సాక్షి, బెంగళూరు: జీవనోపాధి కోసం కళలను రోడ్డుపై ప్రదర్శించడం విదేశాలలో సాధారణంగా చూస్తూ ఉంటాము. అటువంటి దృశ్యమే ఓ ధార్మిక క్షేత్రంలో కనిపించింది. పొట్టకూటి కోసమే లేక తన కళను చూపించాలనో తపనో తెలియదు కాని ఓ విదేశీ మహిళ దేశం కాని దేశం వచ్చి వయోలిన్ వాయిస్తూ డబ్బు సంపాదన చేస్తోంది. ఉత్తర కన్నడ జిల్లాలో ప్రముఖ ధార్మిక క్షేత్రమైన కుమటా తాలూకా గోకర్ణకు వచ్చే విదేశీయులు వివిధ మార్గాల్లో డబ్బు సంపాదిస్తూ ఉంటారు.
రెండు రోజులుగా ఓ విదేశీ యువతి వయోలిన్‌ను వినసొంపుగా వాయిస్తూ రోడ్డు పక్కన నిలబడి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ప్రజలు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఆమె ఆర్థిక సమస్యల వల్ల ఇలా యాచిస్తోందో, లేక కళారాధన చేస్తోందో తెలియడం లేదని స్థానికులు చెప్పారు.
చదవండి: పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనక తప్పదు! ముందుంది పెను ముప్పు?
Comments
Please login to add a commentAdd a comment