నాన్నా.. పింకీ చంపేస్తుంది | - | Sakshi
Sakshi News home page

నాన్నా.. పింకీ చంపేస్తుంది

Published Tue, Jan 28 2025 12:30 AM | Last Updated on Tue, Jan 28 2025 6:49 AM

-

డెత్‌నోట్‌ రాసి భర్త ఆత్మహత్య

భార్య వేధింపులతో విరక్తి

హుబ్లీలో దారుణం

హుబ్లీ: అమ్మా నాన్నా సారీ.. పింకీ నా చావును కోరుకుంటోంది. ఆమె నన్ను చంపేస్తుది.. అని డెత్‌నోట్‌ రాసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యల వేధింపులను తట్టుకోలేక బెంగళూరుతో సహా పలుచోట్ల ఇటీవలి కాలంలో భర్తలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదే మాదిరి ఘటన హుబ్లీ అశోకనగరలో జరిగింది. వివరాలు.. పీటర్‌ సామ్యూల్‌ (40), పింకీ (34) భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పీటర్‌ స్థానికంగా ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. పింకీ ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేసేది. అయితే గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి.

నా జీవితం.. నా ఇష్టం
పింకీకి మరొకరితో అక్రమ సంబంధం ఉందని, దీనిని ప్రశ్నిస్తే.. నా జీవితం, నా ఇష్టం అని జవాబు ఇచ్చింది పీటర్‌ డెత్‌నోట్‌లో రాశాడు. అప్పటినుంచి తనను ఇంకా తీవ్రంగా వేధిస్తోంది. నువ్వు చస్తే తప్ప నేను సుఖంగా ఉండనని బెదిరించి పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపాడు. ఇటీవల విడాకుల నోటీసులను పంపించింది. విడాకులతో పాటు రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని పింకీ పట్టుబట్టింది. ఈ పరిణామాలతో చిత్రవధకు గురైన పీటర్‌ సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నా ఆత్మహత్యకు భార్యే కారణం అని శవపేటికపై రాయించాలని డెత్‌నోట్‌లో కోరగా, తల్లిదండ్రులు అలాగే రాయించారు. ఈ హృదయ విదాకర సంఘటన స్థానికులకు సైతం కంట తడి పెట్టించింది. పీటర్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పింకి, ఆమె కుటుంబంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement