
వైరల్‌గా మారిన విరాట్ ఎక్స్‌ప్రెషన్
లండన్: చాంపియన్స్ ట్రోఫిలో భాగంగా బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శించిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటీజన్‌లు కోహ్లీ ఎక్స్‌ప్రెషన్‌పై కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.
బంగ్లా బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ క్యాచ్‌ను అందుకున్న అనంతరం కోహ్లీ నాలుక బయటకు పెట్టి తన ఆనందం వ్యక్తం చేశాడు. ఊహించని ఈ కోహ్లీ ఎక్స్‌ప్రెషన్ కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. మాంచి ఆకలితో ఉన్నప్పుడు బిర్యానీని చూసినప్పుడు ఇలా చేస్తాం అని కొందరంటోంటే.. మ్యాచ్ విన్నింగ్ ఎక్స్‌ప్రెషన్ అది అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.