పరిసరాలకు అనుగుణంగా ఊసరవెల్లి రంగులు మార్చగలదని మనందరికీ తెలిసిందే. మరి ఓ పిట్ట రంగులు మార్చడాన్ని మీరెప్పుడైనా చూశారా? తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి చేతిపై వాలిన అన్నాస్ హమ్మింగ్ బర్డ్ అటూ ఇటూ తల తిప్పినప్పుడల్లా ముదురు ఆకుపచ్చ నుంచి నలుపు వరకు వివిధ రంగులను మార్చడం నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.
ఈ పిట్టల ఈకల్లో ప్యాన్ కేక్ ఆకృతిలో ఉండే పిగ్మెంట్లే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హమ్మింగ్ బర్డ్ తల తిప్పినప్పుడల్లా ఈ పిగ్మెంట్లు కాంతికిరణాలను మళ్లించడం వల్ల అది రంగులు మారుస్తున్నట్లుగా మనకు అనిపిస్తుందని పేర్కొన్నారు.
The stunning colors of the Anna's hummingbird are iridescence caused by light scattering from nanoscale structures within their feathers.pic.twitter.com/BZzXuFnHag
— Wonder of Science (@wonderofscience) July 21, 2022
Comments
Please login to add a commentAdd a comment