కర్ణాటక: డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడమే సమస్త ఒక్కలిగల ఆశయమని విశ్వ ఒక్కలిగ మహాసంస్థానమఠం చంద్రశేఖరనాథ స్వామీజీ తెలిపారు. మంగళవారం విధానసౌధ బ్యాంకెట్ హాల్‌లో కెంపేగౌడ అభివృద్ధి ప్రాధికార ఆధ్వర్యంలో కెంపేగౌడ జయంతి వేడుకలను చంద్రశేఖరనాథస్వామీజీ ప్రారంభించి మాట్లాడారు.
డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని, ఆయనకు ఎమ్మెల్యేలు, నాయకులు అండగా నిలవాలని అన్నారు. స్ఫటికపురి మఠం పీఠాధ్యక్షుడు నంజావదూతమహాస్వామి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు నాడప్రభు కెంపేగౌడ పాఠ్యాంశాన్ని తప్పనిసరిగా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు ప్రసంగిస్తూ కెంపేగౌడ గొప్పదనాన్ని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment