150 బైక్లు, కార్లు దగ్ధం
సాక్షి, బెంగళూరు: ఎండా కాలం రాకముందే బెంగళూరు నగరంలో అగ్ని ప్రమాదాలు జోరందుకున్నాయి. నాలుగు రోజుల కిందట రాజాజినగరలో ఈవీ బైక్ షోరూం బుగ్గి కావడం తెలిసిందే. అంతలోనే బుధవారం శ్రీరామపురపోలీసు స్టేషన్ పరిధిలో జక్కరాయనకెరె మైదానంలో మంటలు చెలరేగాయి. సుమారు 150 వరకూ బైక్లు, కొన్ని కార్లు, జీప్లు కాలిపోయాయి. వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వీటిని ఇక్కడ ఉంచారు.
ఉవ్వెత్తున పొగ, మంటలు
చుట్టూ గడ్డి, పిచ్చిమొక్కలు పెరిగాయి. ఎవరో సిగరెట్ తాగి పడేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మంటలు, పొగ ఉవ్వెత్తున లేచాయి. స్థానిక ప్రజలు ఏమైందోనని భయపడిపోయారు. ఫైర్ సిబ్బంది 5 వాహనాల్లో చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు శ్రమించారు. ఉత్తర విభాగం డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లు చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై శ్రీరామపుర పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది.
పోలీసులు సీజ్ చేసిన వాహనాలు ఇవి
రాజధానిలో మరో అగ్ని ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment