ప్రస్తుతం టెక్నాలజీ పరంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవనే చెప్పాలి. ఇటువంటి తరహాలో ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అది ఓ పెద్ద బండరాయికి సంబంధించిన ఫోటో అది. ఆ బండరాయి సరిగ్గా మధ్యలో చీలిపోయి ఉంటుంది. ఇందులో వింత ఏమిటంటే.. మధ్యలో చీలిన ఆ రాయి అలా కట్ చేయడం మనుషుల వల్ల కూడా ఖచ్చితంగా అవుతుందని చెప్పలేం. అందుకే ఆ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. 30 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు కలిగిన ఈ బాహుబలి బండరాయిని సౌదీ అరేబియాలోని తైమా ఒయాసిస్‌లో మనం చూడవచ్చు. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు మాత్రం ఆ రాయి అలా ఉండడానికి కారణంగా పలు సిద్ధాంతాల పేర్లను కామెంట్ చేస్తున్నారు. ఆ బండరాయిని గ్రహాంతరవాసులే అలా చీల్చి ఉంటారని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. వేరే గ్రహం నుంచి లేజర్ పాయింటర్ ద్వారా దాన్ని చీల్చి ఉంటారు అని మరికొందరు కామెంట్ చేశారు.
ఇదేనా ఆ రహస్యం
బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో గౌరవ పరిశోధనా సహచరుడు అయిన లూయిస్ ఈ రాయి వెనుక రహస్యాన్ని చేధించినట్లు తెలిపారు. 'ఆ బండరాయి అలా సమానంగా చీలిపోవడానికి కారణం.. ఫ్రీజ్ థా వెథరింగ్ ఎఫెక్ట్ అని స్పష్టం చేశారు. నీళ్లు ఆ బండరాయి మీదకు చేరి.. దానికి పగుళ్లు ఏర్పడటంతో అలా సమానంగా చీలిపోయే అవకాశం ఉంటుందని.. దాన్నే ఫ్రీజ్ థా వెథరింగ్ ఎఫెక్ట్ అంటారని ఆయన స్పష్టం చేశారు. అయితే బండరాయి ఆ రకంగా సగానికి చీలే ప్రక్రియకు కొన్ని వేల సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. లెవిస్ చెప్పిన విషయాన్ని కొందరు నమ్మినా.. మరికొందరు మాత్రం… ఏదో హైయ్యర్ టెక్నాలజీని ఉపయోగించి.. ఆ బండరాయిని అలా సమానంగా చీల్చారని కొందరు చెబుతున్నారు.
చదవండి: Old Couple Love story: డేటింగ్ యాప్‌లో పరిచయం.. 70 ప్లస్‌లో ప్రేమ.. ఆపై పెళ్లి
Comments
Please login to add a commentAdd a comment