బనశంకరి: ఆషాఢ అమావాస్య నేపథ్యంలో రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలకు రద్దీ పెరిగింది. వేలాదిగా భక్తజనం అటు ఇటు ప్రయాణాలు చేస్తున్నారు. ఇక మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావడంతో వారి రద్దీ విపరీతంగా ఉంటోంది.
పురుషులకు కూడా సీట్లు దొరకడం లేదు. ఆదివారం మైసూరు చాముండేశ్వరి, ధర్మస్థల, కుక్కే సుబ్రమణ్య, శృంగేరి– హొరనాడు, హాసన్ నిమిషాంబ, సిగందూరు, నందిబెట్ట తదితర పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు పెద్దసంఖ్యలో మహిళలు ప్రయాణించారు.
సెలవురోజు కావడంతో మహిళలు తమ భర్త, పిల్లలను సైతం తమ వెంట తీసుకెళ్లారు. బెంగళూరు మెజస్టిక్ కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండు, మైసూరు రోడ్డు శాటిలైట్ బస్టాండు కిటకిటలాడాయి. మైసూరు, మహదేశ్వర బెట్టకు అధికసంఖ్యలో మహిళలు తరలివెళ్లారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల బస్టాండ్లలో ఇదే రద్దీ కనిపించింది. ఆర్టీసీ సిబ్బందికి సైతం పనిభారం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment