జబర్దస్త్ టీమ్ మొత్తాన్ని దించేశాడుగా
పెళ్లి కార్డు చూసి.. అందులోని కుటుంబాలు.. బంధువుల తీరు చూసి అది ఎంత గొప్ప సంబంధమో చెప్పేయొచ్చు. సినిమా పోస్టర్లోని పేర్లు చూసి.. అంటే హీరో హీరోయిన్లు.. డైరెక్టర్.. మ్యూజిక్.. విలన్స్.. ఇతర టెక్నీషియన్స్ను చూసి అది ఎలాంటి కాంబినేషలో చెప్పేయొచ్చు. క్రికెట్ టీమ్ లోని సభ్యులను బట్టి ఆయా జట్టు ఎంత బలమైందో ఒక అంచనాకు రావచ్చు. అదే విధంగా ఒక రాజకీయ పార్టీ తానూ ఎంపిక చేసుకున్న అభ్యర్థులను బట్టి.. దానికోసం ఆ పార్టీ చేసిన కసరత్తును బట్టి.. ప్రచార శైలిని బట్టి దానికి రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం ఉంది.. ఆ పార్టీ గమనం ఎలా ఉంటుందో చెప్పవచ్చు. అందుకే పెద్దలు కాళ్ళు తొక్కినపుడే కాపురం కళ తెలిసిపోతుందని అనేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన ప్రకటించిన అభ్యర్థుల ప్రొఫైల్స్ చూసి ప్రజలు.. కార్యకర్తలు నీరుగారిపోగా ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప్రచారం చేసే ప్రధాన ప్రచారకర్తలు (స్టార్ క్యాంపెయినర్లను) చూసి కూడా జనం నివ్వెరపోతున్నారు.
మొత్తానికి జబర్దస్త్ నటులతో ఈ 2024 ఎన్నికల స్కిట్ పూర్తి చేస్తావ్ అన్నమాట. రాజకీయాలంటే మీ @JanaSenaParty కి అంత కామెడీ అయిపోయాయి! ప్రజాసేవ మీ దృష్టిలో కామెడీ అయిపోయింది. ఇక మీకు రాజకీయాలెందుకు, డైలీ డబ్బులు వచ్చే కామెడీ స్కిట్లు, సినిమా కాల్షీట్లు చూసుకోండి! #PackageStarPK… https://t.co/4Sh27uDfyq
— YSR Congress Party (@YSRCParty) April 10, 2024
వాస్తవానికి ఏదైనా పార్టీ తరఫున ప్రముఖ రాజకీయ నాయకుడు.. లేదా పెద్ద క్రీడాకారుడు.. సినిమా స్టార్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుంటారు కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం జబర్దస్త్.. ఇతర టీవీ షోల్లో కామెడీ కార్యక్రమాలు వేసే కామెడియన్లను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించారు. డాన్స్ మాస్టర్ జానీ.. హైపర్ ఆది.. గెటప్ శీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఇలాంటివాళ్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుని రాజాకీయ ప్రచారం చేస్తున్నారు. అసలు వాళ్లకు రాజకీయాలు గురించి ఏమైనా తెలుసా? వాళ్లకు కనీస అవగాహనా అయినా ఉందా.? అసలు ఆ పార్టీని నెత్తినపెట్టుకుని మోయాల్సిన అవసరం.. ఆ జనసేనకు వత్తాసు పలకాల్సిన అవసరం వాళ్లకు ఏముందనున్నది అర్థం కానీ విషయం.
ఇక పార్టీలో కేవలం చందాలు వసూళ్లకు మాత్రమే ముందుకు వచ్చే నాగబాబు ఎక్కడా ప్రచారసభల్లోకి వెళ్లడం లేదు. పోనీ జనసేన పోటీ చేస్తున్న చోట్ల కూడా నాగబాబు ప్రచారం చేయడం లేదు. ఇదిలా ఉండగా కేవలం కొద్దిమంది టీవీ ఆర్టిస్టులు మినహా పవన్ వెంట ఎవరూ కనిపించడం లేదన్నది మరోమారు స్పష్టమైంది. పవన్కు రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం.. ఎలాంటి దృక్పథం ఉందన్నాడో ఈ ప్రచార కమిటీ చూస్తే తెలుస్తోందని అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం తమ ప్రభుత్వంలో ప్రయోజనాలు పొందినపేదలు, లబ్దిదారులే తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment