Sonu Sood: సోషల్ మీడియాతో ద్వారా సోషల్ సర్విస్ ఎంత గొప్పగా చెయ్యొచ్చో నిరూపించాడు నటుడు సోనూసూద్. కరోనా కష్టకాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటిని వేగవంతంగా పరిష్కరించి ‘రియల్’హీరోగా నిలిచాడు ఈ రీల్ విలన్. కరోనా ఫస్ట్‌వేవ్ లాక్‌డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మిలకు సోనూసూద్ సొంత ఖర్చులతో ఇళ్లకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఏ కష్టమొచ్చిన సాయం అందిస్తూ పేదల పాలిట దేవుడిగా మారాడు.
(చదవండి: మేయర్ అభ్యర్థిగా సోనూసూద్.. క్లారిటీ ఇచ్చిన ‘రియల్ హీరో’!)
అయితే అందరి మాదిరే సోనూ సూద్‌కు కూడా సోషల్ మీడియాలో వింత ప్రశ్నలు, ఎగతాళి కామెంట్స్ ఎదురవుతూ ఉంటాయి. వాటికి సోనూ భాయ్ తనదైన శైలీలో సమాధానం ఇచ్చి నవ్వులు పూయిస్తాడు. తాజాగా ఓ నెటిజన్ సోనూసూద్ సర్ నాకు రూ. కోటి రూపాయలకు కావాలని కోరాడు. దీనికి సోను కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చాడు. కేవలం ఒక కోటి రూపాయలే సరిపోతాయా? కొంచె ఎక్కువ అడగండి’అంటూ నవ్వుతున్న ఎమోజీతో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరోవైపు సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. 2022 లో జరిగే బృహత్ ముంబై ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా సోనూ సూద్ దిగబోతున్నారని టాక్ వినిపించింది. దీనిపై సోనూసూద్ స్పందిస్తూ.. ‘ఇది నిజం కాదు. నేను సాధారణ వ్యక్తిగా చాలా సంతోషంగా ఉన్నాను’అని ట్వీట్ చేశాడు.
बस 1 करोड़ ??
— sonu sood (@SonuSood) August 23, 2021
थोड़े जायदा ही मांग लेता 😂 https://t.co/5h3KkCrrEA
Comments
Please login to add a commentAdd a comment