violen
-
వినసొంపుగా వయోలిన్ వాయిస్తూ.. అందరిని ఆకర్షిస్తూ..
సాక్షి, బెంగళూరు: జీవనోపాధి కోసం కళలను రోడ్డుపై ప్రదర్శించడం విదేశాలలో సాధారణంగా చూస్తూ ఉంటాము. అటువంటి దృశ్యమే ఓ ధార్మిక క్షేత్రంలో కనిపించింది. పొట్టకూటి కోసమే లేక తన కళను చూపించాలనో తపనో తెలియదు కాని ఓ విదేశీ మహిళ దేశం కాని దేశం వచ్చి వయోలిన్ వాయిస్తూ డబ్బు సంపాదన చేస్తోంది. ఉత్తర కన్నడ జిల్లాలో ప్రముఖ ధార్మిక క్షేత్రమైన కుమటా తాలూకా గోకర్ణకు వచ్చే విదేశీయులు వివిధ మార్గాల్లో డబ్బు సంపాదిస్తూ ఉంటారు. రెండు రోజులుగా ఓ విదేశీ యువతి వయోలిన్‌ను వినసొంపుగా వాయిస్తూ రోడ్డు పక్కన నిలబడి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ప్రజలు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఆమె ఆర్థిక సమస్యల వల్ల ఇలా యాచిస్తోందో, లేక కళారాధన చేస్తోందో తెలియడం లేదని స్థానికులు చెప్పారు. చదవండి: పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనక తప్పదు! ముందుంది పెను ముప్పు? -
ఇటు తిప్పితే వయోలిన్... అటు తిప్పితే సితార!
కొన్నేళ్ల క్రితం నాటి మాట. మార్కెట్లోకి కొత్త ఫోన్ వచ్చిందంటే అందరికీ ఆసక్తే... ఏ కొత్త ఫీచర్లున్నాయో అని. కానీ ఇప్పుడా పరిస్థితి. లేదు. ఏ కొత్త ఫోన్‌ను చూసినా ఆండ్రాయిడ్, ఐఫోన్ ఓఎస్‌ల మయం అనిపిస్తుంది. అయితే ఒక్కటుంది... పక్క ఫోటోలో కనిపిస్తోందే... ఈ ఫోన్ రూటే సపరేటు! ఎలాగంటారా? ఇది ఫోన్ మాత్రమే కాదు... ఓ గిటార్... ఓ వయోలిన్... ఓ సితార్! ఇంకా... మీకు ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరు తోస్తే అది! ఒక చిన్న ఫోన్ లాంటి పరికరం ఇన్ని పాత్రలు ఎలా పోషించగలదన్న సందేహం వద్దు. ఈ వామీ ఫోన్‌ను ఒక్కసారి అటు, ఇటు తిప్పి చూడండి.... దీని సత్తా ఏమిటన్నది తెలుస్తుంది. స్క్రీన్‌పై ఉన్న నిలువు గీతల్ని ఒత్తి పట్టుకుని, ఫోన్‌ను మెలికలు తిప్పితే ఒక క్షణం వయోలిన్లా, ఇంకో క్షణం సితారలా మార్చేయవచ్చు. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కారణంగా మీరు ఫోన్‌ను ఎలా, ఎంత కోణంలో ఎంత ఒత్తిడితో మెలితిప్పారన్న విషయాలను విశ్లేషించి దానికి అనుగుణమైన సౌండ్స్ వెలువడేలా చేస్తుంది. కింగ్స్టన్లోని క్వీన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు ఈ వామీ ఫోన్‌ని. సంగీతాన్ని పలికించడంతోపాటు ఈ ఫోన్ స్క్రీన్ 1920 బై 1080 ఓలెడ్ (ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్) స్క్రీన్‌తో వస్తుంది. ప్రస్తుతానికి ఇది ఒక డెమోఫోన్ మాత్రమే. మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకొంత టైమ్ పడుతుంది. అందుబాటులోకి వస్తే మాత్రం... బాత్రూమ్ మ్యూజిక్ లవర్స్ కూడా ఎంచక్కా కావాల్సిన చోట, కావాల్సిన సంగీతం సృష్టించుకోవచ్చు. -
సంగీత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
హన్మకొండ కల్చరల్ : ప్రభుత్వ విద్యారణ్య సంగీత నృత్య కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ కుప్పా పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. కర్ణాటక గాత్రం, వయోలిన్, కూచిపూడి నృత్యం, మృదంగం, హిందుస్థానీ గాత్రం, సితార్, తబలా, పేరిణి నృత్యం తదితర విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులలో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. వివరాలకు 0870–2426228 నంబర్లో సంప్రదించాలని సూచించారు.