కళ్యాణ వైభోగమే | - | Sakshi
Sakshi News home page

కళ్యాణ వైభోగమే

Published Tue, Jan 28 2025 12:30 AM | Last Updated on Tue, Jan 28 2025 12:30 AM

కళ్యా

కళ్యాణ వైభోగమే

మైసూరు: పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో మధురమైన ఘట్టం. కానీ అందరికీ పెళ్లి ఖర్చులను భరించే స్థోమత ఉండదు. అటువంటివారికి ఉచిత సామూహిక వివాహాలు తోడుగా ఉంటున్నాయి. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని సుత్తూరులో కపిలా నది తీరంలోనున్న సుత్తూరు మఠంలో సోమవారం కళ్యాణ వీణ మోగింది. పెద్దసంఖ్యలో జంటలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సుత్తూరు జాతర మహోత్సవాల సందర్భంగా సామూహిక వివాహ వేడుకలను నిర్వహించారు. ఈ వివాహ వేడుకల్లో కర్ణాటకతో పాటు కేరళ, తమిళనాడు నుంచి కూడా జంటలు పాల్గొన్నారు. 155 జంటలు మఠాధిపతులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగిడాయి. వేలాది మంది భక్తులు, వధూవరుల కుటుంబాలు వారిని ఆశీర్వదించాయి.

సుత్తూరు మఠంలో

సామూహిక వివాహాలు

ఒక్కటైన 155 జంటలు

వైవాహిక ప్రతిజ్ఞ

జాతి, మతం, అంగవైకల్యం అనే భేదభావం లేకుండా లేకుండా ఒకే వేదికపై సమానభావంతో పెళ్లి సంబరం జరిగింది. మఠాధిపతి శివరాత్రి దేశికేంద్ర స్వామి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, మంత్రి రామలింగారెడ్డి, రవిశంకర్‌ గురూజీ తదితరులు పాల్గొన్నారు. మాంగళ్య ధారణ అయిన తరువాత నూతన జంటలు సంసార జీవితాన్ని సవ్యంగా నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేశాయి. కొత్త దంపతుల్లో ఎస్సీలు 84, బీసీలు 22, వీరశైవ లింగాయత జంటలు 3, ఎస్టీలు 22, కులాంతర జంటలు 23, మతాంతర జంట–1, ముగ్గురు దివ్యాంగ దంపతులు కూడా ఉన్నారు. నూతన వధూవరులతో ప్రాంగణం కళకళలాడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
కళ్యాణ వైభోగమే 1
1/2

కళ్యాణ వైభోగమే

కళ్యాణ వైభోగమే 2
2/2

కళ్యాణ వైభోగమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement