Kumbh Mela stampede: ఇలా అవుతుందనుకోలేదు | - | Sakshi
Sakshi News home page

Kumbh Mela stampede: ఇలా అవుతుందనుకోలేదు

Published Thu, Jan 30 2025 12:23 AM | Last Updated on Thu, Jan 30 2025 11:23 AM

-

కుంభమేళా తొక్కిసలాటలో

నలుగురు మృతి

సాక్షి బెంగళూరు: పుణ్యానికే పోతే పాపం ఎదురైనట్లు, పుణ్యస్నానాల కోసం వెళ్లిన యాత్రికులకు విషాదం ఎదురైంది. ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో బెళగావికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని బెళగావి జిల్లాధికారి మహమ్మద్‌ రోషన్‌ తెలిపారు. బెళగావి వడగావికి చెందిన జ్యోతి హత్తరవాట (50), ఆమె కుమార్తె మేఘ హత్తరవాట (25), బెళగావి శెట్టి గల్లీకి చెందిన అరుణ్‌ కొర్పడే (56) మరణించినట్లు తెలిసింది. అరుణ్‌ తన భార్యతో పాటు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. తొక్కిసలాటలో గాయపడిన అరుణ్‌ను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చనిపోయారు. అరుణ్‌ నివాసానికి బెళగావి తహశీల్దార్‌, సిబ్బంది వెళ్లి మాట్లాడారు. బెళగావి శివాజీనగర నివాసి మహాదేవి బావనూర (51) కూడా కన్నుమూశారు. ఆమె ఇంటికి ఎమ్మెల్యే రాజు సేట్‌ వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నలుగురి మరణంతో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

ఫోన్‌ చేస్తున్నా మాటల్లేవు
జ్యోతి భర్త దీపక్‌ హత్తరవాట బుధవారం ఉదయం నుంచి కాల్స్‌ చేస్తున్నా భార్య, కుమార్తె స్వీకరించడం లేదని, దీంతో తామంతా కంగారు పడ్డామని తెలిపారు. ఈనెల 26 మధ్యాహ్నం భార్య జ్యోతి, కుమార్తె మేఘ, మరో ఇద్దరు స్నేహితులు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లినట్లు దీపక్‌ తెలిపారు. కూతురు మేఘ డిగ్రీ చదివి స్టేషనరీ దుకాణాన్ని నడిపిస్తోంది. జ్యోతి ఇంట్లోనే గృహిణిగా ఉంటోంది.

ఇలా అవుతుందనుకోలేదు
కలెక్టర్‌ మహమ్మద్‌ రోషన్‌ మాట్లాడుతూ మృతదేహాలను త్వరగా బెళగావికి తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. కుంభమేళాకు వెళ్లిన బెళగావివాసి సరోజిని మీడియాతో మాట్లాడుతూ తాము ఒక 60 మంది రెండు బస్సుల్లో వెళ్లినట్లు తెలిపారు. ఇలా తొక్కిసలాట జరుగుతుందని అసలు ఊహించలేదని, తమతో పాటు వచ్చిన వారిలో చాలా మంది ఇంకా కనిపించలేదని తెలిపారు. మా బృందంలో 19 మంది ఉంటే, ఇందులో ముగ్గురు, నలుగురు మాత్రమే తమతో ఉన్నారన్నారు. మిగతావారు ఏమయ్యారోనని అన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement