పాత ప్రియుడే హంతకుడు
మాట్లాడడం లేదని కక్ష
బెంగళూరులో దారుణం
సాక్షి, బెంగళూరు: పాత స్నేహానికి బ్రేకప్ చెప్పినందుకు కక్ష పెంచుకుని బంగ్లా మహిళను జరిపి హతమార్చిన ఘటన నగరంలో జరిగింది. నిందితుడు ముదుకప్పను రామమూర్తినగర పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. హతురాలు నజ్మా (28), వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్న ముదుకప్ప మధ్య పాత స్నేహం ఉండేది.
క్రమేణా ఇద్దరి మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఆరు నెలల క్రితం నజ్మా ఉన్న అక్రమ బంగ్లా వలసదారుల గుడిసెలపై పోలీసులు దాడి జరిపారు. తర్వాత నజ్మా, ముదుకప్పల మధ్య స్నేహానికి బ్రేక్ పడింది. నజ్మా పని చేస్తున్న అపార్ట్‌మెంట్‌కు నీరు వదిలేందుకు వెళ్లినప్పుడు అక్కడ నజ్మా కనిపించడంతో ముదుకప్ప మళ్లీ ఆమె వెంటపడ్డాడు. అతనితో మాట్లాడేందుకు నజ్మా నిరాకరించింది.
వెంటాడి.. హత్య
గత నెల 23న నజ్మా విధులు ముగించుకుని కల్కెరె చెరువు మార్గంలో ఇంటికి వెళుతుండగా ముదుకప్ప ఆమెను అనుసరించాడు. ఆమెతో మాటలు కలిపి లైంగిక క్రియకు ఒత్తిడి చేశాడు. అందుకు నజ్మా వ్యతిరేకించడంతో ఆ సమయంలో అటుగా ఎవరూ రాకపోవడాన్ని గమనించిన ముదుకప్ప ఆమెను బలవంతంగా లాక్కెళ్లాడు.
అత్యాచారానికి పాల్పడి ఊపిరాడకుండా చేసిన తర్వాత నజ్మా తలపై బండరాయితో కొట్టి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. రామమూర్తినగర పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్షలో హతురాలి వంటిపై లభించిన నిందితుడి రక్తం, వీర్యం సరిపోవడంతో ముదుకప్పను అరెస్టు చేశారు.
∙
Comments
Please login to add a commentAdd a comment