అభిమానం అంటూ తమకు నచ్చిన వ్యక్తులతో కష్టమైనా సరే ఓ సెల్ఫీ దిగుతామని ఫ్యాన్స్ యత్నిస్తుంటారు. కొన్ని పర్యాయాలు ఆ ప్రయత్నాలు వికటించడం జరగక మానదు. బెళ్లారిలో ఓ అభిమానికి ఇలాంటి చేదు అనుభవవమే ఎదురైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం బెళ్లారికి వచ్చారు. ఆయనతో సెల్ఫీ దిగాలని ఓ అభిమాని ఆయనను చేరుకున్నాడు. చుట్టుపక్కలున్న పార్టీ నేతలు, కార్యకర్తలను దాటుకుంటూ మంత్రి శివకుమార్‌ను సమీపించాడు. వెంటనే తన మొబైల్ తీసి మంత్రితో సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. ఇక అంతే ఒక్కసారిగా ఆవేశానికి లోనైన మంత్రి ఆ అభిమాని ఫోన్‌ను విసిరికొట్టేశారు. ఆశ్చర్యపోవడం అక్కడున్న వారి వంతయింది. మరో అభిమాని చేయి ముందుకు చాపగా షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయారు. మంత్రిగారు సెల్ఫీ దిగరు.. షేక్ హ్యాండ్ మాత్రమే ఇస్తారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మంత్రితో సెల్ఫీ దిగేందుకు వస్తే ఫోన్ విసిరికొట్టేశారు
Published Mon, Feb 5 2018 12:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement