వీలింగ్ను అడ్డుకోలేరా?
శివాజీనగర: బెంగళూరులో 18 నుండి 20 సంవత్సరాల యువకులు ఎక్కడపడితే అక్కడ బైక్‌లతో వీలింగ్ విన్యాసాలు చేస్తున్నారు. దీని వల్ల వారితో పాటు ఇతర వాహనదారులకు, ప్రజలకు ప్రమాదాలు జరగవచ్చు. అయినా కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని హైకోర్టు ధర్మాసనం పోలీసులపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.వీ.అంజారియా, ఎం.ఐ.అరుణ్ ఉన్న ధర్మాసనం సూచించింది.సిటీలో వీలింగ్ బెడదపై అర్చనాభట్ పిటిషన్ సమర్పించగా, విచారణ చేపట్టిన హైకోర్టు డివిజనల్ ధర్మాసనం, బెంగళూరులో కొన్ని ఏరియాల్లో వీలింగ్ ఎక్కువగా ఉంది. యువకులు ఎక్కువగా వీలింగ్ చేసి సమస్య సృష్టిస్తున్నారు. అటువంటివారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవటం లేదు అని ధర్మాసనం అక్షింతలు వేసింది. ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతోంది. వీలింగ్ ద్వారా ప్రమాదాలు జరిగి మరణాలు కూడా సంభవిస్తున్నాయి. చాలామంది హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతారు. ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకొంటోందో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.
బెంగళూరులో పెద్ద సమస్యగా మారింది
పోలీసులపై హైకోర్టు అసహనం
Comments
Please login to add a commentAdd a comment