Anchor Anasuya Strong Counter To Netizens For Abusive Trolls On Social Media - Sakshi
Sakshi News home page

నోరుపారేసుకున్న నెటిజన్‌.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన అనసూయ

Published Mon, Feb 8 2021 10:04 AM | Last Updated on Mon, Feb 8 2021 10:57 AM

Anasuya Strong Counter To Netizen Abuse Comment In Twitter - Sakshi

సెలబ్రిటీలకు సంబంధించి ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి ఎక్కువగా చూపుతుంటారు. వారిని నేరుగా కలుసుకునేందుకు కుదరకపోవడంతో సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ఫాలో అవుతుంటారు. తాము ఆరాధించే వారు మంచి పని చేసినప్పుడు పొగడ్తలతో ముంచెత్తడంతోపాటు నచ్చని పనులు చేసినా ఎలాంటి మొహమాటం లేకుండా తిట్టిపారేస్తుంటారు. ఈ క్రమంలోనే బుల్లితెర యాంకర్‌ అనసూయకు ఓ నెటిజన్‌ కారణంగా చేదు అనుభవం ఎదురైంది. బుల్లితెర‌పై త‌న‌దైన ముద్ర వేసుకొని అటు వెండితెర‌పై త‌న టాలెంట్ చూపిస్తూ దూసుకుపోతున్న అన‌సూయ సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటారు.

ఈ నేపథ్యంలో అనసూయకు చెందిన ఓ ఫోటోపై పోస్టుపై అభిమాని ఫైర్‌ అయ్యాడు. మూడేళ్ల క్రితం నాటి ఫోటోపై స్పందిస్తూ ఓ నెటిజన్ రంగమత్తను అసభ్య పదజాలంతో దూషించాడు. టీవీ షో ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అనసూయ లోబీపీ కారణంగా కళ్లు తిరిగిపడిపోయింది. ఈ ఫోటోను పట్టుకొని అంద‌రి అటెన్ష‌న్ కోసం అనసూయ ఇలా చేస్తుంద‌ని నెటిజ‌న్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. సాధారణంగా ఇలాంటి ట్రోల్స్‌ను లైట్‌ తీసుకొనే ఈ భామ దీనిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

‘ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన ఈ వీడియోను పట్టుకొని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు. నీతో మాట్లాడటం కూడా దండగ. కానీ నువ్వు మొదలు పెట్టావు. ఇలాంటి వాటికి కౌంటర్ ఇవ్వకపోతే.. ముందు ముందు నీలాంటి వాళ్లు మా పై మరింత బురద జల్లే అవకాశం ఉంది. అందుకే నీకు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకు’.. అంటూ సదురు నెటిజన్ తీరును కడిగిపారిసేంది. కాగా సోషల్‌ మీడియాలో అనుసూయకు అండగా నిలుస్తున్నారు. మేడమ్‌ మీకు మేమున్నాం.. ఇలాంటి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటూ మద్దతుగా కామెంట్‌ చేస్తున్నారు. 
చదవండి: అనుష్క సెల్ఫీ: ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement