రెండేళ్లయినా ఖాతా చేయరు | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లయినా ఖాతా చేయరు

Published Thu, Jan 30 2025 12:22 AM | Last Updated on Thu, Jan 30 2025 12:22 AM

రెండే

రెండేళ్లయినా ఖాతా చేయరు

శివాజీనగర: భూ పరివర్తన దరఖాస్తులు ఆలస్యం కారాదు. సామాన్య ప్రజలకు వేదన కలిగించే విధంగా జాప్యం చేయరాదు. దీనిపై త్వరలోనే మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశించారు. నగర ప్రాంతాల్లో మాస్టర్‌ ప్లాన్‌ నవీకరణ చేయాలని తెలిపారు. బుధవారం సీఎం నివాస కార్యాలయం కృష్ణాలో రెవెన్యూ శాఖ ప్రగతి పరిశీలనా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ భూములను వాణిజ్య, స్థిరాస్తి ప్రాంతాలుగా ల్యాండ్‌ కన్వర్షన్‌ (భూ పరివర్తన) చేసే ప్రక్రియను ఒక నెలలోగా పూర్తి చేయాలన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ అయినచోట మళ్లీ భూ పరివర్తన అవసరం లేదని చట్ట సవరణ చేసినట్లు తెలిపారు.

రెవెన్యూ కోర్టుల్లో కేసులపై..

రెవెన్యూ కోర్టుల్లో కేసులు త్వరగా పరిష్కారం అవుతున్నట్లు ఆ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ పేర్కొన్నారు. ఐదు, పదేళ్లుగా ఉన్న అనేక కేసులకు ఒకటిన్నర ఏడాదిలో విముక్తి లభించిందన్నారు. సర్కారు ఏర్పడినప్పుడు 10 వేల కేసులు పెండింగ్‌లో ఉంటే, ఇప్పుడు 369 మాత్రమే మిగిలాయని మంత్రి వివరించారు. ఖాతా మార్పు దరఖాస్తుల్లో 65 శాతం.. ఒక్క రోజులో ఆమోదం పొందాయని చెప్పారు. ఇది ఆటో మ్యూటేషన్‌ ద్వారా సాధ్యపడిందన్నారు. ఉప విభాగాధికారి కోర్టుల్లో కొన్ని కారణాల వల్ల ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అంగీకరించారు. ఏసీలు కాల పరిమితిలోగా కేసులను పరిష్కారం చేయాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్ల ఆఫీసుల్లో 9,9,47 కేసులు ఏడాదిగా పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు 6 వేలకు తగ్గించినట్లు మంత్రి చెప్పారు. బెంగళూరు పరిధిలో కేసుల త్వరగా పరిష్కారానికి 18 ప్రత్యేక ఉప విభాగాధికారులను నియమించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.22 కోట్ల ఖాతాలకు ఆధార్‌ లింక్‌చేసినట్లు చెప్పారు. దీంతో నకిలీ ఆధారాల సృష్టికి అడ్డుకట్టు వేసి, నకిలీ కన్వర్షన్లను పసిగట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో అనేకచోట్ల భూమి ఖాతా మరణించినవారి పేరు మీదే ఉంది, ఫౌతి ఖాతా అభియానా ద్వారా నిజ యజమాని పేరున రిజిస్ట్రేషన్‌ చేసే కార్యక్రమం చేపట్టాలని సీఎం సూచించారు.

దరఖాస్తులను సక్రమంగా

పరిష్కరించాలి

రెవెన్యూ శాఖకు సీఎం సిద్దు ఆదేశం

మహిళ రేష్మా బాను ఆవేదన

తుమకూరు: ప్రజలకు రెవెన్యూ సేవలు ఆలస్యం కారాదని ముఖ్యమంత్రి ఒకవైపు హెచ్చరిస్తుంటే, మరోవైపు కింది స్థాయిలో పనులు జరగడం లేదు. తన స్థలానికి ఖాతా చేసి ఇవ్వాలని హుళియూరు పట్టణ పంచాయతీకి రెండేళ్ల నుంచి తిరుగుతున్నా ఫలితం లేదని రేష్మా బాను అనే మహిళ బుధవారం వాపోయారు. హుళియూరు గ్రామీణపోలీసు స్టేషన్‌ పరిధిలోని లింగాయితర వీధిలో స్థలాన్ని తల్లి నుంచి 2018, ఆగస్టులో రిజిస్టర్‌ చేయించుకున్నట్లు రేష్మ తెలిపారు. ఈ స్థలానికి తన పేరు మీద ఖాతా ఇవ్వాలని 2023, ఫిబ్రవరి 2న పంచాయతీలో అన్ని ఆధారాలను ఇచ్చానని చెప్పారు. ఎప్పుడు వచ్చినా సిబ్బంది లేరని, పరిశీలిస్తున్నామని, సెలవని, ఇలా ఏదో ఒక కారణం చెప్పుకుంటూ పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఫైల్‌ పోగొట్టుకుపోయిందని, మళ్లీ ఇవ్వాలని ఆరేడు నెలల కిందట ఇప్పించుకున్నారని, పని మాత్రం జరగలేదని చెప్పారు. పంచాయతీకి తిరిగి తిరిగి అలసిపోయినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రెండేళ్లయినా ఖాతా చేయరు1
1/4

రెండేళ్లయినా ఖాతా చేయరు

రెండేళ్లయినా ఖాతా చేయరు2
2/4

రెండేళ్లయినా ఖాతా చేయరు

రెండేళ్లయినా ఖాతా చేయరు3
3/4

రెండేళ్లయినా ఖాతా చేయరు

రెండేళ్లయినా ఖాతా చేయరు4
4/4

రెండేళ్లయినా ఖాతా చేయరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement