slang
-
యాసలందు అన్ని యాసలూ లెస్స
ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ‘యాస’ల ట్రెండ్ నడుస్తోంది. పాత్రలకు తగ్గట్టు స్టార్స్ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల యాసలు పలకడానికి ‘యస్’ చెబుతున్నారు. ఏ యాసకి ఆ యాస ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించడానికి ఉపయోగపడుతోంది. అందుకే ‘యాసలందు అన్ని యాసలూ లెస్స’ అని చెప్పాలి. ప్రస్తుతం ‘పుష్ప 2, హరోం హర’తో పాటు విశ్వక్ సేన్ చిత్రం, అనన్య నాగళ్ల మూవీ వంటి పలు సినిమాలు ఆయా ప్రాంత యాసల నేపథ్యంలో రూపొందుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేద్దాం. పుష్పగాడి రూలు ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’... ‘తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో హీరో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ సహా దాదాపు అన్ని పాత్రలు రాయలసీమలోని చిత్తూరు యాసలో మాట్లాడతాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప 2: ది రూల్’ కూడా చిత్తూరు యాసలో రూపొందుతోంది. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇక ‘అడవిలో జంతువులు రెండడుగులు ఎనక్కి ఏసినాయంటే పులి వచ్చుండాదని అర్థం.. అదే పులి రెండడుగులు ఎనక్కి ఏసినాదంటే పుష్ప వచ్చుండాడని అర్థం’, ‘పుష్పగాడి రూలు’ వంటి డైలాగులు ‘పుష్ప 2: ది రూల్’ గ్లింప్స్‌లో ఉన్నాయి. ఇంగ సెప్పేదేం లేదు.. సేసేదే సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన 1989 నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్లో ‘సుబ్రహ్మణ్యం అన్న.. జనాలు నీ కోసం సూస్తా ఉండారు.. అట్లా కదలకుండా ఉంటే ఎట్లా.. ఏందోకటి సెప్పు’, ‘ఇంగ సెప్పేదేం లేదు.. సేసేదే’ వంటి చిత్తూరు యాస డైలాగులు వినిపించాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది బ్లాక్.. వైట్ ఉండదు.. ‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో బ్లాక్ ఉండదు, వైట్ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది’ అంటూ ‘వీఎస్ 11’ (వర్కింగ్ టైటిల్) చిత్రం వీడియో రిలీజ్ అయింది. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో విశ్వక్ సేన్ గోదావరి యాసలో మాట్లాడతారు. శ్రీకాకుళం యాసతో... అనన్య నాగళ్ల, రవి మహాదాస్యం జంటగా ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో రాజా రామ్మోహన్ చల్లా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. బేబీ లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కథాంశం శ్రీకాకుళం యాస నేపథ్యంలో సాగుతుంది. నెల్లూరి నెరజాణ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన చిగురుపాటి సుబ్రమణ్యం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నెల్లూరి నెరజాణ’. ఎంఎస్ చంద్ర, హరి హీరోలుగా, అక్షా ఖాన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం పక్కా నెల్లూరు యాసలో రూపొందినట్లు చిగురుపాటి సుబ్రమణ్యం తెలిపారు. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాల్లో కూడా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ యాస వినిపించనుంది. -
వొరే సీనయ్యా, యాడికి బోతుండవా?; అమెరికాలో నెల్లూరోళ్ల కబుర్లు
అబ్బయ్యా నువ్వేందిరా జెప్పేది? ఆనేక వస్తానని జెప్పి మద్దినాల దాక మంచం దిగలా? వొరే సీనయ్యా, యాడికి బోతుండవా? బిన్నా రారా శానా పనుంది. ఆయమ్మి ఈరోజుగూడా పప్పుల్సు జేసిందా? పిల్లకాయల్ని అల్లాడిస్తుందిరా రోజూ అదే కూర బెట్టి. సరేగాని పెద్దబ్బయ్య రాధా మహల్ దగ్గర దోసె కని బొయ్యి ఇంకా రాలేదే. అందరం మూడాళ్ళలో కొత్త సిల్మా వచ్చుళ్ళా, బొయ్యి జూడాల. అదేన్దిరా ఆ మిడిమేళమా? బైకు దోలేది నువ్వోక్కడివేనా? ఈ ఎచ్చులుకు బోతే ప్రమాదం అబ్బయ్యో. నువ్వు కిండలు బడకుండా చెప్పిన మాట విను. రేపట్నించి రిక్షాలో బోరా. ఒరేయ్! చిన్నబ్బయ్యా. నువ్వింకా ఐస్కూల్లోనేరా సదివేది. అప్పుడే ఇంత తుత్తర ఎందుకురా? అయ్యేరమ్మ కూతురితో నువ్వేందిరా జేసింది? ఎం బాగాలే. మీ నాయనకు జాబు రాస్తా రేపు. ఒక తూరి ఈడకు నాయనోస్తే నీకుంటయ్. జాగర్త!నీపాసుగాలా, ఏందిరా ఇంత పిసినారోడీవే. నడిపోడు కష్టాల్లో ఉళ్ళా. రొవంత అప్పు ఇస్తే నీ సొమ్ము ఏమ్బోయిన్దిరా!. ఈ పై మాటలు వింటుంటే మీకేమని పిస్తుంది?. నెల్లూరు భాష, యాసతో నెల్లూరోళ్ళ మధ్యలో నెల్లూరులో ఉన్నట్లు లేదూ?. అదే జరిగింది. నెల్లూరోళ్ళ మధ్యే కాని నెల్లూరులో కాదు. పదివేల మైళ్ళ దూరంలో ఉన్న అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని డాలస్ మహానగరంలో నెల్లూరుకు చెందిన దాదాపు వందమంది ప్రవాసీయులు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన అపూర్వ ఆత్మీయ సమ్మేళనం. నెల్లూరీయుడు క్రష్ణారెడ్డి ఉప్పలపాటి చొరవదీసుకొని ఫ్రిస్కోలో ఉన్న “శుభం ఇవంట్ సెంటర్”లో శుక్రవారం సాయంత్రం ఈ మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించారు. డాలస్ మహానగర పరిసరాలలో పది, ఇరవై, ముప్పై ఏళ్లకు పైగా స్థిరపడ్డ నెల్లూరుకు సంబందించిన అనేక రంగాల ప్రముఖులు, నాయకులు, సేవకులు ఒక చోట చేరారు. ఎన్నాళ్లగానో తమ మదిలో దాచుకొన్న నెల్లూరు ప్రేమను ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళతో పంచుకోవడం విశేషం. ముఖ్యంగా విద్య, కుటుంబ నేపద్యం, ప్రస్తుతం చేస్తున్న వృత్తి, ప్రవృత్తుల సమాహారాన్ని ప్రతి ఒక్కరూ వినిపించారు. అవకాశమిస్తే ప్రతి ఒక్కరూ గంటల తరబడి నెల్లూరుకు సంబంధించిన అనుభూతులను పంచుకునేలా అనిపించింది. అలనాటి నెల్లూరు చేపల పులుసు, కమ్మరకట్లు, బాబు ఐస్‌క్రీం, రాధామాధవ్ కారం దోస, గాంధీబొమ్మ చెరుకు రసం, నెల్లూరు సుగంధపాలు, కోమల, వెంకటరమణ, మురళీకృష్ణ రుచులు, నెల్లూరు కోచింగ్ సెంటర్ అనుభవాలు, సినిమాలు, తదితర అపురూపమైన విశేషాలను పంచుకున్నారు. పెళ్ళిళ్లలో నెల్లూరోళ్ల ఆలోచనలు,హైస్కూలు, కాలేజి అనుభావాలకు సంబంధించిన అనేక అంశాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. మెత్తని నూలును తయారు చెయ్యడంలో ప్రసిద్ధి చెందిన నెల్లూరును ‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ అనే వారని గుర్తుచేశారు. నిర్వాహకులు విందుభోజనం వడ్డించినప్పటికీ, నెల్లూరు కబుర్లతో సగం కడుపు నిండింది అనే చెప్పాలి. అందరూ ఒకరిని ఒకరు వీడ్కోలు పలుకులతోప్రతి సంవత్సరం మూడు లేదా నాలుగు సార్లు కార్యక్రమాలు కావాలని విచ్చేసిన నేల్లూరీయులు కోరడంతో ఆత్మీయ సమ్మేళనానికి తేరపడింది. (క్లిక్ చేయండి: ఉపేంద్ర చివుకుల ప్రజాసేవకు గుర్తింపు) -
పులిపెక్కిపోతాండవంట.. చిత్తూరు యాస సుట్టూ టాలీవుడ్
సినిమా ఇప్పుడు ఒక్క భాష.. ఒక్క యాసకి పరిమితం కావడంలేదు. ‘΄పాన్ ఇండియా’ అయిపోయింది. అందుకే కథకు తగ్గ ‘యాస’ చుట్టూ సినిమా తిరుగుతోంది. ఇప్పుడు చిత్తూరు యాస సుట్టూ సినిమా తిరగతాంది! అన్ని సినిమాలూ కాదనుకోండి... అయితే ఇంతకుముందు వరకూ పెద్దగా వినపడని ఈ యాస ఇప్పుడు నాలుగైదు సినిమాల్లో వినబడుతోంది. ఇప్పటికే ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఎన్టీఆర్, ‘పుష్ప 1’ లో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు చిత్తూరు యాసలో మాట్లాడి, అలరించారు. ప్రస్తుతం చిత్తూరు యాస నేపథ్యంలో ‘పుష్ప 2’, ‘హరోం హర’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’, ‘అలిపిరికి అల్లంత దూరంలో’, ‘అమ్మాయిలు అర్థం కారు’ వంటి చిత్రాలు రూపొందుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. పులిపెక్కిపోతాండవంట.. ‘ఏం ΄పాప.. నచ్చినానా నీకు’, ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’, ‘పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదే లే’.. అంటూ ‘పుష్ప’ తొలి భాగంలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు ఎంత ΄ాపులర్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘హే ఛీ ఛీ.. నువ్వు నాకు నచ్చేదేంది.. నేను నిన్ను సూల్లేదని ఓ పులిపెక్కి పోతాండవంట గదా’ అంటూ రష్మికా మందన్న చెప్పిన మాటలు కుర్రాళ్ల హృదయాన్ని తాకాయి. చిత్తూరు సమీపంలోని శేషాచలం అడవుల్లో విరివిగా ఉండే ఎర్రచందనం నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అల్లు అర్జున్, రష్మిక, సునీల్... ఇలా అన్ని ΄పాత్రలు చిత్తూరు యాసలోనే మాట్లాడతాయి. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ΄పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ‘పుష్ప 2’ రానుంది. తొలి భాగంలో నటించిన వారే రెండో భాగంలోనూ ఉంటారు. నీ కోసం సూస్తా ఉండారు.. ‘సుబ్రహ్మణ్యం అన్న.. జనాలు నీ కోసం సూస్తా ఉండారు.. అట్లా కదలకుండా ఉంటే ఎట్లా.. ఏందోకటి సెప్పు’, ‘ఇంగ సెప్పేదేం లేదో.. సేసేదే’ వంటి చిత్తూరు యాస డైలాగులు ‘హరోం హర’ సినిమా మోషన్ టీజర్లో వినిపించాయి. సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో ‘హరోం హర’ సినిమా రూ΄÷ందుతోంది. సుమంత్ జి. నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన 1989 నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మాది తిరపతి.. నా పేరు విష్ణు ‘ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలీదన్నా.. మా జీవితాలన్నీ ఏడుకొండల సుట్టూ తిరగతా ఉంటాయి, మాది తిరపతి.. నా పేరు విష్ణు’ అంటూ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రం టీజర్లో హీరో కిరణ్ అబ్బవరం చెప్పే చిత్తూరు యాస డైలాగులు ఆసక్తిగా ఉన్నాయి. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 2023 ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఇవే కాదు.. మీడియమ్, స్మాల్ రేంజ్ చిత్రాల్లోనూ చిత్తూరు యాస వినపడనుంది. వాటిలో రావణ్ నిట్టూరు, శ్రీ నిఖిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్ కీలక ΄ాత్రల్లో డైరెక్టర్ నందినీ రెడ్డి శిష్యుడు ఆనంద్ జె. దర్శకత్వం వహించిన ‘అలిపిరికి అల్లంత దూరంలో’ ఒకటి. రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది. అలాగే నరసింహ నంది దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘అమ్మాయిలు అర్థంకారు’. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోహీరోయిన్లుగా నటించారు. నందిరెడ్డి విజయలక్ష్మి రెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మించిన ఈ సినిమా కూడా చిత్తూరు యాస నేపథ్యంలో ఉంటుంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా చిత్తూరు యాస సుట్టూ తిరిగే కథలు కొన్ని ఉన్నాయి. చదవండి: 'ఉరికే ఉరికే' ప్రోమో సాంగ్ .. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన అడవి శేష్ -
జాతీయాలతో జాతి భాష సంపన్నం
సెప్టెంబర్ 17, 2005. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటోన్న వేళ ఉదయం 10 గంటలకు వేముల పెరుమాళ్లు లేరన్న విషయం తెలిసింది. తెలంగాణ భాష కోసం, తెలంగాణ జాతీయాల కోసం, తెలంగాణ జానపదుల కోసం, తెలంగాణ సామెతల కోసం, తెలంగాణ పల్లె పదాల కోసం జీవితాంతం కృషి చేసిన వేముల పెరుమాళ్లు.. సరిగ్గా తెలంగాణ విమోచనం రోజే లోకాన్ని వీడడం యాధృచ్చికమే కావొచ్చు కానీ మరిచిపోలేని జ్ఞాపకంగా తన మరణాన్ని మార్చుకోవడం మాత్రం గొప్ప విషయం. తెలుగు సంస్కృతి అంతా ఒక్కటే! అయినా తెలంగాణ సంస్కృతిలో కొంత భిన్నత్వం ఉంది. భాషలో యాసలో ప్రత్యేకత ఉంది. అందుకు కారణం సుమారు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పరాయి పాలనలో తెలుగు చదవడం, రాయడం నిషేధింపబడ్డ రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు వారి భాషను, యాసను పదిల పరుచుకున్నారు. వారి సామెతల్ని, జాతీయాల్ని , మౌఖిక సాహిత్యాన్ని, లిఖిత సాహిత్యాన్ని భద్ర పరుచుకున్నారు. నిజాం పాలకులు సృష్టించిన ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఇక్కడి ప్రజలు వాటిని కాపాడుకోవడం ఒక సాహసవంతమైన చర్య. "సాలు పొంటి సాలు తీరు"గా వారి అవ్వ నుంచి మారుమూల గ్రామీణుల నుంచి వాళ్ల వాక్కును కల్తీ కాకుండా తన భాషగా చేసుకుని కాలగర్భంలో కలిసిపోగా మిగిలిన (పోయింది పొల్లు ఉన్నది గట్టి) జాతీయాల్ని ఏర్చికూర్చి "తెలంగాణ జాతీయాలు"గా గ్రంథస్తం చేశారు. ఉడుం పట్టు, దీక్ష కార్య శూరత్వం గల వారు ఎలాంటి మహాకార్యాన్నయినా అలవోక గా చేయగలరని తెలంగాణ జాతీయాలు పుస్తకం చూస్తే తెలుస్తుంది. వేముల పెరుమాళ్లు స్వస్థలం నాటి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల తాలుకా రాయికల్ గ్రామం. రాయికల్, కోరుట్ల, జగిత్యాలలో విద్యాభ్యాసం చేసిన పెరుమాళ్లు.. శ్రీకాళహస్తిలోని గ్రామసేవక్ శిక్షణా కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధిలో డిప్లమో చేశారు. 1963 నుంచి 18 ఏళ్ల పాటు గ్రామీణాభివృద్ధి అధికారిగా మల్యాల, జగిత్యాల పంచాయతీ సమితులలో ఉద్యోగం చేశారు. 1981లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి జగిత్యాల పంచాయతీ సమితి అధ్యక్ష ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాయికల్ మొదటి మండలాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉద్యోగం, రాజకీయం.. ఏ రంగంలో ఉన్నా.. సాహిత్యాన్ని మాత్రం మరవలేదు పెరుమాళ్లు. దశాబ్దకాలంగా కష్టనష్టాలకు ఓర్చి, పేర్చి కూర్చిన ఈ గ్రంథం తెలంగాణ జాతీయాలకు, సామెతలకు నిఘంటవుగా నేటికి ప్రతిబింబిస్తుంది. నోసుక పుట్టినట్టు వీరి మరణానంతరం తెలంగాణ జాతీయాల్ని ఇంటర్ ప్రథమ సంవత్సరం పాఠ్యాంశంగా స్వీకరించి వీరి శ్రమకు, తెలంగాణ భాషకు, యాసకు సముచిత గౌరవాన్ని కల్పించడం వీరికే కాదు తెలంగాణ జాతీయాలకు అగ్రాసనం వేసినట్టయింది. పెరుమాళ్లు తాత కైరం భూమదాసు గొప్ప వైష్ణవ భక్తుడు, కవి, గాయకుడు. కైరం భూమదాసు వ్రాతప్రతులను పరిష్కరించిన పెరుమాళ్లు 2002లో "వరకవి కైరం భూమదాసు కృతులు" గ్రంథాన్ని ప్రచురించారు. 1958 నుంచి 1968 మధ్య కాలంలో జరిగిన ఎన్నో జాతీయ పరిణామాలను వీరు పద్యాలుగా మలిచారు. వీరు రచించిన శ్రీ రాజరాజేశ్వర, శ్రీ ధరమపురి నృకేసరి శతకాలు సంబంధిత దేవాలయాలు ప్రచురించాయి. బాల సాహిత్యంలో వీరు చేసిన కృషి ఫలితంగా కిట్టూ శతకం (బాలనీతి), నిమ్ము శతకం (పర్యావరణ) వెలువడ్డాయి. మహాత్ముని మహానీయ సూక్తులను "గాంధీమార్గం" త్రిశతిగా రచించారు. "లోగుట్టు" వీరు రచించిన రాజనీతి చతుశ్శతి. ఎంతో కాలం వీరు సేకరించిన జాతీయాలు, సామెతలతో వెలువడిన గ్రంథం "తెలంగాణ జాతీయాలు". పెరుమాళ్లు మరణానంతరం వెలువడిన గ్రంథం మానవతా పరిమళాలు. 1983 నుంచి 2001 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి చేసిన "జ్యోతిపథం" లఘు ప్రసంగాల సంకలనం. జానపద సాహిత్యం కూరాడుకుండ లాంటిది. దానిని మైల పరచకుండా చూసే బాధ్యతని సాహితీప్రియులందరిపై వేశారు పెరుమాళ్లు. జానపదుడు రుషీసుంటోడు, ఆయన నోట వెలువడ్డ జాతీయం, సామెత గంగలో రాయిలాంటిది. ఎన్నో వందల సంవత్సరాలు అది ప్రజల నోళ్లలో నాని రగిడిల్లింది. తెలంగాణ జాతీయాలు తరతరాల మన సామాజిక చరిత్రకు సజీవ సాక్ష్యం. చిల్లి బొక్కతీరు లక్షల్లో వున్న తెలంగాణ జాతీయాల్ని వేలలో "పోయింది పొల్లు, ఉన్నది గట్టి తీరు"గా గ్రంథస్తం చేశారు పెరుమాళ్లు. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో సజీవంగా జానపదుని నాలుకపై తచ్చాడుతున్న జాతీయాల్ని.. ఔత్సాహికులు మరింత శ్రమించి కొత్త సంపదను జాతికి ఇవ్వాలన్న వారి కోరిక తీర్చాల్సిన తరుణం మళ్లీ వచ్చింది. అదే తెలంగాణ సాహిత్యానికి తిరిగి చెల్లించాల్సిన రుణం. వి.ప్రభాకర్, తెలంగాణ కవి, రిటైర్డ్ రిజిస్ట్రార్, సహకారశాఖ -
క్యూట్ ఎక్స్ప్రెషన్స్.. గోదావరి యాసతో కట్టిపడేస్తున్న చిన్నారి
వచ్చిరాని మాటలు, తెలిసి తెలియని చేతలతో చిన్నపిల్లలు చేసే పనులు ఒక్కోసారి భలే నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ చిచ్చరపిడుగు.. గోదావరి యాస, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిజన్ల కంటపడ్డాడు. బుడ్డోడి మాటలకు, హావభావాలకు వీక్షకులు ఫిదా అవుతున్నాయి. ‘బల్లు బల్లు మని బాదెసడమ్మి.. తూస్తే ఏడుపొచ్చేత్తమ్మి’ అంటూ ముద్దుగా ముద్దుగా మాట్లాడిన చిన్నారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓ ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. టీచర్ అనవసరంగా తనను కొట్టాడంటూ గోదావరి యాసలో చెబుతూ చిన్నారి చూపించిన ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. ‘గట్టిగా కొట్టేశాడు ఎదవ. సార్‌దే తప్పు.. చిన్నపిల్లోడ్ని ఎందుకు కొట్టాడు’ అంటూ బుడ్డోడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అతడు మాట్లాడిన మాటలు చాలా మందికి అర్థంకాకపోయినా హావభావాలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్: వైరల్ వీడియో.. హృదయానికి హత్తుకుంటోంది!) పెద్ద మనిషిలా మాట్లాడుతున్న ఈ చిన్నారి మంచి మాటకారి అవుతాడు. గోదావరి యాసను బతికిస్తున్నాడు. మంచి రెబల్ అవుతాడు. లవ్ యు రా బుజ్జి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ బాలుడు ఏ ఊరివాడు, ఈ వీడియో ఎప్పటిదనే వివరాలు వెల్లడికాలేదు. -
గోదావరి యాసతో కట్టిపడేస్తున్న చిన్నారి
-
మరోసారి నోరు పారేసుకున్న చింతమనేని
-
స్పెషల్‌డ్రైవ్ : యాసావేషాలు పార్ట్ -1