ (సమస్తం) అవుతుంది. ‘శంకరుడు’కాస్తా ‘సంకరుడు’ అయిపోతాడు. తేడా తెలుస్తోంది కదా! వ్యాకరణం తెలియక ఎంతో సదుద్దేశంతో ‘‘సుపుత్రాప్రాప్తిరస్తు’’ అని దీవిస్తూ ఉంటారు. అంటే సుపుత్ర అప్రాప్తి అవుతుంది. ‘‘సుపుత్ర ప్రాప్తిరస్తు’’ అనాలి. అందరికీ వాక్సిద్ది లేకపోవటం అదృష్టం.జాగ్రత్తగా ఉచ్ఛరించిన మాటలకి సరైన కంఠస్వరం తోడు ఉంటే వినాలని అనిపిస్తుంది. చెవితో వింటే కదా! ఆచరించాలని అనిపించేది. ఎన్నో సందర్భాలలో ఆర్థికంగా గాని, శారీరికంగా గాని సహాయం చేయలేక పోయినా మాటసహాయం చేసి సమస్యలని పరిష్కరించటం చూస్తాం. ఇంత శక్తిమంతమైన ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరికి వారు ఉద్ధరించ బడుతూ పదిమందికి సహాయం చేయవచ్చు. శక్తిమంతమైన మాటని చక్కగా ఉపయోగించుకోటానికి కొన్ని లక్షణాలని పెంపొందించుకోవాలి. అవి – సత్యం, హితం, మితం, ప్రియం, స్మితం, మధురం, ప్రథమం. ఏ ఒక్క లక్షణం ఉన్నా గొప్పే. అన్నీ ఉండటం సామాన్య మానవుల విషయంలో చాలా కష్టం. హితమైనది ప్రియంగా ఉండదు. సత్యం మధురంగా ఉండక పోవచ్చు. నిజం నిష్ఠురంగా ఉంటుంది కదా! ‘‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్య మప్రియం, ప్రియం చ నానృతంబ్రూయాత్, ఏష ధర్మ స్సనాతనః’’. ఈ ఆరు లక్షణాలతో ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి అంటే సహజ స్వభావానికి మెఱుగు పెట్టే శిక్షణ అవసరం. – డా.ఎన్.అనంతలక్ష్మి -
గోపాల మురిపాల బాల
కొన్ని వీడియోలు వైరల్ కావడానికి మాటలు, నిడివితో పనిలేదు. ‘హార్ట్‌వార్మింగ్ ఎలిమెంట్’తో మౌనంగానే వైరల్ అవుతాయి. ఈ వీడియో అలాంటి కోవకు చెందింది. ఆరుబయట మంచంపై కూర్చొని ఆడుకుంటున్న ఓ పాప దగ్గరికి ఆవు వచ్చి ‘ఎలా ఉన్నావు పాపా?’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. పాప ఆవు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నిమురుతూ ‘నేను బాగానే ఉన్నాను. నీ సంగతి ఏమిటి?’ అన్నట్లుగా నవ్వుతుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
క్యూట్ ఎక్స్ప్రెషన్స్.. గోదావరి యాసతో కట్టిపడేస్తున్న చిన్నారి
వచ్చిరాని మాటలు, తెలిసి తెలియని చేతలతో చిన్నపిల్లలు చేసే పనులు ఒక్కోసారి భలే నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ చిచ్చరపిడుగు.. గోదావరి యాస, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిజన్ల కంటపడ్డాడు. బుడ్డోడి మాటలకు, హావభావాలకు వీక్షకులు ఫిదా అవుతున్నాయి. ‘బల్లు బల్లు మని బాదెసడమ్మి.. తూస్తే ఏడుపొచ్చేత్తమ్మి’ అంటూ ముద్దుగా ముద్దుగా మాట్లాడిన చిన్నారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓ ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. టీచర్ అనవసరంగా తనను కొట్టాడంటూ గోదావరి యాసలో చెబుతూ చిన్నారి చూపించిన ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. ‘గట్టిగా కొట్టేశాడు ఎదవ. సార్‌దే తప్పు.. చిన్నపిల్లోడ్ని ఎందుకు కొట్టాడు’ అంటూ బుడ్డోడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అతడు మాట్లాడిన మాటలు చాలా మందికి అర్థంకాకపోయినా హావభావాలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్: వైరల్ వీడియో.. హృదయానికి హత్తుకుంటోంది!) పెద్ద మనిషిలా మాట్లాడుతున్న ఈ చిన్నారి మంచి మాటకారి అవుతాడు. గోదావరి యాసను బతికిస్తున్నాడు. మంచి రెబల్ అవుతాడు. లవ్ యు రా బుజ్జి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ బాలుడు ఏ ఊరివాడు, ఈ వీడియో ఎప్పటిదనే వివరాలు వెల్లడికాలేదు. -
గోదావరి యాసతో కట్టిపడేస్తున్న చిన్నారి
-
వారిదైన వ్యక్తీకరణ
‘బ్రదర్స్ కరమజవ్’లో ఇవాన, అల్యోషా ఇద్దరూ ఒక హోటల్లో మాట్లాడుకుంటున్నప్పుడు – గ్లాసు తీసిన తర్వాత టేబుల్క్లాత్ మీద గ్లాసు అచ్చును గమనిస్తాడు ఇవాన్. అంత సున్నితమైన గమనిం పును పాఠకుల దృష్టికి తెచ్చిన దాస్తోయెవస్కీ ముద్ర అది. నోటి దుర్వాసనను చెక్ చేసుకోవడానికి ‘ద క్యాచర్ ఇన్ ద రై’లోని హోల్డెన్ కింది పెదవిని పైకి వంచి ముక్కుకు తగిలేలా గాలి వదులుతాడు. అసలైన సాహిత్య పరిమళాన్ని ఆనందించడానికి శాలింజర్ ఇచ్చిన వివరం అది. ‘ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ’లో సముద్రంలో చేపల వేటకెళ్లి వచ్చాక, సామగ్రిని అక్కడే వదిలేద్దామనుకుంటాడు వృద్ధుడు. అక్కడ వదిలేయడం ద్వారా ఎవరికైనా దొంగతనం చేయాలన్న టెంప్టేషన్ ఎందుకు పుట్టిం చాలని తన నిర్ణయం మార్చుకుంటాడు. ఈ వాక్యాన్ని రాసిన దొర హెమింగ్వే. ఆ రచయిత మాత్రమే రాయగలిగే వాక్యం ఆ రచయితను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆ పసి రాకుమారుడు కాంతి గల వీపు కానవచ్చేటట్లుగా బోరగిలపడటం – నున్నని వీపుగల కూర్మావతారంగా కనబడుతున్నదట. ఈ చిత్రిక ‘కవికర్ణ రసాయనము’ లోనిది. అదే పద్యంలో ఇంకా వివిధ భంగిమల్లో దశావతారాలను కళ్లకు కడతాడు సంకుసాల నృసింహకవి. అసలే సూర్యుడు ఒక అగ్నిగుండం. దానికితోడు సాయంకాలం కమలినీ విరహంలో ఉన్నాడు. ఇంక ఆ వేడికి తట్టుకోలేక సముద్రంలో మునిగాడని సూర్యాస్తమయాన్ని దృశ్యమానం చేస్తుంది ‘భాస్కర రామాయణం’. సూర్యుడి వాడిౖయెన కిరణాల తాకిడికి వేగిపోయిన జగత్తు మీద వీచడం కోసం గుండ్రని విసనకర్రగా వికాసం పొందాడని చంద్రోదయాన్ని వర్ణిస్తాడు ‘విష్ణుమాయా విలాసము’ కవి. ఇక ‘గయోపాఖ్యానము’ కర్త – ఆమె సౌందర్యాన్ని చూపడానికి తాను కూడా తగనని అద్దం గుర్తించి, ముఖం చాటేసిందంటాడు. తెలుగు పద్యసాహిత్యం నిండా ఎన్నో గొప్ప వ్యక్తీకరణలు. చలికాలంలో రైల్వే స్టేషన్లో అంచులు పగిలిన కప్పుల్లో టీ తాగుతున్న శాలువా ముసుగులో ఉన్న కూలీలను చిత్రించిన త్రిపుర నుంచి, చెరువులో బెకబెకమంటున్న కప్పలు చీకట్లో మనిషి ఒంటేలు శబ్దానికి ఒక క్షణం నిలిచి, మళ్లీ అరవడం మొదలుపెట్టాయని రాసిన అజయ్‌ప్రసాద్ దాకా ఆధునిక తెలుగు సాహిత్యంలోనూ కాలాన్ని నిలిపి చూపే ఎన్నో విలువైన క్షణాలు! తల్లి కాళ్లకు ఒంగి దండం పెట్టే కొడుకుకు తల్లి పాదాల పసుపు వాసన తగలడం; ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనే ఉద్యోగిని చీర కుచ్చిళ్లలో చిన్నారి కొడుకు తలదాచుకోవడం; మౌన రుషిని తలపించే కప్ప కూర్చున్న భంగిమ... ఇలాంటి వ్యక్తీకరణలు సాహిత్యానికి ప్రాణం. సూక్ష్మంలో మోక్షం చూపే వాక్యాలివి. ఒక దగ్గర కనబడిన వాక్యం ఇంకో దగ్గర ఉండదు. అది అక్కడికి సర్వ స్వతంత్రమైనది. ఆ కవిదో, ఆ రచయితదో ఇక వారిదే. అలాంటిది ఇంకొకరు ముట్టుకోరు. ఎంగిలి వాక్యాలు రాయలేదని చలాన్ని విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించింది... అలాంటి ఎంగిలి వాక్యాలు రాయని ఏ రచయితకైనా వర్తిస్తుంది. సాహిత్యానికి మరో వైపు కూడా ఉంది. పునరుక్తి దీని ప్రధాన లక్షణం. లేత భానుడి కిరణాలు భూమిని తాకుతున్నాయి అనే వాక్యాన్ని కథల్లో ఎన్నిసార్లు చదివుంటారు? పడక్కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని పత్రిక చదివే పరంధామయ్య ఆదివారపు అనుబంధాల్లో ఎన్నిసార్లు పరామర్శించి ఉంటాడు? పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా బాల్యంలోనే ప్రతిభను చాటే నాయకులు ఎందరు తగిలారు? చిట్టచివరన, అస్తమిస్తున్న సూర్యుడి వైపు ఎందరు కథానాయికలు పయనించి ఉంటారు? ఇలాంటి వ్యక్తీకరణలు ముందుగా ఎప్పుడు, ఎలా వచ్చాయో చెప్పగలిగే సాహిత్య చరిత్రలు మనకు లేవు. అవి వచ్చినప్పుడు తాజావే కావచ్చు. వాటికవే విలువైనవే కావచ్చు. కానీ వాడీ వాడీ అరగ దీయడం వల్ల పాతకంపు కొడతాయి. ఈ జాడ్యం తెలుగుకే పరిమితమైనది అనుకోవాల్సిన పనిలేదు. ‘ఇట్ వజ్ ఎ డార్క్ అండ్ స్టార్మీ నైట్’ (అదొక చీకటి తుపాను రాత్రి) అనే వాక్యం ఎక్కడి నుంచి ఊడిపడిందనే చర్చ ఆంగ్ల సాహిత్యంలో ఈమధ్య బాగా జరిగింది. అదొక చీకటి తుపాను రాత్రి... అని గంభీరంగా ఎత్తుకోగానే తర్వాత ఏమయివుంటుందన్న కుతూహలం సహజంగానే పుడుతుంది. కానీ ఎన్నిసార్లు ఆ కుతూ హలం నిలుస్తుంది? కథల్లో మహాచెడ్డ ప్రారంభాలకు పెట్టింది పేరుగా ఈ వాక్యాన్ని అభివర్ణించింది ‘రైటర్స్డైజెస్ట్’ పత్రిక. క్లీషేకూ, మెలోడ్రామాకూ, అతిగా రాయబడిన వచనానికీ ఉదాహరణగా నిలిచిన ఈ వాక్యంతో ఎన్నో కథలు మొదలయ్యాయి. బ్రిటన్ర చయిత ఎడ్వర్డ్ బుల్వర్ లిట్టన్ 1830లో రాసిన ‘పాల్ క్లిప్ఫోర్డ్’ అనే నవల ప్రారంభంతో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని కొందరి వాదన. ఆయన ఎంతో సాహిత్యం సృజించినప్పటికీ, ఈ ‘అపకీర్తి’ వాక్యంతో ఆయన కీర్తి నిలిచి పోయిందని సరదాగా వ్యాఖ్యానించారు విమర్శకులు. కానీ తమాషా ఏమిటంటే, 1809లో ‘ఎ హిస్టరీ ఆఫ్ న్యూయార్క్’ పుస్తకం రాస్తూ వాషింగ్టన్ ఇర్వింగ్ ఇదే వాక్యాన్ని వ్యంగ్యంగా ఉదాహరి స్తాడు. అంటే, అంతకు ఎంతోముందే ఈ వాక్యం సాహిత్యంలోకి చొరబడి పాఠకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసిందన్నమాట! చిన్నకథల పితామహుడు అని చెప్పే ఎడ్గార్ అలెన్ పో కూడా దీన్ని వాడకుండా తమాయించుకోలేకపోయాడు. ‘మాస్టర్లు’ పునరుక్తులు వాడినా వారి ఇతరత్రా విస్తారమైన ప్రతిభలో అవి చెల్లిపోతాయి. కానీ సాహిత్య ‘విద్యార్థులు’ వాటికి దూరంగా ఉండడమే వారిని స్వతంత్రంగా నిలబెడుతుంది. జీవితపు అనుభవం లేకపోవడం, జీవితానికి చేరువగా వెళ్లి వాక్యాలను పిండు కోవడం తెలియనివారు మాత్రమే స్టాక్, ప్లాస్టిక్ వ్యక్తీకరణలను ఏ ప్రయత్న బరువూ లేకుండా తమ రాతల్లోకి తెచ్చేసుకుంటారు. ఎవరిని చదివినా ఒకేలా అనిపించడానికి ఇదే కారణం. -
కత్తికి రెండవ వైపు కూడా పదును
రోజా (పేరు మార్చడమైనది) ఆఫీసుకు వస్తూనే కొలీగ్ సురేష్ (పేరు మార్చడమైనది) సీట్ వద్దకు విసురుగా వెళ్లింది. సురేష్ ఆమెను చూస్తూనే సీటులో నుంచి లేచి నుంచున్నాడు. ‘అసలు నీకు బుద్ధుందా! నువ్వు మనిషివేనా!?’ అని సురేష్‌పై విరుచుకుపడింది. ఏం జరిగిందో అక్కడ ఎవ్వరికీ అర్ధం కాలేదు. నువ్వీ ఆఫీసులో ఎలా ఉంటావో చూస్తా! నన్నే కామెంట్ చేసేంత సీనుందా!? నీకు’ ఫ్రెండ్ వీణ వచ్చి నచ్చజెప్పి, తీసుకెళ్లేంతవరకు సురేష్‌ని తిడుతూనే ఉంది రోజా. ‘‘నిన్న ఆఫీసుకు నువ్వు శారీలో వచ్చావు. డ్రెస్‌లో కన్నా చీరలో సూపర్‌గా ఉన్నావ్!’ అంటూ సోషల్‌మీడియా వేదికగా రోజా ఫొటోకు రకరకాల కామెంట్స్ పెట్టాడు సురేష్. దీంతో ఆఫీసులో పెద్ద రాద్ధాంతమే జరిగింది.‘సురేష్ తననే టార్గెట్ చేశాడని, అందుకే తనను నలుగురిలో చులకన చేయడానికే రకరకాల కారణాలు వెతుకుతున్నాడంటూ రుజువులు చూపించింది రోజా. ఈ సంఘటన తర్వాత సురేష్ జాబ్ వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆఫీసులో అంతా ప్రశాంతం అనుకున్న రోజాకు నాలుగో రోజు నుంచి సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు, మెసేజ్‌లు కనపడటంతో తలకొట్టేసినట్టుగా ఉంది. ఆఫీసు టీమ్‌లో ఉన్నప్పుడు సురేష్‌తో సాధారణంగా షేర్ చేసుకున్న విషయాలు, కలివిడిగా దిగిన ఫొటోలు, తన అకౌంట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టాడు.సురేష్ చేసిన ఈ పని మూలంగా రోజాకు వచ్చిన పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయ్యింది. సురేష్ చర్యలకు తీవ్ర మానసిక వేదనకు గురైన రోజా, డిప్రెషన్‌కు లోనై ఆఫీసు పనిలో చురుగ్గా పాల్గొనలేకపోయింది. రోజాలో వచ్చిన ఈ మార్పేమిటో అర్థంకాక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. భావ వ్యక్తీకరణకు కళ్లెం తప్పదు సోషల్ మీడియా అనేది భావ వ్యక్తీకరణకు, ప్రత్యేకించి గొంతుక లేని వ్యక్తులకు చాలా శక్తివంతమైన సాధనం. సమాజంలోని వ్యక్తులతో కలిసిపోవడానికి తమ వ్యక్తిగత వివరాలు, నమ్మకాలు, ప్రాధాన్యతలను స్వచ్ఛందంగా వెల్లడిస్తారు. మనలో చాలామంది సాధారణంగా స్టేటస్‌లను అప్డేట్ చేస్తారు. ఆన్లైన్లో తమ వ్యక్తిగత ఫోటోలను పోస్ట్ చేస్తారు. అయితే, మీ ఆన్లైన్ చర్యలు భవిష్యత్తులో విద్యా, వ్యక్తిగత, వృత్తిపరమైన అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇతరులను ఇబ్బంది పెట్టే ఏ వేధింపు అయినా అది నేరమే. ► వ్యక్తులు, రాజకీయ నాయకులతో సహా సమాజంలోని అన్ని వర్గాల నుండి సామాజిక మాధ్యమాల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పెరుగుతున్నాయనేది వాస్తవం. భద్రత దృష్ట్యా సామాజిక మాధ్యమాలను సెన్సార్ చేసే ఆలోచనలకు పునాది పడిందనే విషయాన్ని విస్మరించకూడదు. ► యూజర్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో స్వేచ్ఛగా ఇచ్చేస్తుంటారు. దీంతో తమ సైట్లలో ఉపయోగించే అన్ని చర్యలను ఇతరులు ట్రాక్ చేస్తారు. తర్వాత ఉపయోగించుకోవడానికి వీలుగా వాటిని దాచిపెట్టుకుంటారు. అంటే మన ప్రతి ప్రవర్తనా అంశం ఇతరులు తమ ఉపయోగాల కోసం సేకరిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియా మర్యాదలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం ఆఫ్‌లైన్ – ఆన్‌లైన్‌ని ఒకే విధంగా పరిగణించాలి. ► సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది యూనివర్సల్ – ఎక్స్ప్రెషన్ కాదు. మీకు హాస్యం కలిగించేది ఇతరులకు హాస్యం కాకపోవచ్చు, కాబట్టి సోషల్ మీడియాలో వ్యక్తీకరణలు జాగ్రత్తగా చేయాలి. ► ఉపయోగంలో లేని మీ అన్ని సోషల్ మీడియా అప్లికేషన్లను లాగ్ ఆఫ్ చేయాలి, మీ స్మార్ట్‌ఫోన్ లో ఇతర నోటిఫికేషన్ ఫీడ్లు వ్యసనాలకు దారి తీయడమే కాకుండా ఇతరత్రా ఆటంకాలకు కారణాలవుతాయి. ► చెడు భావాలను పెంచే, పోస్ట్ చేసే ఖాతాలను అనుసరించడం వలన మీరు సోషల్ మీడియాలో ప్రతికూల అనుభవాన్ని పొందే అవకాశం ఉంది. ► ఇప్పటికే మన నిజ జీవితంలో ఎంతో పోటీని ఎదుర్కొంటున్నాం. ఆన్లైన్ ప్రపంచంలో మనకు అంతకన్నా ఎక్కువ పోటీ అవసరం లేదని గుర్తించాలి. ► ఇతరులు మిమ్మల్ని ఎలా చూడాలని మీరు కోరుకుంటున్నారో, మీ సోషల్ మీడియా కార్యకలాపాల ఆధారంగా ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారో కూడా ఇది ప్రతిబింబిస్తుంది. ► సోషల్ మీడియాలో మిమ్మల్ని ఇష్టపడని వారు మీ జాబితాలో ఉండవచ్చు. మీరు అలాంటి వారితో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యారనే విషయాన్ని నిర్ధారించుకోండి. ► ఆన్లైన్ ప్రపంచంలో విహరిస్తూ మీ ప్రియమైన వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ఉదాహరణకు.. మీ పుట్టినరోజున 100 లైక్‌లు పొందవచ్చు. కానీ, మీ ఇంట్లో ఒక స్నేహితుడు మాత్రమే మిమ్మల్ని కలిసి అభినందనలు చెప్పచ్చు. ► స్మార్ట్‌ఫోన్ లకు బదులుగా సోషల్ మీడియా ఖాతాలకు లాగిన్ అవ్వడానికి ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం మేలు. ఎందుకంటే ఇది వ్యసనంగా మారే అవకాశాన్ని తగ్గిస్తుంది. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
పోరాటమే లక్ఘ్యం
ఒక లక్ష్యం కోసం పోరాడినా... ఆ లక్ష్యాన్ని సాధించలేనప్పుడు పోరాటం ఆగాలా..! పోరాటం సాగాలా..!! మహాత్మాగాంధీ అన్నట్టు ‘‘వాళ్లు నా శరీరాన్ని హింసించవచ్చు, నా ఎముకలు విరిచేయవచ్చు, నన్ను చంపేయొచ్చు కూడా... అప్పుడైనా వాళ్లకు దొరికేది నా దేహమే... నా విధేయత కాదు’’ నేడు మానవ హక్కుల దినోత్సవం మానవ హక్కులు దేవతావస్త్రాల్లా తయారయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఘనత చాటుకునే మన భారత్‌లోను, అతిపాత ప్రజాస్వామ్య దేశంగా జబ్బలు చరుచుకునే అగ్రరాజ్యం అమెరికాలోనూ మానవ హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఇక నియంతృత్వ పాలన సాగుతున్న దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో తేలికగానే అర్థం చేసుకోవచ్చు. చాలాచోట్ల ప్రభుత్వాలే నిస్సిగ్గుగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. ఇంకొన్ని చోట్ల ప్రభుత్వాలు మానవ హక్కుల పరిరక్షణకు కంటితుడుపుగా అధికారిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నా, అలాంటి చోట్ల ప్రభుత్వాల అధీనంలో పనిచేసే శాంతిభద్రతల బలగాలు, రక్షణ బలగాలు ప్రజల కనీస మానవ హక్కులను కాలరాస్తున్నాయి. ప్రపంచంలోని మిగిలిన దేశాల సంగతి సరే, ముందు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఘనత పొందిన మన భారత దేశంలో మానవ హక్కుల పరిస్థితిని ఒకసారి చూద్దాం. మన రాజ్యాంగం జీవించే హక్కును, సమానత్వ హక్కును, దోపిడీకి గురికాకుండా ఉండే హక్కును, భావ ప్రకటనా స్వేచ్ఛను, విద్యాహక్కును, సాంస్కృతిక స్వేచ్ఛను, మత స్వేచ్ఛను, గోప్యత హక్కును ప్రాథమిక హక్కులుగా గుర్తించింది. ఈ హక్కులకు భంగం వాటిల్లితే రాజ్యాంగ పరిధిలో చట్టపరంగా రక్షణ పొందే హక్కును కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మన రాజ్యాంగంలో హక్కులు, మన చట్టాల్లో హక్కుల పరిరక్షణ మార్గాలు చాలా పకడ్బందీగానే ఉన్నా, మన దేశంలో యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో మానవ హక్కులకు రక్షణ కల్పించడానికి 1993లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడింది. తర్వాతి కాలంలో వివిధ రాష్ట్రాల్లోనూ మానవ హక్కుల కమిషన్లు ఏర్పడ్డాయి. ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నా, మానవ హక్కులకు భరోసా కల్పించడంలో మన దేశంలో పెద్దగా సాధించినదేమీ లేకపోగా, ఎక్కడో ఒకచోట సామాన్యుల హక్కులకు తరచుగా విఘాతం కలుగుతూనే ఉంది. హక్కుల ఉల్లంఘనలో మన రికార్డు స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఏళ్లు నిండినా, ఆధునిక బానిసత్వంలో, వెట్టిచాకిరిలో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. కట్టుబానిసలుగా వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న అమాయకుల సంఖ్య మన దేశంలో 1.83 కోట్లు అని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెట్టి చాకిరిలో మగ్గుతున్న వారి సంఖ్య 4.58 కోట్లు అయితే, వారిలో దాదాపు మూడోవంతుకు పైగా వెట్టి కార్మికులు మన దేశంలోనే ఉన్నారు. దోపిడీకి గురికాకుండా ఉండే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించిన మన దేశమే శ్రమ దోపిడిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుండటం విషాదకర వాస్తవం. దేశంలో విద్యా హక్కు అమలులో ఉన్నా, దాదాపు 1.26 కోట్ల మంది చిన్నారులు పొట్ట పోసుకోవడానికి ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనులు చేస్తున్నారు. వీరిలో చాలామంది నామమాత్రపు ప్రతిఫలానికి వెట్టిచాకిరి చేస్తున్నవారే. పేదరికం వల్ల అప్పులపాలైన తల్లిదండ్రులు తమ పిల్లలను రుణదాతల వద్ద వెట్టిచాకిరికి పెడుతున్నారు. వెట్టిచాకిరి కోరల్లో చిక్కుకుంటున్న బాలికల్లో చాలామంది లైంగిక దోపిడీకి గురవుతున్నారు. రక్షకులే భక్షకులు మానవ హక్కుల పరిరక్షణలో, శాంతిభద్రతల అమలులో కీలక పాత్ర పోషించాల్సిన పోలీసు బలగాలు యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. పోలీసుల కస్టడీలోను, జుడీషియల్ కస్టడీలోను చిత్రహింసలకు తాళలేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన దేశంలోని పరిస్థితినే గమనిస్తే, 2001–13 మధ్య కాలంలో 1,275 మంది పోలీసు కస్టడీలో మరణించారు. అదే కాలంలో ఏకంగా 12,727 మంది జుడీషియల్ కస్టడీలో ప్రాణాలు వదిలారు. పోలీసు కస్టడీ మరణాలకు సంబంధించి మహారాష్ట్ర (306), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (210), గుజరాత్ (152) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కస్టడీ మరణాలకు సంబంధించి 2013 సంవత్సరం తర్వాతి లెక్కలను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఆ లెక్కలను కూడా కలుపుకుంటే, ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుంది. ఇక ఎన్కౌంటర్ల పేరిట భద్రతా బలగాలు పొట్టన పెట్టుకుంటున్న వారి సంఖ్య దీనికి అదనం. జమ్ము కశ్మీర్‌లోను, ఈశాన్య రాష్ట్రాల్లోను భద్రతా బలగాలు సామాన్యులపై సాగించే దమనకాండకు సంబంధించి నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎవరిపై అయినా ఉగ్రవాదులు, తీవ్రవాదులు అనే అనుమానం వస్తే చాలు, కాల్చి పారేయడమే పనిగా పెట్టుకున్న పోలీసులు ఈశాన్య రాష్ట్రాల్లో చాలామందే ఉన్నారు. ఉగ్రవాదులుగా అనుమానించిన దాదాపు వందమందిని తాను స్వయంగా కాల్చి చంపానని మణిపూర్‌కు చెందిన హెరోజిత్ అనే మాజీ పోలీసు అధికారి పాత్రికేయుల వద్ద సగర్వంగా చెప్పుకున్నాడంటే ఆ ప్రాంతంలో మానవ హక్కుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోలీసు కస్టడీ, జుడీషియల్ కస్టడీల్లో సంభవిస్తున్న మరణాలకు సంబంధించి బాధ్యులకు శిక్షలు పడుతున్న సందర్భాలు దాదాపు రెండు శాతం మాత్రమే ఉంటున్నాయి. కస్టడీ మరణాలు, బూటకపు ఎన్కౌంటర్లు ఒక ఎత్తయితే, మరోవైపు... బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడటం, కూంబింగ్ ఆపరేషన్ల పేరిట అత్యాచారాలకు తెగబడటం, చట్ట విరుద్ధంగా సెటిల్మెంట్లు చేయడం, పౌరుల పట్ల నిష్కారణంగా దురుసుగా ప్రవర్తించడం, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడం వంటి ‘ఘన’కార్యాలు కూడా మన పోలీసులకు చాలా మామూలు విషయాలు. కేవలం 2015 సంవత్సరంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 46 మంది మహిళలు పోలీసుల చేతిలో అత్యాచారాలకు గురయ్యారని జాతీయ మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. మన పోలీసుల మానవ హక్కుల ఉల్లం‘ఘన’ చరిత్ర విదేశాలకూ పాకింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నందున సీఆర్పీఎఫ్ మాజీ ఐజీ తేజీందర్ సింగ్ ధిల్లాన్‌కు వీసా ఇచ్చేందుకు కెనడా నిరాకరించింది. మానవ హక్కుల ఉల్లంఘనలో మన పోలీసుల ‘ఘనత’కు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులపై గత ఏడాది 36 వేలకు పైగా కేసులు నమోదైనట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రకటించింది. భావప్రకటనకూ దిక్కులేదు స్వతంత్ర భారత దేశంలో భావ ప్రకటనకూ దిక్కులేకుండా పోతోంది. ఎమర్జెన్సీకాలంలో భావప్రకటనకు పూర్తిగా సంకెళ్లు పడ్డాయి. ఆ తర్వాత ఇటీవలి కాలంలో భావప్రకటనా స్వేచ్ఛకు తరచుగా అవరోధాలు ఏర్పడుతున్నాయి. కార్టూన్లు వేసినందుకు, వ్యాసాలు, పుస్తకాలు రాసినందుకు, చివరకు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేసినందుకు కటకటాల వెనక్కు వెళ్లే పరిస్థితులు, కేసుల్లో చిక్కుకునే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రభుత్వంపైన, ప్రభుత్వాధినేతలపైన విమర్శలు చేసే వారికి బెదిరింపులు, భౌతిక దాడులు ఎదురవుతున్నాయి. అవినీతి బాగోతాలను బట్టబయలు చేసేందుకు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయిస్తున్న వారిలో కొందరికి ఏకంగా ప్రాణాలకే ముప్పు ఎదురవుతోంది. సమాజంలో భిన్నాభిప్రాయాలను గౌరవించే లక్షణం తగ్గిపోతోంది. ఒక వర్గం అభిప్రాయాలకు భిన్నంగా మరోవర్గానికి చెందిన వారెవరైనా అభిప్రాయాలను వ్యక్తం చేస్తే, వారిపై భౌతిక దాడులకు తెగబడే మూకలు పేట్రేగిపోతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలను హరించడానికి కూడా అలాంటి మూకలు వెనుకాడటం లేదు. వీళ్ల తాకిడికి ఎక్కువగా రచయితలు, కళాకారులు, అవినీతి పాలనపై విమర్శలు సంధించే వాళ్లు, నిబంధనలకు కట్టుబడి నిజాయతీగా విధులు నిర్వర్తించే ప్రభుత్వాధికారులు బాధితులవుతున్నారు. కర్ణాటకలో పత్రికా సంపాదకురాలు గౌరీ లంకేష్ హత్య, ‘పద్మావతి’ సినిమా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, ఆ సినిమా కథానాయకురాలు దీపికా పదుకొనెలపై బెదిరింపులు, ఫత్వాలు ఇలాంటి పోకడలకు తాజా ఉదాహరణలు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వారిలో మత ఛాందసులతో పాటు రాజకీయ పదవుల్లో కొనసాగుతున్న నాయకులు కూడా ఉంటున్నారు. దేశ రాజ్యాంగంపైన కనీస గౌరవం లేని ఇలాంటి నాయకులు చట్టసభల్లో కొనసాగుతున్నారు. బలహీనులే బాధితులు మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి బలహీనులే బాధితులుగా మిగులుతున్నారు. సమాజంలోని బలహీనులు తరచుగా హక్కుల అణచివేతకు గురవుతున్నా, వారికి న్యాయం దక్కుతున్న సందర్భాలు మాత్రం అరుదుగానే ఉంటున్నాయి. మహిళలు, దళితులు, మైనారిటీలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం మన దేశంలో గత ఏడాది దళితులపై 45 వేలకు పైగా నేరాలు జరిగాయి. గిరిజనులపై 11వేలకు పైగా నేరాలు జరిగాయి. గడచిన రెండేళ్లలో మైనారిటీలపైన, దళితులపైన గోపరిరక్షక దళాల దాడులు గణనీయంగా పెరిగాయి. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం 2015లో మత ఘర్షణలకు సంబంధించి దాదాపు 750 సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనల్లో 97 మంది మైనారిటీలు ప్రాణాలు కోల్పోయారు. 2016 సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లోనే ఇలాంటి 275 మత ఘర్షణలు జరిగి 38 మంది మరణాలకు దారితీశాయి. కుల మతాలకు అతీతంగా ప్రేమించుకున్న ప్రేమజంటలు పరువు హత్యలకు గురవుతున్నారు. సభ్య సమాజంలో ఇలాంటి పరువు హత్యలు అత్యంత హేయమైనవి అంటూ సుప్రీంకోర్టు ఒక తీర్పులో తీవ్రంగా అభిశంసించినా, ఈ సంఘటనలు తగ్గకపోగా మరింతగా పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2014లో 28 పరువు హత్యలు జరిగితే, 2015లో ఏకంగా 251 హత్యలు జరిగాయి. ఎక్కువగా దళితులు, మైనారిటీలు, మహిళలే పరువు హత్యల బారిన పడుతున్నారు. ప్రపంచంలో కొన్ని దారుణమైన ఉల్లంఘనలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రకరకాలుగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. పలు దేశాల్లో ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలోని ‘రక్షణ’బలగాలు ఇష్టానుసారం సామాన్యుల హక్కులను కాలరాస్తున్నాయి. ప్రపంచమంతటికీ మానవ హక్కులపై సుద్దులు చెప్పే పెద్దన్న అమెరికాలో నల్లజాతి వారికి సమాన హక్కులు ఇప్పటికీ దక్కడం లేదు. అక్కడి చట్టాల ప్రకారం పౌరులందరికీ సమాన హక్కులు ఉన్నా, అమెరికన్ పోలీసులు మాత్రం నల్లజాతి ప్రజల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారు. కేవలం ‘అనుమానం’తో నల్లజాతి వారిపై ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతున్న ఉదంతాలు తరచుగా వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఉత్తర ఇరాక్, సిరియా ప్రాంతాలను గుప్పిట్లో పెట్టుకున్న ‘ఐసిస్’ పాల్పడుతున్న ఘాతుకాల గురించి చెప్పుకుంటే పెద్ద గ్రంథమే తయారవుతుంది. ఇండోనేసియా జాతీయ పోలీసు దళంలోకి మహిళలు ఎవరైనా చేరాలనుకుంటే వారు తప్పనిసరిగా కన్యత్వ పరీక్షలను ఎదుర్కోవాల్సిందే. ఎడాపెడా మరణశిక్షలను అమలు చేయడంలో చైనా రూటే సెపరేటు. మరణశిక్ష విధించిన ఖైదీల నుంచి అవయవాలు సేకరించి, వాటిని అవయవ మార్పిడి చికిత్సలకు ఉపయోగించడం అక్కడ సర్వసాధారణం. కాంగో, గాంబియా వంటి ఆఫ్రికా దేశాలైతే పౌరుల పాలిట ప్రత్యక్ష నరకాలే! ఉత్తర కొరియాలో పరిస్థితి మరీ దారుణం. అక్కడ అధ్యక్షుడి ఆగ్రహానికి గురైతే ఎంతటి వారైనా ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే! అక్కడి మహిళా సైనికులపై జరుగుతున్న ఘాతుకాలపై వెలుగులోకి వచ్చిన కథనాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మయన్మార్‌లో అక్కడి బలగాలు రోహింగ్యాలకు కనీస హక్కులను నిరాకరించడమే కాకుండా, బలప్రయోగంతో దేశం నుంచి వెళ్లగొడుతుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో అణచివేతలు... ఆంధ్రప్రదేశ్‌లోనూ హక్కుల ఉల్లంఘనలు కొత్త ముచ్చటేమీ కాదు. ప్రజల హక్కులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఉదంతాలు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలోని తుందుర్రు గ్రామ ప్రజలు తమ ఉనికికే ముప్పుగా మారిన గోదావరి మెగా అక్వా ఫుడ్ పార్కు పేరిట రొయ్యల ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగితే, ప్రభుత్వం వారిపై దమనకాండకు పాల్పడింది. రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయనాల వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవడమే కాకుండా, సమీప గ్రామాల మత్స్యకారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండటంతో ఆందోళనలు చెలరేగాయి. రొయ్యల ఫ్యాక్టరీని గ్రామాలకు చేరువలో కాకుండా, సముద్ర తీరానికి తరలించాలంటూ తుందుర్రు చుట్టుపక్కల దాదాపు నలభై గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు పలికినా, ప్రభుత్వం మాత్రం గ్రామస్తుల గోడు పట్టించుకోకుండా ఆందోళనకారులపై కేసులు బనాయించి, జైళ్లలోకి నెట్టింది. ►కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారుగా ఉన్న సమయంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రోద్బలంతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చాలానే జరుగుతున్నాయి. ►భీమవరానికి చేరువలోని గరగపర్రు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు మూడువందల దళిత కుటుంబాలను అగ్రవర్ణాల వారు సాంఘిక బహిష్కరణకు గురిచేశారు. ►శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని కొవ్వాడలో తలపెట్టిన అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా సమీప గ్రామాల ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనలను ఎలాగైనా అణచివేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆ ప్రాంతంలో సంక్షేమ పథకాలతో పాటు, స్థిరాస్తుల క్రయవిక్రయాలను కూడా నిలిపివేసింది. ►నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం పంట భూములను బలవంతంగా సేకరిస్తుండటానికి వ్యతిరేకంగా గుంటూరు జిల్లా ఉండవల్లి మండలంలోని పెనుమాక గ్రామస్తులు మూడేళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. ►కర్నూలు జిల్లా పాములపాడు మండలంలోని వెంపెంట గ్రామస్తులు తమ ఉనికికే ముప్పుగా మారిన పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఏళ్ల తరబడి పోరాటం కొనసాగిస్తున్నా, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ►తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ పరిశ్రమకు ప్రభుత్వం 505 ఎకరాల అసైన్డ్ భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే తమ మనుగడకే ముప్పు వాటిల్లుతుందంటూ పంపాదిపేట పరిసర గ్రామాల ప్రజలు న్యాయపోరాటం సాగిస్తున్నారు. ►ఇవన్నీ ఒక ఎత్తయితే, రెండేళ్ల కిందట చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లనే నెపంతో ఇరవై మంది కూలీలను పోలీసులు కాల్చి చంపారు. ఈ సంఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా అభిశంసించింది. -
కామెంట్లు కూశావో..!
క్రైమ్ పేరెంటింగ్ అమ్మాయిలు ఇప్పుడిప్పుడే కొంచెం స్వేచ్ఛను పీల్చుకుంటున్నారు వాళ్లకు ఆ శ్వాస చాలా అవసరం! తమ పరిపూర్ణవ్యక్తిత్వానికి ఆ స్వేచ్ఛా ఊపిరి చాలా అవసరం!! రోడ్డు మీద నడవనివ్వడంలేదు.. ఆఫీసుల్లో కూర్చోనివ్వడంలేదు.. స్కూళ్లల్లో తలెత్తనివ్వడంలేదు.. ఇంట్లో నోరెత్తనివ్వడంలేదు! ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా అమ్మాయిల భావవ్యక్తీకరణను అడ్డుకుంటున్నారు.. వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు.. ఆత్మాభిమానాన్ని చంపేస్తున్నారు!! అలా కామెంట్లు కూయడం ఐటీ యాక్ట్ కింద నేరం. అరెస్ట్ వరకూ వెళుతుంది. సో మన పిల్లలకు ఇప్పటినుంచే మంచి చెడ్డలు చెప్పాలి. ఎడమచేత్తో ఓ నల్లటి పప్పీని, కుడిచేతిలో కోక్ గ్లాస్‌ను చీర్స్లా పెట్టి... చిలిపిగా కన్నుగీటుతూ ఉన్న ఒక ఫొటోగ్రాఫ్‌ను .. ‘విత్ మై బ్లాక్ డాగ్’ అనే కామెంట్‌తో ఫేస్బుక్లో పోస్ట్ చేసింది ఒక టీనేజర్.. దాన్ని షేర్ చేసింది పదిహేడేళ్ల కావ్య. ‘‘ఆడోళ్లకు స్వేచ్ఛ లేదని ఎవడు అన్నది?’’ అని ఒకరు... ‘‘పాపా... నీదేం బ్రాండ్?’’ అని ఇంకొకరు.. ‘‘నేను కూడా బ్లాగ్ డాగే.. రావాలా?’’ అని మరొకరు.. ‘‘బేబీ.. నేను ఓల్డ్‌మంక్.. పర్లేదు కదా..’’ అని ఎవరో.. ఇలా రకరకాల కామెంట్స్ టైప్ అయ్యాయి ఆమె షేర్ చేసిన పోస్టింగ్ కింద. వాళ్లంతా మగపిల్లలే.. ఎఫ్బీ ఫెండ్సే.. కొందరైతే కావ్య క్లాస్మేట్స్ కూడా! నవ్వుకొని లైట్ తీసుకుంది ఆమె. ఇంకోరోజు.. ‘రుతుచక్రం స్త్రీలకు అవమానం కాదు.. ప్రైడ్’’ అన్న ఒక కాప్షన్‌ను పోస్ట్ చేసింది కావ్య. దానికీ అంతే .. ‘‘ఏ ప్యాడ్ వాడుతావు నువ్వు?’’ ‘‘విస్పరా?’’.. ‘‘కాదేమో.. కావ్య ఫ్రీగా ఉంటుంది కదా.. కేర్ ఫ్రీ అనుకుంటా’’ ‘‘ షీ?’’ ‘‘బేబీ కాంప్లెక్షన్ పింక్... అందుకే విస్పర్ పింకేమో..’’ ఇలా ఎన్నో వ్యాఖ్యానాలు ట్రోలింగ్ స్థాయి దాటాయి.. అవన్నీ కావ్యకు చిరాకు తెప్పించినా ఓపిగ్గా ఉంది. మరోరోజు...‘‘స్లీవ్‌లెస్.. జీన్స్.. స్కర్ట్.. శారీ... నచ్చిన, నప్పిన డ్రెస్ వేసుకునే రైట్ ఆడవాళ్లకు ఉంది’’అని వాల్ మీద తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది కావ్య. ‘‘టాప్‌లెస్‌గా కూడా తిరగొచ్చు’’ ‘‘బికినీ అయితే పాపలకు చాలా బాగా సూట్ అవుతుంది’’ ‘‘చెడ్డీలు కూడా వేసుకోండి’’ ‘‘సిగ్గులేదా... పిచ్చిపిచ్చి పోస్టింగ్స్ పెట్టడానికి?’’ ‘‘దీన్నే బరితెగింపు’’ అంటారు.. ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు ఒక యాభై వచ్చాయి. బెదిరిపోయింది కావ్య. రెండు రోజులు బాధపడింది. ఆ పోస్ట్‌ను డిలీట్ చేసేసింది. దాంతో ఆమె ఇన్‌బాక్స్‌కి మెస్సేజెస్ రావడం మొదలయ్యాయి. ‘‘ఇంట్లో ఒక్కదానివే ఉంటావా?’’, ‘‘ఈ నైట్‌కి రానా?’’, ‘‘కలుస్తావా?’’, ‘‘నువ్వు నాకు నచ్చావ్?’’ లాంటివి ఏవేవో పెట్టారు కుర్రాళ్లు.ఇంకొంతమందైతే ఏకంగా బూతు బొమ్మలు పంపారు. వాళ్లందరూ ఎఫ్బీలో మ్యూచువల్ ఫ్రెండ్స్. షాక్ అయింది కావ్య. మర్నాడు కాలేజ్‌కి వెళ్లడానిక్కూడా భయపడింది. క్లోజ్ ఫ్రెండ్స్‌తో విషయాన్ని చెప్పింది. ఇలాంటివి తమకూ అనుభవమేనని, అందుకే ఎఫ్బీకి దూరంగా ఉంటున్నామని చెప్పారు వాళ్లు. ఆ మాటలతో దిగులు పెరిగింది కావ్యకు. వారమైనా తన ఎఫ్బీ ఇన్‌బాక్స్‌కు అలాంటి కామెంట్లు వస్తూనే ఉన్నాయి. దాంతో ఎఫ్బీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే వణుకొస్తోంది. ‘‘మన ఫోటోస్‌ను మార్ఫింగ్ చేసి వేరేవాళ్లకు పోస్ట్ చేస్తారే.. బ్లాక్మెయిల్ కూడా చేస్తారు’’ ఒక ఫ్రెండ్ చెప్పిన మాట గుర్తొచ్చి ఎఫ్బీలో ఉన్న తన ఫోటోలన్నీ డిలీట్ చేసింది కావ్య. దానికి సంబంధించి.. టైమ్‌లైన్ మీదే కామెంట్స్ చేశారు.. ‘‘... ఫోటోస్ ఎందుకు తీసేశావ్?’’ అని, ‘‘హేయ్.. కావ్యా.. వాట్ హ్యాపెండ్.. ఫోటోస్ ఎందుకు డిలీట్ చేశావ్.. నీలాంటి క్యూట్ గర్ల్ మాకు కనపడకపోతే.. ఎట్లా.. నిద్ర రావట్లేదు డియర్’’ అంటూ.. నోటికొచ్చినట్టు నానా చెత్త రాయసాగారు. ఇంట్లో వాళ్లకు తెలిస్తే.. తననే తప్పుబట్టి.. ‘చదువుకొమ్మంటే ఇట్లా ఎఫ్బీలో ఎంటర్టైన్ చేస్తోంద’ని ఇంటర్నెట్ కనెక్షనే తీసేస్తారేమోనని అమ్మానాన్నకూ చెప్పలేదు. తనే ఎఫ్బీ చూసుకోవడం తగ్గించింది. కాలేజ్‌లో మేల్ క్లాస్మేట్స్ డైరెక్ట్‌గానే కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ‘‘కావ్యా నువ్వు చాలా ఫాస్ట్.. మెన్స్ట్రువల్ ప్యాడ్స్ దగ్గర్నుంచి గర్ల్స్ రైట్స్ దాకా దేన్నయినా డిస్కస్ చేయగలవ్ ఎఫ్బీలో. గుడ్ యార్’’ అంటూ వెకిలిగా నవ్వడం, ‘‘నీలాంటి ఫ్రెండ్ ఉండడం లక్కీ డియర్’’ అంటూ బొటనవేలు పైకెత్తి చూపడం.. ‘‘మీట్ మిస్ కావ్యా.. ఫెమినిస్ట్..’’ అంటూ ఆటపట్టించడం మొదలుపెట్టారు. కొందరికి ధైర్యంగానే రిటార్ట్ ఇచ్చింది. ఇంకొందరినీ ఇగ్నోర్ చేసింది.. ఇందరితో వాదన పెట్టుకోలేక ప్రిన్సిపల్‌కి కంప్లయింట్ చేసింది. నీదే తప్పు జరిగిందంతా విని.. ‘‘నీకు ఫేస్బుక్ అకౌంట్ ఉన్నట్లు మీ పేరెంట్స్‌కి తెలుసా?’’ అడిగాడు ప్రిన్సిపల్ కావ్యను. ‘‘తేలీదు’’ అన్నట్లు తల అడ్డంగా ఊపింది. ‘‘సరే నువ్వు క్లాస్‌కి వెళ్లు’’ అని ఆమెను పంపించేసి, కావ్య తల్లిదండ్రులను పిలిపించాడు. కావ్య ఎఫ్బీలో ట్రోలింగ్, అది అబ్యూజ్ స్థాయికి వెళ్లడం గురించి చెప్పి.. ‘‘అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఆ పోస్టింగ్స్ ఏంటండి? మగపిల్లలు పోకిరీలు అని తెలిసీ, అలాంటి పోస్టింగ్స్ పెట్టడం తప్పు కదా.. పైగా తనే వచ్చి కంప్లయింట్ చేస్తోంది. ముందు అమ్మాయిని ఎఫ్బీ అకౌంట్ క్లోజ్ చేయమని చెప్పండి’’ అని సలహా ఇచ్చాడు ప్రిన్సిపల్. కావ్య వాళ్లమ్మ భయపడి.. ‘‘మాతో చెప్పలేదండీ మా అమ్మాయి ఈ ప్రాబ్లం గురించి?’’ అన్నది. ‘‘మరి అలా ట్రోల్చేసిన, అబ్యూజ్ కూడా చేసిన పిల్లల మీద మాత్రం యాక్షన్ తీసుకోరా? నాకు తెలిసి అందులో చాలామంది కావ్య క్లాస్‌మేట్సే ఉండి ఉంటారు’’ అన్నాడు కావ్య తండ్రి కాస్త సీరియస్‌గానే. ‘‘ఆడపిల్లలు రెచ్చగొడితే మగపిల్లల బిహేవియర్ అలాగే ఉంటుంది. నేను వాళ్లను క్వశ్చన్ చేసినా అదే మాట అంటారు కూడా’’ నింపాదిగా జవాబిచ్చాడు ప్రిన్సిపల్. ‘‘అయితే తప్పు మా అమ్మాయిదే కాని అలా అవాకులు చవాకులు పేలిన వాళ్లది మాత్రం కాదంటారు’’ అన్నాడు కావ్య తండ్రి. అవాక్కయిన వాడల్లే అతని మొహం చూశాడు ప్రిన్సిపల్.‘‘మీకు తెలుసో లేదో..ట్రోలింగ్, ఆన్లైన్ అబ్యూజ్ కూడా హెరాస్మెంట్ కిందకే వస్తాయి.. ఇవన్నీ నేరాలే సర్..’’ అన్నాడు కావ్య తండ్రి కఠినంగానే.‘‘చూడండీ.. ఇది ఆ అమ్మాయి ప్రైవేట్ వ్యవహారం. మాకు సంబంధం లేదు. మీరు ఒకవేళ దీన్ని సీరియస్‌గా తీసుకుంటే ముందు టీసీ తీసుకొని, తర్వాత విషయం తేల్చుకోండి’’ అని లేచి నిలబడ్డాడు ప్రిన్సిపల్ వాళ్లను ఇక వెళ్లమన్నట్టుగా. ‘‘థాంక్స్’’ చెప్పి భార్యను తీసుకొని బయటకు వచ్చాడు కావ్య తండ్రి. కంప్లయింట్... తెల్లవారి కూతురి ఫేస్బుక్ అకౌంట్లోని ఆమె పోస్టింగ్స్, వాటికి వచ్చిన కామెంట్స్ ప్రింటవుట్స్తో సహా కావ్యనూ తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు ఆమె తండ్రి వినయ్. జరిగిందంతా పోలీసులకు కంప్లైంట్‌గా రాసిచ్చింది కావ్య సాక్ష్యాలుగా ఆ ప్రింట్ అవుట్స్‌ను జతచేస్తూ. క్లాస్మేట్స్ని ముందుగా పిలిపించారు.. మిగిలిన వాళ్లనూ పిలిపించారు. అందరూ 18 ఏళ్లలోపు మగపిల్లలే. కావ్యకు ‘సారీ’ చెప్పించి, రెండు గంటలు స్టేషన్లోనే ఉంచి తల్లిదండ్రుల ముందే వాళ్లకు కౌన్సెలింగ్ చేశారు పోలీసులు. మళ్లీ ఎవరి విషయంలోనైనా ఇలాంటిది రిపీట్ అయితే పనిష్మెంట్ సీరియస్‌గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చి మరీ పంపించేశారు. కాని.. ట్రోలింగ్ అనేది ఐటి యాక్ట్, 2000 కింద నేరమే. ఐపీసీలోని స్టాకింగ్, డిఫమేషన్, ఆడపిల్ల ఆత్మాభిమానాన్ని కించపరిచారనే నేరాల కింద కేస్ పెట్టచ్చు. ఆన్లైన్లో మహిళలు హెరాస్మెంట్ ముఖ్యంగా రేప్ థ్రెట్ ఎదుర్కొంటుంటే ఐపీసీ సెక్షన్ 507 కింద కేస్ వేయొచ్చు. అలాగే అనుమతి లేకుండా అమ్మాయిల (స్నేహితులైనా, సన్నిహితులైనా సరే) ఫోటోలు పోస్ట్ చేయడం, వాళ్ల ప్రైవసీనీ భంగం చేయడం లాంటి వాటికి పాల్పడితే ఐటీ యాక్ట్, సెక్షన్ 66 ఈ, పనిష్మెంట్ ఫర్ వయోలేషన్ ఆఫ్ ప్రైవసీ కింద నేరంగా పరిగణిస్తారు. అసభ్యకర పదజాలం, చిహ్నాలు, ప్రతీకాత్మక చిత్రాలు, బొమ్మలు, దృశ్యాలు వంటివి పోస్ట్ చేసి సదరు వ్యక్తి పేరు, ప్రతిష్టలు, గౌరవానికి భంగం కలిగించేలా చేసినా శిక్షార్హులే. అంతేకాదు, మహిళ ఆత్మాభిమానాన్ని కించపరిచేలా పదాలు, చిహ్నాలు వంటివి పెట్టినా ఐపీసీ సెక్షన్ 509 కింద నేరం. నిర్భయ చట్టంలోని సెక్షన్ 354ఏ, 354డి సెక్షన్లు హెరాస్మెంట్ వయా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ నేరాలను సూచిస్తున్నాయి. మనం ఆచరిస్తే... వాళ్లు అనుసరిస్తారు! పిల్లలు టీన్స్‌లోకి వచ్చాకే అన్నీ చెప్తాం అంటే ఈ రోజుల్లో కుదరదు. అందుకే వాళ్లకు పది, పన్నెండేళ్ల వయసు వచ్చాక ఇంటర్నెట్, దాని ప్రభావాలు, అందులో చర్చకు వచ్చే విషయాలు మొదలైన వాటి గురించి నెమ్మది నెమ్మదిగా– వాళ్ల మనసుకు తగ్గట్టుగా చెబుతూ పోవాలి. టీన్స్‌లో పిల్లలు కుదురుగా కూర్చొని వినరు. అందుకే కాస్త ముందుగానే పిల్లలతో మాట్లాడటం, సమకాలీన విషయాలు, మంచిచెడ్డల గురించి చర్చించడం మొదలుపెట్టాలి. అమ్మాయిలకు గౌరవం ఇవ్వడం, వాళ్లకూ భావాలను ఎక్స్‌ప్రెస్ చేసే హక్కు ఉందని, వాళ్ల భావాలనూ మనం గౌరవించాలని చెప్పడమే కాదు, మన చేతల ద్వారా చూపించాలి. అంటే.. ఇంట్లో పెద్దవాళ్లు ఇంట్లో ఆడవాళ్లను, అమ్మాయిలను గౌరవంగా చూడ్డం, వాళ్ల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే మగపిల్లలూ అలాగే వ్యవహరిస్తారు. బయటి ఆడపిల్లలకూ అంతే మర్యాద ఇస్తారు. అంతేకాదు, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్క్ సిస్టమ్‌లో ఎవరైనా ఏదైనా పోస్ట్ చేస్తే దానికి కామెంట్ పెట్టేముందు మన కళ్లెదుటే ఆ వ్యక్తి ఉంటే కఠినంగా, అమర్యాదగా మాట్లాడలేం కదా, కాబట్టి కామెంట్ కూడా అంతే మర్యాదగా ఉండాలి. పిల్లలు తప్పుగా ఆలోచించినప్పుడు, తప్పు చేసినప్పుడు బాల్యం నుంచే సరిదిద్దుతూ ఉండాలి. దాంతో చిన్నప్పటినుంచే ఎదుటివాళ్లపట్ల మర్యాదగా మెలగడం, గౌరవంగా వ్యవహరించడం అలవడుతుంది. – డాక్టర్ పద్మ పాల్వాయి, చైల్డ్ సైకియాట్రిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ – శరాది -
వైరల్‌గా మారిన విరాట్ ఎక్స్ప్రెషన్
లండన్: చాంపియన్స్ ట్రోఫిలో భాగంగా బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శించిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటీజన్లు కోహ్లీ ఎక్స్‌ప్రెషన్‌పై కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. బంగ్లా బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ క్యాచ్‌ను అందుకున్న అనంతరం కోహ్లీ నాలుక బయటకు పెట్టి తన ఆనందం వ్యక్తం చేశాడు. ఊహించని ఈ కోహ్లీ ఎక్స్ప్రెషన్ కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. మాంచి ఆకలితో ఉన్నప్పుడు బిర్యానీని చూసినప్పుడు ఇలా చేస్తాం అని కొందరంటోంటే.. మ్యాచ్ విన్నింగ్ ఎక్స్ప్రెషన్ అది అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. -
భావ వ్యక్తీకరణ నైపుణ్యాలతో అవకాశాలు
జేఎన్టీయూ: భావవ్యక్తీకరణ నైపుణ్యాలు (కమ్యూనికేషన్స్ స్కిల్స్) పెంపొందించుకుంటేనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్. వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్‌డే నిర్వహించారు. ఆచార్య వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇంగ్లిష్తో పాటు జపనీస్, చైనీస్, స్పానిష్ భాషలను విద్యార్థులు నేర్చుకోవాలన్నారు. అనేక విదేశీ కంపెనీలు ఏపీకి రానుండడంతో విదేశీ భాషలు నేర్చుకున్న వారికి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. అనంతరం విశిష్ట అతిథిగా హాజరైన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ.. కళాశాలలో ఉన్న వసతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాజాన్ని ప్రేమించాలని.. అది మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తుందన్నారు. -
కంట్రోల్... కంట్రోల్...
హిట్ క్యారెక్టర్ రైటర్‌గా వచ్చి కమెడియన్‌గా స్థిరపడినవాడు ఎమ్మెస్ నారాయణ. టైమింగ్ విషయంలో చితగ్గొట్టేస్తాడు. ఎక్కడ ఏ పంచ్ పడాలో, ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో... ఆయనకు కొట్టిన పిండి. అది మామూలు పిండి కాదు... మైదా పిండి. అందుకే మన గుండెలమీద కామెడీ వాల్పోస్టర్లాగా అతుక్కుపోయాడు ఎమ్మెస్. అందరూ ఫ్యాక్షనిజమ్లో హీరోయిజమ్ చూపిస్తే... ఎమ్మెస్ ఏమో ఫ్యాక్షనిజమ్లోకామెడీయిజమ్ పండించాడు. ఒట్టేసి చెప్పినా... చెప్పకున్నా ఈ సినిమాలో ‘రేనా’ పాత్ర అది‘రేన్’! సినిమా పేరు : ఒట్టేసి చెపుతున్నా (2003) డెరైక్ట్ చేసింది : ఇ. సత్తిబాబు సినిమా తీసింది : కె. అనిల్ కుమార్ మాటలు రాసింది : చింతపల్లి రమణ రేనా అంటే ఓ మంచి పనోడు. ఆ కాలనీలో ఎవర్నడిగినా ఇదే చెబుతారు. రేనా గురించి హైదరాబాద్‌లో ఏదైనా సాంస్కృతిక సంస్థకు తెలిస్తే పిలిచి మరీ సన్మానం చేసేస్తారు. ఎందుకంటే రేనా పని చేసేది ‘రూల్స్ రంగారావు’ దగ్గర.అన్నీ రూల్స్ ప్రకారం జరగాలనే తలతిక్క మనిషి రంగారావు. కూచుంటే రూలు. నిలబడితే రూలు. పడుకుంటే రూలు. పడుకోకుంటే రూలు. లేకపోతే రూళ్ల కర్రతో కొట్టినంత పని చేస్తాడు. అలాంటి వాడి దగ్గర రేనా వంచిన తల ఎత్తకుండా, నోరు మెదపకుండా పని చేస్తున్నాడు. అయినా ఎప్పుడూ ఏదో ఒకటి సూటిపోటి మాటలు అంటూనే ఉంటాడు. రేనా లీవ్ పెట్టి ఊరెళ్లి వచ్చాడు. అంతే రూల్స్ రంగారావు గుమ్మంలోనే ఆపేసి కయ్మంటూ అరిచాడు. గోడకుర్చీ వేయమంటూ హుకుం జారీ చేశాడు. ‘‘నేను లీవ్ పెట్టింది... పని ఎగ్గొట్టడం కోసం కాదు. చిదంబరంలో కొలువైన మా వంశ మూల విరాట్‌ని దర్శించుకోవడం కోసం’’ అంటూ రేనా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయినా రంగారావు తగ్గలేదు. ‘‘నువ్వే ఒక బెల్లంకొట్టిన రాయివి. ఆ రాయి దగ్గరకెళ్లి నువ్వేం మొక్కుకుంటావ్? రెండు వేలు వేస్ట్ చేసి అంత దూరం వెళ్లావ్. ఆ కొబ్బరి కాయేదో ఇక్కడే కొట్టేస్తే పచ్చడికైనా పనికొచ్చేది’’ అని క్లాస్ పీకాడు రంగారావు. రేనాకు కోపం వస్తోంది. కానీ కంట్రోల్ చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ‘‘అది మా వంశ సంప్రదాయం’’ అని ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు రేనా. ‘‘నీదొక వంశం... దానికో సంప్రదాయం’’ అంటూ రంగారావు చులకనగా మాట్లాడాడు. రేనా మొహంలో రంగులు మారుతున్నాయి. నరాలు ఆవేశంతో బుసాబుసా ఉప్పొంగుతున్నాయి. ‘‘అయ్గారు... నన్నేమన్నా అనండి. నా వంశాన్ని మాత్రం ఏమీ అనొద్దు’’ అని ఫైనల్‌గా చెప్పేశాడు రేనా. రంగారావు ఒక్క ఉదుటున ముందుకుదూకి ‘‘ఏం చేస్తావురా? చంపుతావా? నరుకుతావా?’’ అని రేనా చొక్కా పట్టుకున్నాడు. అయినా రేనా కంట్రోల్‌గానే ఉన్నాడు. ‘‘ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? అని కన్ఫ్యూజ్ చేయకండి. ఏదో ఒకటి చేసెయ్యగలను’’ అని చెబుతూ తన చేతులతో చెంపలను గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ‘కంట్రోల్.. కంట్రోల్’ అంటూ తనకు తానే కమాండ్స్ ఇచ్చుకున్నాడు. ‘‘ఏంట్రా సౌండు?’’ అంటూ గద్దించాడు రంగారావు. ‘‘జేబులో జంతికలు నలిపా... తినడానికి ఈజీగా ఉంటాయని’’ అనేసి అక్కడ్నుంచీ కామ్‌గా వెళ్లిపోయాడు రేనా. రూల్స్ రంగారావు ఇలా ఎంత ఇరిటేట్ చేసినా రేనా పాపం తనకు తానే ‘కంట్రోల్... కంట్రోల్’ అని చెప్పుకుంటున్నాడు. ఆ టైమ్‌లో రేనా తీరు చూస్తుంటే, అతను ఏ మాత్రం కంట్రోల్ తప్పినా పాశర్లపూడి బ్లో అవుట్లాగా ఏదో జరుగుతుందనే అనిపిస్తోంది. ప్రతి డాగ్కీ ఓ టైమొస్తుంది. డాగ్‌కే టైమొచ్చినపుడు... రేనాకు రాదంటారా!? వచ్చేసిందోచ్... ఓ పేద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్. రూల్స్ రంగారావు ఏవో సరుకులు కొంటుంటే, రేనా అతని వెనుకే సంచీతో నిలబడ్డాడు. ‘‘అయ్గారూ... ఈ నెత్తురు బాటిల్ కొనండి. ఎప్పుడైనా పనికొస్తుంది’’ అని ఓ సాస్ బాటిల్ చూపించాడు రేనా. రంగారావు ఇంతెత్తున లేచి ‘‘ఒరేయ్ తలకుమాసిన వెధవా... మాట్లాడితే నెత్తురంటావ్... బాంబులంటావ్... నీ జీవితంలో ఎప్పుడైనా కత్తి పట్టుకున్నావురా?’’ అని తిట్టాడు. పరమశివుడు గరళాన్ని తన గొంతులోనే దాచేసుకున్నట్టుగా, పాపం రేనా తన కోపాన్నంతా తనలోనే అణిచేసుకుంటున్నాడు. సరిగ్గా అదే టైమ్‌లో ఓ ప్రేమ జంట పరిగెత్తుకుంటూ ఈ స్టోర్స్‌లోకి వచ్చి, అక్కడ రేనాను చూసి షాకైపోయింది. ‘‘రెడ్డి నాయుడు గారూ... మీరా?’’ అని ఆశ్చర్యపోతూ రేనాకు పాదాభివందనం చేసేశారు. ఏ నిజమైతే ప్రపంచానికి తెలియకూడదని రేనా ఇన్నాళ్లూ కంట్రోల్డ్‌గా ఉన్నాడో, ఆ నిజం బ్లాస్ట్ అయిపోయింది. ఆ ప్రేమజంటను వెతుక్కుంటూ రాయలసీమలో ఫేమస్ ఫ్యాక్షనిస్ట్ వీరవంకర్రెడ్డి అండ్ కో వచ్చారు. రేనా ధైర్యంగా వీరవంకర్రెడ్డితో తలపడ్డాడు. ‘‘నీకు దమ్ముంటే మా పబ్లిక్ సెంటర్లోకి రా... చూసుకుందాం... నీ పెతాపమో... నా పెతాపమో...’’ అని హూంకరించాడు వీరవంకర్రెడ్డి. రేనా కూడా ఏ మాత్రం తగ్గలేదు.‘‘వస్తాన్రా... సీమ సందుల్లో సీమ పందుల్లా కొట్టుకుందాం’’ అని గర్జించాడు. ‘‘నీ అంతు చూస్తాన్రా’’ అంటూ వీరవంకర్రెడ్డి అండ్ కో పలాయనం చిత్తగించారు. ఆ గ్యాంగ్‌లో రేనాకు కరడు గట్టిన ఓ వీరాభిమాని ఉన్నాడు. అతను రేనా దగ్గరకొచ్చి ‘‘అన్నా... ఓసారి తొడగొట్టన్నా’’ అని విపరీతంగా బతిమిలాడాడు. ‘‘వద్దురా... కొంచెం వీగ్గా ఉంది’’ అన్నాడు రేనా. అక్కడే ఉన్న రూల్స్ రంగారావు ‘‘సోడా కొట్టమంటే కొడతాడు కానీ, తొడ కొట్టలేడులే’’ అని ఎకసెక్కమాడాడు. దాంతో రేనా అభిమానికి కోపం పొడుచుకొచ్చింది. ‘‘అసలు ఈ రేనా ఎవరో ఫ్లాష్‌బ్యాక్ తెలుసా మీకు?’’ అని చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరి పేరు చెబితే సీమ ప్రజలు చిరాకు పడతారో... ఎవరి పేరు చెబితే శత్రువులు ఏ టెన్షనూ లేకుండా హాయిగా నిద్రపోతారో... ఎవరిని చూస్తే పసిపిల్లలు ఏడుపాపేసి హాయిగా పాలు తాగుతారో... అతనే ఈ రెడ్డి నాయుడు. షార్ట్ కట్లో ముద్దుగా ‘రేనా’ అని పిలుచుకుంటుంటారు. రేనా అంటే రాయలసీమలో తెలీనివాడు లేడు. ఆ చెట్టుకీ తెలుసు. ఆ పుట్టకీ తెలుసు. చివరకు ఆ కాకి రెట్టకూ తెలుసు. ఓ కాకి తనపై రెట్ట వేసి షర్టు ఖరాబు చేసిందని రేనా గన్‌తో సింగిల్ షాట్లో కాల్చిపారేశాడు కాకిని. ఆ దూకుడు చూసి రేనా తల్లి కకావికలమై పోయింది. రెట్ట వేసిందని కాకినే కడతేర్చినవాడు, రేపు ఈ సీమను వల్లకాడు చేసేస్తాడని తెగ భయపడిపోయింది. ‘‘పచ్చగా ఉన్న ఈ సీమ నీ వల్ల రక్తంతో ఎర్రగా మారడానికి వీల్లేదు. మర్యాదగా సీమను వదిలేసి వెళ్లిపో’’ అని ఆదేశించింది. తల్లి మాటకు బద్ధుడై రేనా అస్త్రసన్యాసం చేసి కట్టు బట్టలతో నగరవాసానికి బయలుదేరి వెళ్లిపోయాడు. ఇలా ఓ పనివాడిగా అజ్ఞాతవాసంలో బతుకుతున్నాడు. ఇదండీ రేనా ప్లాష్‌బ్యాక్. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’, ‘ఆది’... ఇలాంటి ఫ్యాక్షన్ సినిమాలను మించే విధంగా ఉంది కదూ రేనా ఫ్లాష్‌బ్యాక్. ఈ రేనా స్టోరీ అంతా విన్నాక మీకేమర్థమైంది? మీరేం తెలుసుకున్నారు? మీక్కూడా ఓ పనివాడు ఉండే ఉంటాడు. ఆ పనివాడికీ ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉండే ఉంటుంది. వాడు రేనా కన్నా పవర్ఫుల్ అయ్యుండొచ్చు. ఓసారి ‘చెక్’ చేయండి. వీలైతే ‘డీడీ’ కూడా చేయండి. - పులగం చిన్నారాయణ అన్నీ మిక్స్ చేస్తే వచ్చిందే... ‘రేనా’ పాత్ర ‘‘దర్శకుడు ఇ. సత్తిబాబులో మంచి కామెడీ టింజ్ ఉంది. ఈ సినిమా స్టోరీ సిట్టింగ్స్‌లో... ఏదైనా పాపులర్ ఫ్యాక్షన్ సినిమాకు పేరడీగా ఓ కామెడీ కేరెక్టర్ సృష్టిద్దామని ఐడియా చెప్పారు. కథా రచయిత ఉదయ్‌రాజ్ కూడా మంచి ఆలోచనని సపోర్ట్ చేశారు. ఇలా ఒక సినిమాకే పరిమితం కాకుండా, రకరకాల ఫ్యాక్షన్ సినిమాలన్నీ కలగలిపి ఓ పాత్ర చేస్తే ఇంకా బావుంటుందని నేను సలహా ఇచ్చాను. వాళ్లు ప్రొసీడ్ అన్నారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, బాషా... ఇలా అన్నీ ఓ మిక్సీలో వేస్తే ఫైనల్‌గా వచ్చిన ప్రొడక్టే ఈ రెడ్డినాయుడు పాత్ర. ఈ పేరు కూడా సత్తిబాబే పెట్టారు. ఎమ్మెస్ నారాయణ చేయడం వల్ల, ఆయన కామెడీ టైమింగ్ వల్ల ఈ పాత్ర బాగా పేలింది. మొదట్లో ఈ సినిమా యావరేజ్ అన్నారు. ఎమ్మెస్ కామెడీ ట్రాక్ గురించి ప్రచారం చేశాక సినిమా సూపర్‌హిట్ స్థాయికి వెళ్లిపోయింది.’’ - చింతపల్లి రమణ, మాటల రచయిత -
బొమ్మన్ అదిరింది
దుస్తులు మార్చినంత ఈజీగా ఎక్స్ప్రెషన్లు మార్చేస్తాడు! సూర్యుడు తొంగిచూసినంత ఈజీగా చిరునవ్వులు పొంగిస్తాడు! మబ్బు తెర వేసినంత ఈజీగా కన్నీరు తెచ్చేస్తాడు! మంచినీళ్లు గ్లాసులో పడినంత ఈజీగా క్యారెక్టర్లోకి పడిపోతాడు! ఇరానీకి అదెలా సాధ్యం? జీవితం చాలా డిఫికల్ట్ అయ్యేటప్పటికి... సినిమా ఈజీ అయిపోయింది అంటాడు. బికాజ్ లైఫ్ ఈజ్ సినిమా, అండ్ ‘బొమ్మ’న్ ఈజ్ దేర్! నా కెరీర్ టాప్ 5 మై వైఫ్స్ మర్డర్ - 2005 ఖోస్లా కా ఘోస్లా - 2006 లగేరహో మున్నాభాయ్ - 2006 3 ఇడియట్స్ - 2009 వెల్డన్ అబ్బా - 2010 హిందీలో మీరు బిజీ. ఇక్కడ చేయాలనెందుకనుకున్నట్లు? నటుడనేవాడు అన్ని ఎక్స్పరిమెంట్లూ చేయాలి. బొంబాయిలోనే ఉంటే- వియ్ గెట్ ఇన్టు ఎ కంఫర్ట్ జోన్. మనలోని బెస్ట్ వర్క్ బయటకు రావాలంటే, ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజ్ తీసుకోవాలి. ఆ ఆకలి ఉంటే, ప్రతిరోజూ ఏదో కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తాం. ఇంతకీ, తెలుగులోకి రావడం ఎలా జరిగింది? గతంలో సౌత్ నుంచి 3 -4 ఆఫర్లు వచ్చినా, తీరిక లేక చేయలేకపోయా. దర్శక - రచయిత త్రివిక్రమ్ ఒకసారి ఫోన్ చేసి, ‘అత్తారింటికి దారేది’ స్క్రిప్ట్ చెప్పారు. ఆయన కథ చెప్పడం మొదలుపెట్టగానే, ‘దిస్ మ్యాన్ నోస్ హిజ్ సినిమా’ అనిపించింది. సినిమా మీడియమ్, ప్రపంచ సినిమా, సాహిత్యం, తీయనున్న కథ గురించి స్పష్టమైన అవగాహన ఉన్న దర్శకుడని అర్థమైంది. అలా రఘునందన్ పాత్ర చేశా. ‘అత్తారింటికి...’ అంత హిట్టయినా, వేరే ఏమీ చేయలేదేం? ఆఫర్లొచ్చాయి. కుదరలేదు. ఆ మధ్య దర్శక - రచయిత సంపత్ నంది బొంబాయికొచ్చారు. వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్... స్టోరీ కా బేసిక్ స్ట్రక్చర్ బోల్దియా! నాకు నచ్చింది. ఆ తరువాత ‘బెంగాల్ టైగర్’ టోటల్ స్క్రిప్ట్ చెప్పారు. రెండు గంటలు కూర్చొని, కబుర్లు చెప్పుకున్నాం. అతనితో మంచి బంధం ఏర్పడింది. నటిస్తున్నా. మళ్ళీ హైదరాబాద్, ‘బెంగాల్‌టైగర్’ అనుభవమెలా ఉంది? గౌరవంగా చూసే దర్శక, నిర్మాతల మంచి యూనిట్ ఇది. సంపత్ నంది వెరీ యాక్టివ్ మైండ్. హి కమ్స్ ప్రిపేర్డ్ ఫర్ ది సెట్. ఒక్కోసారి సెట్లో అనుకున్నదేదో చేయడానికి చటుక్కున ఇబ్బంది వస్తే, ఒకటికి నాలుగు కొత్త ఐడియాస్తో ముందుకొస్తాడు. ఇందులో నాది అశోక్ గజపతి అనే పవర్ఫుల్ విలన్ పాత్ర. దీనికి అంతకు అంత పవర్‌ఫుల్‌గా ఉంటాడు హీరో. అయామ్ ఎంజాయింగ్ వర్క్. తెలుగు ఇండస్ట్రీ గురించి మీ ఒపీనియన్? ఇక్కడివాళ్ళు పొలైట్. సిస్టమేటిక్. కష్టపడి పనిచేస్తారు. బొంబాయి సినీ పరిశ్రమలోనూ ఇప్పుడు ఆర్గనైజ్డ్గా పనిచేస్తున్నారు. పంక్చువల్‌గా ఉంటున్నారు. రెండు ఇండస్ట్రీలకీ పెద్ద తేడా ఏమీ లేదు. మంచి సినిమాలు చేయాలనే తపన కనపడుతోంది. మరి వచ్చిన ఛాన్స్‌ను అంగీకరించే ముందు ఎలాంటి అంశాలు చూస్తారు? కథా, హీరోనా? దర్శకుడా? సంస్థా? (నవ్వేస్తూ...) వాటన్నిటి కన్నా ముందు నాకు ఆ మనుషులు, ఆ వాతావరణం, వారి ప్రవర్తన కంఫర్టబుల్‌గా ఉండాలి. మనుషులు ఫ్రెండ్లీగా ఉండాలి. గర్వంతో, అహంకారంగా ప్రవర్తించేవాళ్ళతో నేను పనిచేయలేను. కాబట్టి, ఎవరితో పనిచేస్తున్నాను, ఎలాంటి యూనిట్ అనే విషయంలో నేను పర్టిక్యులర్. అదృష్టవశాత్తూ, ‘అత్తారింటికి దారేది’ టీమ్ కానీ, ‘బెంగాల్ టైగర్’ టీమ్ కానీ చాలా కంఫర్టబుల్. కానీ తెలియని భాష డైలాగ్సతో ఎడ్జస్టవడమెలా? కో-డెరైక్టర్ దగ్గర ముందు రోజే సీన్ మొత్తం తెలుసుకుంటా. మొత్తం సీన్ వివరించాక, నా డైలాగులను ఇంగ్లీష్‌లో అడిగి, విషయం అర్థం చేసుకుంటా. ఆ తరువాత తెలుగు కల్చర్‌కి దగ్గరగా వెళ్ళడం కోసం హిందీలో తెలుసుకుంటా. అర్థం, భావం తెలిశాక, అప్పుడు తెలుగు డైలాగ్‌ను హిందీ స్క్రిప్ట్‌లో రాసుకొని, ఎలా పలకాలో ప్రాక్టీస్ చేస్తా. దానివల్ల కెమేరా ముందు ఏదో ‘వన్... టూ త్రీ’ అనకుండా సరిగ్గా డైలాగ్ చెప్పగలుగుతున్నా. అంత శ్రమ పడకుండానే కొందరు నటిస్తున్నారుగా! అర్థం చేసుకోకుండా, నంబర్లంటూ నటించడమంటే, స్థానిక పరిశ్రమనూ, సంస్కృతినీ, భాషనూ అవమానించడమన్న మాటే! భాష, భావం అర్థం చేసుకుంటేనే నటన ట్రూత్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకనే, ఇంత శ్రమపడతా. ఏదో ఒక రోజున తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని నా కోరిక. భాషకు కోచ్‌ను పెట్టుకోవాలని ఉంది. అన్నట్లు మీరు వాయిస్ ఆర్టిస్ట్‌గానూ పనిచేసినట్లున్నారు! అవును. ‘ఢిల్లీ సఫారీ’ (2012)లో ఎలుగుబంటి పాత్ర సహా కొన్ని యానిమేషన్ చిత్రాల్లో గాత్రదానం చేశా. అంధుల కోసం చేసిన ఒక పబ్లిక్ సర్వీస్ ఫిల్మ్‌లో కుక్క పాత్రకు గాత్రమిచ్చా. జె.ఆర్.డి. టాటా అఫిషియల్ బయోగ్రఫీ ‘బియాండ్ ది లాస్ట్ బ్లూమౌంటెన్’ లాంటి కొన్ని ఆడియో బుక్స్ నా వాయిస్‌లో చదివా. వాయిస్ ఆర్టిస్ట్ కన్నా ముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా మీ కృషి? ఫొటోగ్రాఫర్‌గా చేస్తున్న నన్ను రంగస్థల ప్రముఖుడు శ్యామక్ దవర్ అటు లాగారు. అలెక్ పదమ్సీ ‘రోష్నీ’తో అక్కడ మొదలుపెట్టా. ‘ఫ్యామిలీ టైస్’లో డబుల్ రోల్ చేశా. ‘అయామ్ నాట్ ర్యాపోపోర్ట్’లో 34 ఏళ్ళకే 75 ఏళ్ళ వాడి వేషం వేశా. ‘అయామ్ నాట్ బాజీరావ్’, ‘మహాత్మా వర్సెస్ గాంధీ’ నాటకంలో గాంధీ పాత్ర ఎంతో పేరు తెచ్చాయి. ఇలా దాదాపు 14 ఏళ్ళ పాటు నాటకాలు వేశా. ఆ ఎక్స్‌పీరియన్సే నాకు ఒక యాక్టింగ్ స్కూల్ అనుభవం. రంగస్థల అనుభవం సినిమాల్లో ఏ మేరకు పనికొచ్చింది? రంగస్థలంపై పని చేయడానికి చాలా డిసిప్లిన్ కావాలి. దానివల్ల సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా టైమ్ పాటించడం, వాయిస్‌ను బాగా ఉపయోగించడం, మొత్తం స్క్రీన్‌ప్లేను అవగాహన చేసుకోవడం, పాత్ర స్వభావాన్నీ, పరిధినీ అర్థం చేసుకోవడం లాంటివి అలవాటవుతాయి. రంగస్థల అనుభవంతో వచ్చినవాళ్ళు తోటి నటీనటుల్ని కూడా తమ ఎడ్వాంటేజ్కు తగ్గట్లు వాడుకోగలుగుతారు. సినీ యాక్టర్‌గా లేటు వయసులో పెద్ద బ్రేక్ వచ్చినట్లుంది? నిజమే. రంగస్థలం మీద నన్ను చూసి, హ్యాండీ కామ్‌తో తీసిన ‘లెటజ్ టాక్’ అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌లో నాతో నటింపజేశారు. ఆ టైమ్‌లోనే ఒకసారి దర్శక - నిర్మాత విధు వినోద్చోప్రా నన్ను చూసి, ‘వచ్చే ఏడాది డిసెంబర్‌కు నీ డేట్స్ కావాలి’ అంటూ, రెండు లక్షలకు చెక్ ఇచ్చారు. నాకు అర్థం కాలేదు. ఆ తరువాత ఆరు నెలలకు ఫోన్ వచ్చింది. అదే ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’. అలా 44 ఏళ్ళ వయసులో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ పదకొండేళ్ళలో ఈ స్థాయికి వచ్చా. అయితే, నా దృష్టిలో ఎవరూ రాత్రికి రాత్రి సక్సెస్ కారు. ఇవాళ్టి సక్సెస్ వెనక ఒక జీవితకాలపు శ్రమ ఉంటుంది. మీరు కూడా వెయిటర్‌గా మొదలై ఎన్నోచేసి నటుడయ్యారు. (నవ్వేస్తూ...) నేనూ అనుకోలేదు. హోటల్లో వెయిటర్‌గా మొదలుపెట్టా. అక్కడ వినయం నేర్చుకున్నా. బేకరీ షాప్‌లో ఉన్నప్పుడు కస్టమర్లను చూసి మానవ స్వభావం స్టడీ చేశా. ఫొటోగ్రాఫర్‌గా లైటింగ్, మూడ్ తెలుసుకున్నా. రంగస్థలంలో నటన తెలిసింది. ఇప్పుడు సినిమాల్లో ఉన్నా. రేపేమిటో తెలియదు. ఇదో కంటిన్యుయస్ జర్నీ. సీరియస్, కామెడీ, విలనీ - ఇలా అన్నీ చేశారు. ఏది కష్టం? ఏ భావమైనా, బాగా పలికించడం ముఖ్యం. అందుకోసం బాగా ప్రిపేర్ అయిన వారికి, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. ‘3 ఇడియట్స్’లో ఫన్నీగా చేశా. ‘లగే రహో మున్నాభాయ్’లో చాలా జాలీ క్యారెక్టర్. ‘అత్తారింటికి...’లో సీరియస్ పాత్ర. ఇప్పుడిందులో విలన్. ఒక్కోటీ ఒక్కో రకం. అందుకే, ఎన్ని సినిమాలు చేశానో లెక్కపెట్టుకోలేదు. బ్యాటింగ్ కర్తే జా రహా( హూ(. మరాఠీలోనూ చేస్తా. {పస్తుతం దక్షిణాది భాషల్లో ఏమైనా ఆఫర్లున్నాయా? తమిళ్లో ఆఫర్లు వస్తున్నాయి. ఏదీ సెట్ కాలేదు. తాజాగా మలయాళంలో ఆఫరొచ్చింది. హిందీలో ‘హౌస్‌ఫుల్-3’ చేస్తున్నా. షారుఖ్‌తో ‘దిల్వాలే’ చేయడం ఎగ్జైటింగ్‌గా ఉంది. ఏమైనా, తెలుగు సినిమా, ఇక్కడి ప్రజలు నన్ను తమ వాణ్ణి చేసుకున్నారు. అయావ్‌ు హానర్డ. అమ్మే... సినిమాలకు పంపేది! నేను అమ్మ కడుపులో ఉండగానే నాన్న మరణించారు. నన్ను పెంచింది అమ్మే! బొంబాయిలో గ్రాంట్ రోడ్డులో మా ఇంటి దగ్గర చాలా హాళ్ళుండేవి. తప్పకుండా చూడాల్సినవన్నీ ఒక లిస్ట్ రాసి, మా అమ్మే నన్ను ఆ సినిమాలకు పంపేది. ఒక్కొక్క శాఖ పనినీ గమనించేందుకు ప్రతి సినిమా అయిదారుసార్లు చూడమనేది. అలా ఎన్ని క్లాసిక్స్ చూశానో! శివాజీగణేశన్ ‘నవరాత్రి’, ఎన్టీఆర్, ఏయన్నార్ ఫిల్మ్స్ చాలా చూశా. అమ్మకిప్పుడు 87 ఏళ్ళు. నాదగ్గరే ఉంటుంది. బేకరీలో... మా ప్రేమకథ! అప్పట్లో మాకు ‘గోల్డెన్ వేఫర్స్’ అనే చిన్న బేకరీ షాపుండేది. అమ్మకు ఒంట్లో బాగా లేనప్పుడల్లా నేను షాపులో కూర్చొనేవాణ్ణి. బేకరీలో కొనుక్కోవడానికి జెనోబియా రోజూ వచ్చేది. అక్కడే మా ప్రేమ పుట్టింది. మాది చాలా సింపుల్, పాత తరహా ప్రేమకథ. ఆమె రోజూ వచ్చేది. నాకు 22 ఏళ్ళప్పుడు మా పెళ్ళయింది. మా పిల్లలు దనేష్, కయోజ్ ఇరానీ - ఇద్దరూ ఇప్పుడు సినీ రంగంలోనే ఉన్నారు. మా అమ్మ తరువాత నేను అంత ప్రేమించేది మా ఆవిణ్ణే. మనసుకు నచ్చనిది రాయడు!! నా ఫేవరెట్ డెరైక్టర్లంటే రాజు హిరానీ, ఫరాఖాన్. రాజు హిరానీ, నేను ఒకేసారి కెరీర్లు ప్రారంభించాం. మేమిద్దరం ఒకరి నుంచి మరొకరం నేర్చుకున్నాం. రాజు హిరానీలోని గొప్పతనం ఏమిటంటే, తన మనసుకు నచ్చనిదేదీ అతను కాగితం మీద పెట్టడు. చివరకు ఆయన రాసే హ్యూమర్ కూడా హృదయంలో నుంచి వచ్చినదే! ఫరాఖాన్ ఏమో ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో దిట్ట. అదే సమయంలో ఆమె సినిమాల్లో బోలెడంత ఎమోషన్ ఉంటుంది. - రెంటాల జయదేవ -
ఐష్ ఐస్ చల్లేస్తుందా?!
గాసిప్ అసలైన అందానికి ఐశ్వర్యారాయ్ తప్ప మరో నిర్వచనం తెలియనివాళ్లు చాలామందే ఉన్నారు. ఆ అభిమానమే అందరినీ ఆమె రీ ఎంట్రీ కోసం ఎదురు చూసేలా చేస్తోంది. ఐష్ మళ్లీ ఎప్పుడు తెరమీద కనిపిస్తుందా అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన ఆమె రీ ఎంట్రీ సినిమా ‘జాబాజ్’ పోస్టర్ చూసి ఆమె అభిమానులు డిజప్పాయింట్ అయినట్టు తెలుస్తోంది. గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో, బాధ- ఆవేశం కలగలసిన ఎక్స్ప్రెషన్తో ఉన్న ఐశ్వర్యతో ఉన్న ఆ పోస్టర్ పెద్దగా కిక్కివ్వలేదెవ్వరికీ. పైగా ఐష్ కూడా నాజూగ్గా కాకుండా కాస్త బొద్దుగా ఉండటం మరీ నిరుత్సాహపర్చింది. కొంప దీసి సినిమాలో కూడా ఐష్ ఇలాగే ఉంటుందా, తమ ఆసక్తి మీద ఐస్ చల్లేస్తుందా అని చాలా టెన్షన్ పడుతున్నారు. ఏం జరుగుతుందో సినిమా రిలీజైతే కానీ తెలీదు మరి! -
కళ్ళు.. కల, కళ అన్నీ నేనే!
-
అలా నేర్చుకున్నాను...
మనోగతం బ్రహ్మచారిగా ఉండే రోజుల్లో హోటల్లో తినీ తినీ ‘ఇక నా వల్ల కాదు. పెళ్లి చేసుకోవాల్సిందే’ అనుకున్నాను. నేను అనుకున్నానో లేదో మా వాళ్లు ఒక అందమైన అమ్మాయిని చూశారు. ‘‘అమ్మాయికి వంట రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది’’ అనే మాట విని నెత్తి మీద ఆర్డీఎక్స్ పేలినట్లు ఎక్స్ప్రెషన్ పెట్టాను. ‘‘అదేమీ పెద్ద విషయం కాదనుకోండి...’’ అన్నాడు నాన్న. ‘‘అదే అసలు విషయం’’ అని నాలో నేను గొణుక్కున్నాను. ‘‘అమ్మాయికి వంటరాదు కాబట్టి ఆమె నచ్చలేదు’’ అని చెప్పడం న్యాయం కాదు కాబట్టి ‘ఓకే’ అనేశాను. ‘‘ఇవ్వాళ టిఫిన్ చేశాను. తిని ఓకేనా కాదా చెప్పండి’’ ‘‘ఇవ్వాళ బెండకాయ వేపుడు చేశాను. తిని బాగుందో లేదో చెప్పండి’’ ఇలా అడిగేది మా ఆవిడ. ‘‘ఆమె చేసిన టిఫిన్ టిఫిన్ కాదని, కూర కూర కాదని ఎలా చెప్పాలి? ఓరి భగవంతుడా... ఏమిటీ శిక్ష ’’ అనుకునేవాడిని. ఆమెను చిన్న మాట అనడానికైనా మనసొప్పేది కాదు. అలా అని ఆమె వంటల మంటలను మింగలేను కదా! ఇక ఇలా కాదనుకొని ఆ ఇళ్లు, ఈ ఇళ్లు తిరిగి పనిగొట్టుకొని రకరకాల వంటలు నేర్చుకున్నాను. దినపత్రికల వంటలు పేజీలు చాలా శ్రద్ధగా సేకరించేవాడిని. నేను వంటలు నేర్చుకోవడంతో పాటు, మా ఆవిడకు అర్థమయ్యేలా సులభంగా చెప్పాను. ఏ మాటకామాట చెప్పుకోవాలి... ఇప్పుడు నా కంటే ఆవిడ వంట చక్కగా చేస్తుంది! -బి. శేఖర్, హైదరాబాద్