నోరు మూసుకుంటే మంచిది
ఇష్టానుసారం మాట్లాడవద్దు
పార్టీ నేతలకు డీకేశి రూల్
శివాజీనగర: ముఖ్యమంత్రి మార్పు, డిప్యూటీ సీఎం స్థానాల గురించి పార్టీ నాయకులు ఎవరూ బహిరంగంగా మాట్లాడరాదు. నోటికి తాళాలు వేసుకోవాలి. లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ ఘాటుగా హెచ్చరించారు. పార్టీకి మంచి కోసం దీనిని పాటించాలి. మాట్లాడితే నోటీస్ ఇచ్చి, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అని డీకే హెచ్చరించారు.
మరిన్ని డిప్యూటీ సీఎం పదవులు కావాలని కొందరు మంత్రులు, నాయకులు పదేపదే కోరడం వల్ల రభస సాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం బెంగళూరులోని సదాశివనగరలో నివాసంలో విలేకరులతో మాట్లాడిన డీకే పై మేరకు హెచ్చరించారు. పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి ఎంత కష్టపడ్డామనేది అందరికి తెలుసు. చంద్రశేఖరనాథ స్వామి నాపై అభిమానంలో సీఎం పదవిని ఇవ్వాలని అన్నారు, ఎవరూ ఈ విధంగా మాట్లాడకూడదు. నేను సీఎం కావడానికి ఎవరి సిఫార్సు వద్దు. హైకమాండ్ తీర్మానం చేస్తుంది అని చెప్పారు. అందరు స్వామీజీలకు చేతులెత్తి మొక్కి విన్నవిస్తున్నా, మా రాజకీయాల్లోకి రావద్దు అని కోరారు. మీకు అంత అభిమానం ఉంటే మనస్సులోనే ఆశీర్వదించాలని అన్నారు.
అసంతృప్తిలో సీఎం సిద్దు
డీకేకి సీఎం పదవిని వదిలేయాలని స్వామీజీ చెప్పడంపై సీఎం సిద్దరామయ్య కినుకతో ఉన్నారు. ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో శుక్రవారం సన్నిహిత మంత్రులు కే.జే.జార్జ్, పరమేశ్వర్‌తో కలసి లిఫ్ట్‌లో వెళ్తూ, స్వామీజీలకు ఎవరో చెప్పించి ఈ విధంగా మాట్లాడించారని సీఎం అన్న ఆడియో వైరల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment