ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తింటుంటే బోర్ కొట్టడం ఖాయం. అందుకే రోజూ కొత్త కొత్త వంటలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల సోషల్‌మీడియలో కొత్త వంటకాల హవా పెరిగిందనే చెప్పాలి. పిజ్జా అంటే తెలియని వాళ్లే కాదు తినని వాళ్లు కూడా ఉండరేమో, అంతలా నచ్చుతుంది మనకి ఆ వంటకం. ఇక ఇందులో బోలెడు వెరైటీలు కూడా ఉన్నాయి. అయితే మనం రెగ్యులర్‌గా తినే విదేశీ పిజ్జా లాంటిది కాకుండా చిన్న మట్టి కప్పులో అదిరపోయే పిజ్జాను తయారు చేస్తామంటున్నారు సూరత్‌కు చెందిన ఫుడ్ స్టాల్.
తాజాగా ఆ పిజ్జా మేకింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో మొక్కజొన్న, టమాటా, వెన్న, సాస్ వంటివి కుండలో వేసి... మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసి... ముంత పిజ్జాను తయారుచేస్తున్నారు. దానికే కుల్లడ్ పిజ్జా లేదా కుల్హడ్ పిజ్జా అనే పేరు పెట్టారు. కుల్లడ్ అంటే మట్టితో చేసిన పాత్ర అని అర్థం. ఈ పిజ్జాని తయారీని ఓ వీడియోలో చిత్రీకరించగా దాన్ని ఆమ్చీ ముంబై ఛానెల్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది నెటింట చక్కర్లు కొడుతూ నెటిజన్ల నోరూరిస్తోంది.
చదవండి: బిల్ అడిగితే చిల్లర ఇచ్చాడు.. తీరా ఆర్డర్ చూసి షాక్ అయ్యాడు!
Comments
Please login to add a commentAdd a comment