![Sonu Sood Funny Reply To Netizen Who Ask I Phone - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/2/i-phone.jpg.webp?itok=05vX09C8)
కష్టం, సహాయం అనే మాటలు వినిపిస్తే చాలు అక్కడ క్షణంలో వాలిపోతున్నారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్.. లాక్ డౌన్ కాలంలో వలస కూలీలను ఆదుకొని వారి పాలిట దేవుడు లాగా నిలిచిన సోనూ సూద్ ఇప్పటికీ ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. సినిమాల్లో అయన విలన్ అయినప్పటికీ ఇప్పుడు సోనూ రియల్ హీరో అనిపించుకుంటూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. (నీట్, జేఈఈ : రియల్ హీరో రంగంలోకి)
అయితే సోనూ చేస్తున్న సాయాన్ని కొందరు ఆకతాయిలు ఆసరాగా తీసుకొని మితిమీరి ప్రవర్తిస్తున్నారు.. ఏ సాయం అడిగిన చేస్తాడని భావించి వింత కోరికలు కోరుతున్నారు. మందు కావాలని, లవర్ దగ్గరికి పంపండి, వీడియో గేమ్ ఆడుకోడానికి ఫోన్ కావాలని అడుగుతున్నారు. ఈ క్రమంలో ఓ ట్విటర్ యూజర్.. ‘వీ సినిమా చూడాలి. ఏడాదికి సరిపడా అమెజాన్ ప్రైమ్ ఇప్పించండి’ అని కోరాడు. కాగా దీనిపై స్పందించిన సోనూ సూద్ నెటిజన్‌కు సమాధానమిచ్చారు. ‘అమెజాన్ ప్రైమ్ సరిపోతుందా లేదా టీవీ, ఏసీ, పాప్‌కార్న్ కూడా కావాలా’ అని సరదాగా బదులిచ్చారు. (విద్యార్థుల లైఫ్‌ను రిస్క్‌లో పెట్టలేం: సోనూ సూద్)
ఇదిలా ఉండగా మరో నెటిజన్.. తనకు ఐఫోన్ కావాలని కోరాడు.. ‘నాకు ఐఫోన్ కావాలి. దీని గురించి ఇప్పటి వరకు మీకు 20 సార్లు ట్వీట్ చేశాను’ అని విజ్ఞప్తి చేశాడు.వస్తున్నాడు. ఇక ఈ కామెంట్‌పై సోనూ స్పందిస్తూ..‘నాకూ ఓ ఫోన్ కావాలి. దాని కోసం నేను మీకు 21సార్లు ట్వీట్ చేయగలను’..అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఏదైమైనా అడిగిన వారికి కాదనకుండా సాయం చేస్తూ తన సేవలను మరింత విస్తృతం చేస్తున్నారు సోనూ సూద్. (సోనూ సూద్ మనసు బంగారం)
Comments
Please login to add a commentAdd a comment