humming bird
-
పక్షి ప్రపంచంలోని ఆసక్తికరమైన విషయాలు (ఫోటోలు)
-
వైరల్ వీడియో: రంగులు మార్చే పక్షిని చూశారా!
పరిసరాలకు అనుగుణంగా ఊసరవెల్లి రంగులు మార్చగలదని మనందరికీ తెలిసిందే. మరి ఓ పిట్ట రంగులు మార్చడాన్ని మీరెప్పుడైనా చూశారా? తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి చేతిపై వాలిన అన్నాస్ హమ్మింగ్ బర్డ్ అటూ ఇటూ తల తిప్పినప్పుడల్లా ముదురు ఆకుపచ్చ నుంచి నలుపు వరకు వివిధ రంగులను మార్చడం నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఈ పిట్టల ఈకల్లో ప్యాన్ కేక్ ఆకృతిలో ఉండే పిగ్మెంట్లే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హమ్మింగ్ బర్డ్ తల తిప్పినప్పుడల్లా ఈ పిగ్మెంట్లు కాంతికిరణాలను మళ్లించడం వల్ల అది రంగులు మారుస్తున్నట్లుగా మనకు అనిపిస్తుందని పేర్కొన్నారు. The stunning colors of the Anna's hummingbird are iridescence caused by light scattering from nanoscale structures within their feathers.pic.twitter.com/BZzXuFnHag — Wonder of Science (@wonderofscience) July 21, 2022 -
వావ్! రంగులు మార్చిన హమ్మింగ్ బర్డ్
-
తేనెపిట్ట మాటలు వింటారా?
అందరిలాగే ఒకానొక సమయంలో హమ్మింగ్ బర్డ్ గురించి విన్నది అనూష శంకర్. ఈ అతిచిన్న పక్షి అతి చురుకుదనం, గొంతు మార్చే నైపుణ్యం, ముక్కును తన రక్షణ కోసం ఆయుధంగా వాడే బలం...ఇలా ఎన్నో విషయాలు విన్నది అనూష. ఈ ఆసక్తి తనను పక్షుల ప్రేమికురాలిగా మార్చింది. పర్యావరణ వేత్త కావడానికి కారణం అయింది. పుణెలో పుట్టి పెరిగిన అనూష పైచదువుల కోసం చెన్నై వెళ్లింది. అక్కడ జంతుశాస్త్రం, బయోటెక్నాలజీలలో డిగ్రీ చేసింది. న్యూయార్క్‌లోని స్టోనీ బ్రూక్ యూనివర్శిటీలో ‘ఎకాలాజీ అండ్ ఎవల్యూషన్’ అనే అంశంపై పీహెచ్డీ చేసింది. ‘పక్షులకు సంబంధించి నాకు ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉండేవి. వాటిని తీర్చే వ్యక్తులు, పుస్తకాలు ఉండేవి కాదు. ఈ లోటు వల్ల నాలో అన్వేషణ మొదలైంది. రకరకాల విషయాలను స్వయంగా తెలుసుకోవడంలో ఎంతో తృప్తి లభించింది’ అంటున్న అనూష తాను తెలుసుకున్న విషయాలను రచనలు, ఉపన్యాసాలు, వీడియోల రూపంలో జనాలలోకి తీసుకెళుతుంది. తన పరిశోధనలో భాగంగా అస్సాం అడవులలో ఒంటరిగా కొన్ని వారాలపాటు గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో అడవిలో చెట్లు, పుట్టలు, పక్షులు, జంతువులు తన ఆత్మీయనేస్తాలు అయ్యాయి. వాటితో మౌనసంభాషణ చేసేది. ఈ నేపథ్యంలోనే హమ్మింగ్ బర్డ్ గురించి ఆనోటా ఈనోటా ఎన్నో విషయాలు విన్నది. ఎన్నో పుస్తకాల్లో చదివింది అనూష. ఇదిమాత్రమే కాకుండా తానే స్వయంగా రంగంలోకి దిగింది. హమ్మింగ్ బర్డ్‌పై పది సంవత్సరాల పాటు పరిశోధన చేసింది. ఈక్వెడార్ క్లౌడ్ఫారెస్ట్... మొదలైన ఎన్నో ప్రాంతాలకు వెళ్లింది. ‘మన వ్యక్తిత్వవికాసానికి అవసరమైన పాఠాలు, ఆరోగ్యస్పృహకు సంబంధించిన అంశాలు హమ్మింగ్‌బర్డ్ జీవితం నుంచి విస్తృతంగా లభిస్తాయి’ అంటుంది అనూష. నిజమే మరి! అతి చిన్నదైన హమ్మింగ్ పక్షిలో జీవక్రియ శక్తివంతమైనది. దీనికి ఆ పక్షి తీసుకునే జాగ్రత్తలు కూడా ఒక కారణం. పరిమితమై శక్తితో అపరిమితమైన శక్తిని ఎలా సమకూర్చుకుంటుంది, అత్యంత ప్రతికూల వాతావరణంలో సైతం ఏ మాత్రం నష్టం జరగకుండా తనను తాను ఎలా కాపాడుకుంటుంది, ఎనర్జీ బడ్జెట్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటుంది... మొదలైన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు హమ్మింగ్‌బర్డ్ జీవితంలో ఉన్నాయి. మనం ఆ తేనెపిట్ట మాటలు విందాం... మన జీవితాలలో కూడా తేనెను నింపుకుందాం. -
వైరల్: చావోరేవో అన్నట్లు.. గట్టిగా అరుస్తూ హంగామా
బుల్లి హమ్మింగ్ బర్డ్ పాముకు సమఉజ్జీ కానేకాదు.. కానీ.. గుండె ధైర్యం ఎక్కువలాగుంది.. అందుకే తన గూటి జోలికి.. అందులో ఉన్న పిల్లల జోలికి రావడానికి ప్రయత్నిస్తున్న ఈ గ్రీన్ పిట్ వైపర్‌కు ఎదురెళ్లింది.. చావోరేవో అన్నట్లు తెగించింది.. గట్టిగా అరుస్తూ.. దాని చుట్టూ తిరుగుతూ హంగామా చేసింది.. ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించింది.. ఏమనుకుందో ఏమో.. చివరికి ఈ పాము వెనక్కి తగ్గింది. పిట్టదే పైచేయి అయింది.. ఈ చిత్రాన్ని బెన్స్మేట్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. ఇది మనకు తెలిసిందేగా.. అయితే.. ఇక్కడ విడవలేదు.. అలాగని కరవనూలేదు.. ఇదో చాలా చిత్రమైన పరిస్థితి. ఫొటో చూస్తున్నారుగా.. తనను కరవడానికి వచ్చిన పాము గొంతును ఈ కప్ప ఎలా పట్టుకుందో.. ఈ ట్రీ స్నేక్ కప్పను అమాంతం మింగేద్దామని వచ్చినా.. అది తెలివిగా పక్కకు తప్పుకోవడంతో ఈ మాత్రమే నోటికి చిక్కింది. దీంతో కప్ప విజృంభించేసింది.. పట్టు బిగించింది.. ఇలా ఇవి కొన్ని గంటలపాటు ఉండిపోయాయట. అలా ఉండిఉండి నీరసించి.. చివరికి దేనిదారిన అవి వెళ్లిపోయాయట. ఈ చిత్రాన్ని బెలీజ్ దేశ అడవుల్లో డేవిడ్ మైట్‌ల్యాండ్ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. చదవండి: ఈ హెరిటేజ్ సైట్స్‌లోకి వెళ్లలేం.. ఇదొకటే దారి! -
అరణ్యం : హమ్మింగ్ బర్డ్ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది!
ప్రపంచంలోనే అత్యంత చిన్న పక్షి... హమ్మింగ్ బర్డ్! హమ్మింగ్ బర్డ్ అనడంతో ఇది పాట పాడుతుందేమో అనుకుంటారు చాలామంది. కానీ అలాంటిదేమీ కాదు. ఇది రెక్కలు ఆడించినప్పుడు ఓ చక్కని శ్రావ్యమైన శబ్దం వస్తుంది. దాని కారణంగానే దీనికా పేరు వచ్చింది! వీటికి వాసన చూసే శక్తి లేదు! వీటి నాలుక ఇంగ్లిష్ అక్షరం ‘డబ్ల్యూ’ ఆకారంలో ఉంటుంది! వాతావరణాన్ని బట్టి వీటి ఒంటి రంగు మారుతుంది! వీటి గుండె నిమిషానికి 1,260 సార్లు కొట్టుకుంటుందట! ముందుకీ వెనక్కీ కూడా ఎగరగల పక్షి ఇదొక్కటే. ఇవి గుండ్రంగా చక్కర్లు కూడా కొట్టగలవు. పైకి, కిందికి నిటారుగా కూడా ఎగరగలవు! హమ్మింగ్ బర్డ్ కాళ్లు చాలా బలహీనంగా ఉంటాయి. కాబట్టి ఇవి నడవలేవు. అందుకే ఇవి ఎక్కడా వాలడానికి ఇష్టపడవు. తేనె పీల్చేటప్పుడు కూడా గాల్లో ఎగురుతూనే పీల్చడానికి ప్రయత్నిస్తాయి! మగ హమ్మింగ్ బర్డ్స అసలు ఏ పనీ చేయవు. ప్రతిదానికీ ఆడవాటి మీదే ఆధారపడతాయి. గూడు కట్టడం దగ్గర్నుంచి, గుడ్లు పొదగడం, పిల్లలకు ఆహారం తీసుకు రావడం వరకూ ఆడవే చేస్తాయి! వీటికి ఎరుపు రంగంటే చాలా ఇష్టం. ఎక్కువగా ఎర్రటి పూల తేనెనే గ్రోలుతాయి! ఇవి ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోలేవు. అలాగని తరచూ తినకపోతే బతకలేవు. అందుకే గంటకు ఏడు నుంచి పదిసార్లు తింటాయి. ప్రతిసారీ ముప్ఫై నుంచి నలభై సెకన్లు భోజన కార్యక్రమానికి వెచ్చిస్తాయి. తేనె, జిగురు, చిన్న చిన్న పురుగుల్లాంటివి తింటాయి! జూ కలిపిన బంధం ఇది! స్నేహమేరా జీవితం అంటూ మనుషులు పాటలు పాడుకోవడం మనకు తెలుసు. కానీ స్నేహం మాకూ ఉంటుంది, మా స్నేహం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది అని నిరూపించాయి ఈ రెండు మూగజీవాలు. ఈ ఫొటోలో ఉన్న జిరాఫీ పేరు... గెరాల్డ్. దానితో ఉన్న బుజ్జి మేక పేరు ఎడ్డీ. 2006లో గెరాల్డ్‌ని యూకేలోని ‘నోవాస్ ఆర్క్ జూ’కి తీసుకొచ్చారు అధికారులు. అప్పటికి దాని వయసు రెండేళ్లు. చిన్నిది కావడంతో అందరూ ఎంతో ముద్దుగా చూసేవారు. అయితే దీని ప్రవర్తన విచిత్రంగా ఉండేది. ఇతర జిరాఫీలకు దగ్గరయ్యేది కాదు. వాటితో చెలిమి చేసేది కాదు. కానీ ఎడ్డీకి మాత్రం ఎందుకో చాలా దగ్గరయ్యింది. ప్రాణప్రదమైన నేస్తమయ్యింది. గెరాల్డ్ తోటి జిరాఫీలను కాదని మేకతో స్నేహం చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ గెరాల్డ్ అవేమీ పట్టించుకోలేదు. ఎప్పుడూ ఆ మేకను వెంటేసుకుని తిరిగేది. ఆ జూలో ఉన్న ఇతర జంతువులేవైనా ఎడ్డీని విసిగిస్తే కోపమొచ్చేసేది గెరాల్డ్కి. వాటితో పోట్లాటకు దిగేది. చివరకు రెండింటికీ కలిపి ఒకసారి పెడితేనే ఆహారం తినేది. ఒకదానికి మాత్రమే పెడితే, రెండోదానికి పెట్టేవరకూ అది ముట్టేది కాదు. ఆ రెండూ కలిసి జూ అంతా గెంతులేస్తూ తిరుగుతుంటే చూసి మురిసిపోవడం అధికారుల వంతయ్యింది. ఓ గొప్ప స్నేహితులుగా ఈ జీవాల జంట పాపులర్ అయ్యింది!