
సాక్షి,ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులున్నాయని, వాటి వడ్డీల్లో ఏ మాత్రం తగ్గినా ప్రతి ఏటా వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఢిల్లీలో శుక్రవారం(జూన్28) నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ‘ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్స్‌లో రూల్స్ బ్రేక్ చేయదల్చుకోలేదు. కేసీఆర్ చేసిన తప్పులు, మేం చెయ్యం.
కొత్త పీసీసీ చీఫ్ నియామకం, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని పీసీసీ చీఫ్ ఎవరనేది హై కమాండ్ డిసైడ్ చేయనుంది. పీసీసీ చీఫ్‌గా రెండు ఎన్నికలు పూర్తి చేశా. జులై7తో నేను పీసీసీ పదవి చేపట్టి మూడేళ్లు పూర్తి కానుంది.
పీసీసీ, క్యాబినెట్ విస్తరణ నిర్ణయాలు ఒకేసారి ఫైనల్ అవుతాయి. కాంగ్రెస్ బీఫాంపై పోటీ చేసిన వారికి మాత్రమే మంత్రి పదవులు ఉంటాయి. కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఉండవు.
తెలంగాణలో కరెంట్ కోతలు లేవు. రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తాం. కావల్సినంత కరెంటు కొంటున్నాం. మహిళల ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ గట్టున పడింది’అని రేవంత్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment