ఐష్ ఐస్ చల్లేస్తుందా?!
గాసిప్
అసలైన అందానికి ఐశ్వర్యారాయ్ తప్ప మరో నిర్వచనం తెలియనివాళ్లు చాలామందే ఉన్నారు. ఆ అభిమానమే అందరినీ ఆమె రీ ఎంట్రీ కోసం ఎదురు చూసేలా చేస్తోంది. ఐష్ మళ్లీ ఎప్పుడు తెరమీద కనిపిస్తుందా అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన ఆమె రీ ఎంట్రీ సినిమా ‘జాబాజ్’ పోస్టర్ చూసి ఆమె అభిమానులు డిజప్పాయింట్ అయినట్టు తెలుస్తోంది.
గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో, బాధ- ఆవేశం కలగలసిన ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న ఐశ్వర్యతో ఉన్న ఆ పోస్టర్ పెద్దగా కిక్కివ్వలేదెవ్వరికీ. పైగా ఐష్ కూడా నాజూగ్గా కాకుండా కాస్త బొద్దుగా ఉండటం మరీ నిరుత్సాహపర్చింది. కొంప దీసి సినిమాలో కూడా ఐష్ ఇలాగే ఉంటుందా, తమ ఆసక్తి మీద ఐస్ చల్లేస్తుందా అని చాలా టెన్షన్ పడుతున్నారు. ఏం జరుగుతుందో సినిమా రిలీజైతే కానీ తెలీదు మరి!