Netizens Shocking Trolls On Anchor Anasuya Latest Photos, Deets Inside - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: ముడతలు కనిపిస్తున్నాయ్‌.. గ్లో తగ్గింది.. అనసూయపై కామెంట్లు

Published Wed, Jun 15 2022 6:03 PM | Last Updated on Thu, Jun 16 2022 12:19 PM

Netizens Comments On Anasuya Latest Photos - Sakshi

Netizens Comments On Anasuya Latest Photos: బుల్లితెర యాంకర్​ అనసూయ భరద్వాజ్​ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అటు యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. ఇటీవల ఐకానిక్​ స్టార్ అల్లు అర్జున్​ పాన్​ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్​'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది అనసూయ. రవితేజ ఖిలాడీ మూవీలో రెండు వేరియేషన్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్‌ యాంకర్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. దర్జా, వాంటెడ్‌ పండుగాడ్‌, గాడ్ ఫాదర్‌ తదితర చిత్రాల్లో నటిస్తూ ఫుల్ జోష్‌లో ఉంది. 

సినిమాలే కాకుండా సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు పెడుతూ ఎంటర్‌టైన్‌ చేస్తుంది అనసూయ. అయితే అప్పుడుప్పుడు వాటితో పలు విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. ఆ విమర్శలకు తిరిగి దిమ్మతిరిగే కౌంటర్లు కూడా ఇస్తుంటుంది ఈ బ్యూటిఫుల్‌ యాంకర్. తాజాగా మరోసారి తను పెట్టిన ఫొటోలపై విమర్శలు గుప్పించారు నెటిజన్స్‌. 'ముసలి దానిలా కనిపిస్తున్నావ్‌', 'ముఖంలో గ్లో తగ్గింది', 'మేకప్‌ సరిగ్గా వేసుకోలేదా ?', 'అసలైన వయసు బయటపడింది', 'మేకప్‌, డ్రెస్సింగ్‌ బాలేదు', 'ముడతలు కనిపిస్తున్నాయ్‌', 'కొంచెం ఏజ్‌డ్‌గా ఉన్నారు' అంటూ నెగెటివ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. వీటితోపాటు పలువురు అభిమానులు 'చాలా అందంగా ఉన్నారు', 'లుకింగ్‌ నైస్‌', 'వావ్‌', 'బ్యూటిఫుల్‌' అంటూ పొగుడుతున్నారు. మరీ ఈ కామెంట్స్‌పై అనసూయ ఏమైనా స్పందిస్తుందో చూడాలి. 

చదవండి: తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి
చికిత్స కోసం అమెరికా వెళ్లిన నటుడు.. ఎయిర్‌పోర్టులో ఎమోషనల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement