ఉద్యోగానికి వస్తే.. ఊపిరే పోయింది | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగానికి వస్తే.. ఊపిరే పోయింది

Published Thu, Jan 30 2025 12:23 AM | Last Updated on Thu, Jan 30 2025 9:21 AM

-

బీఎంటీసీ బస్సు కింద పడి యువతి మృతి

మృతురాలు సత్యసాయి జిల్లావాసి

దొడ్డబళ్లాపురం/ రొద్దం: సిటీ బస్సు ఎక్కేటప్పుడు జారి కిందపడ్డ యువతిపై బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన బెంగళూరు బనశంకరి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీలోని సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం గౌరాజుపల్లి గ్రామానికి చెందిన కురుబ మౌనిక (23) మృతురాలు. కత్రిగుప్పెలో నివసిస్తూ బొమ్మనహళ్లిలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగానికి శిక్షణ పొందుతోంది. మౌనిక బుధవారం ఉదయం 8 గంటల సమయంలో చెన్నమ్మ జంక్షన్‌ వద్ద బీఎంటీసీ బస్సు ఎక్కే క్రమంలో జారి కిందపడిపోయింది. ఈ విషయం గమనించని డ్రైవర్‌ బస్సు స్టార్ట్‌ చేసి కదిలించాడు. దీంతో ఆమైపె నుంచి చక్రాలు వెళ్లడంతో ఘటనాస్థలిలోనే మరణించింది. స్థానిక పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని కెంపేగౌడ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు
కూతురి మృతితో కురుబ శ్రీనివాసులు, ఉమాదేవి దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు కాగా, మౌనిక చిన్న కూతురు. బీకాం పూర్తి చేసిన మౌనిక ఈ నెల 1న బెంగళూరులో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరడానికి ట్రైనింగ్‌ కోసం వెళ్లినట్లు బంధువులు తెలిపారు. కంపెనీకి వెళ్లడానికి బస్సు ఎక్కుతుండగా రద్దీ వల్ల పట్టుతప్పి పడిపోగా ఈ ఘోరం జరిగిపోయిందని విలపించారు. ఇంటి నుంచి వెళ్లిన 29 రోజులకే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మంగళవారం రాత్రి కూడా ఫోన్‌లో మాట్లాడిందని, జాగ్రత్తగా ఉండాలని చెప్పామని, ఇంతలోనే చావు వార్త వచ్చిందని తల్లడిల్లారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement