'మీకు మలబద్ధకం అనుకుంటా.. మందులు పంపిస్తా'.. షారుక్ ఖాన్ అదిరిపోయే రిప్లై! | Netizen Asked About Sharukh Khan Movie Dunki Movie Goes Viral | Sakshi
Sakshi News home page

Sharukh Khan: 'మీలాంటి తెలివైన వారికి సమాధానం చెప్పను'.. నెటిజన్‌కు బాద్‌షా కౌంటర్!

Published Thu, Dec 7 2023 3:53 PM | Last Updated on Thu, Dec 7 2023 4:19 PM

Netizen Asked About Sharukh Khan Movie Dunki Movie Goes Viral - Sakshi

ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్‌ బాద్‌షా మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. డీంకీ పేరుతో ఈ ఏడాది క్రిస్‌మస్‌ పండుగకు అభిమానులను పలకరించబోతున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే మూవీ విడుదలకు ముందు నెటిజన్స్‌తో చిట్‌ చాట్‌ నిర్వహించడం మన స్టార్‌ హీరోకు అలవాటు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్విటర్‌లో ముచ్చటించారు షారుక్.

అయితే ఈ సందర్భంగా షారుక్‌ ఖాన్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఓ నెటిజన్ రాస్తూ.. ' మీ పీఆర్‌ టీమ్‌ బాగా పని చేయడం వల్లే పఠాన్, జవాన్ సినిమాలు సక్సెస్ అయ్యాయి కదా సార్. అలాగే డంకీ సినిమాకు కూడా అలాగే బ్లాక్ బస్టర్‌ అవుతుందంటారా? అని ప్రశ్నించాడు. అయితే దీనికి షారుక్ ఖాన్ కాస్తా వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. 

షారుక్ రిప్లై ఇస్తూ..'సాధారణంగా మీలాంటి తెలివైన వారికి నేను సమాధానం చెప్పను. కానీ మీ విషయంలో మాత్రం మినహాయింపు ఇస్తున్నా. ఎందుకంటే మీరు మలబద్ధకం కోసం చికిత్స తీసుకోవాల్సి ఉందని నేను భావిస్తున్నా. నా పీఆర్ బృందానికి కొన్ని మంచి మందులు నీకు పంపమని చెబుతా...మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అంటూ తనదైన శైలిలో ఇచ్చిపడేశాడు. 

కాగా.. హ్యాట్రిక్​ లక్ష్యంగా షారుక్ 'డంకీ' సినిమాతో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్‌తో పాటు విక్కీ కౌశల్‌, తాప్సీ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ట్రైలర్‌ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అదే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సలార్‌తో పోటీ పడి నిలుస్తోందో లేదో వేచి చూడాల్సిందే. డంకీ రిలీజైన తర్వాత రోజే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తోన్న సలార్ విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement