Twitter Blue Tick Fee Controversy: Check How Twitter Users Reacted - Sakshi
Sakshi News home page

Bluetick ట్విటర్‌ బ్లూటిక్‌ వివాదం: మండిపడుతున్న నెటిజన్లు 

Published Mon, Oct 31 2022 1:32 PM | Last Updated on Mon, Oct 31 2022 2:52 PM

Twitter Blue tick fee controversy How Twitter users reacted - Sakshi

సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద మైక్రోబ్లాగింగ్ సైట్‌ ట్విటర్‌లో బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పలు మీమ్స్‌, సెటైర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. నెలకు 20 డాలర్లు (రూ.1600కుపై మాటే) చెల్లించడం అవసరమా? అని విమర్శిస్తున్నారు. దీని బదులు నెలకు 1600 సిప్‌ (సిస్టంఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ద్వారా పెట్టుబడి పెట్టుకోవచ్చు అని ఒకరు మండిపడ్డారు. బ్లూటిక్కా? అసవసరమే లేదు. అదేమీ సర్టిఫికేట్‌ కాదుగా..అసలు నేను ఎపుడూ అడగలేదు అంటూ ఒక యూజర్‌ వ్యాఖ్యానించారు.  (ట్విటర్‌ యూజర్లకు షాక్‌: భారీ వడ్డన దిశగా మస్క్‌ ప్లాన్లు)

కాగా బిలియనీర్‌  టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌  ట్విటర్‌  కొనుగోలు తరువాత సంచలన  నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ట్విటర్‌ చేతికి రాగానే సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ సహా కీలక ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేసిన మస్క్‌ సంస్థలో ఉద్యోగులను తొలగించే ప్రణాళిల్లోఉన్నట్టు పలు నివేదికలుకోడై కూస్తున్నాయి. అయితే ఈ వార్తలను మస్క్‌ తిరస్కరించినప్పటికీ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. సరికొత్తగా బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు అంతర్గత పత్రాలను ఉటంకిస్తూ వెర్జ్ రిపోర్ట్‌ చేసింది. నవంబర్ 7లోగా ఈ కొత్త వెరిఫికేషన్ రీవాంప్‌ను రూపొందించాలని, లేదంటే వేటు తప్పదని మస్క్ తన ఉద్యోగులను కోరినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement