Karnataka Assembly Election 2023: Congress President Mallikarjun Kharge Releases Party's Manifesto - Sakshi
Sakshi News home page

Congress Manifesto: యువత, మహిళలకు పెద్దపీట.. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఇదే..  

Published Tue, May 2 2023 10:31 AM | Last Updated on Tue, May 2 2023 10:55 AM

Congress Party Releases Manifesto In Karnataka Assembly Election 2023 - Sakshi

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు పార్టీలు ప్లాన్‌ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్నికల వేళ పార్టీ మేనిఫెస్టోలో ఆకర్షనీయంగా పలు పథకాలను, హామీలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గ్యారెంటీ కార్డు పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్నాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు మేనిఫెస్టోను విడుదల చేశారు. 

ఈ సందర్బంగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ.. మైనార్టీ వర్గాల మద్య ద్వేషాన్ని ప్రొత్సహించే వ్యక్తులు, సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, బజరంగ్‌దళ్‌, పీఎఫ్‌ఐ వంటి సంస్థలపై నిషేధం విధించడంతోపాటు చట్ట ప్రకారం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. 2006 నుండి సర్వీస్‌లో చేరిన పెన్షన్ పొందే ప్రభుత్వ ఉద్యోగులకు OPS పొడిగింపును కాంగ్రెస్ పరిశీలిస్తోందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను ఒక సంవత్సరంలోగా భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

మేనిఫోస్టో వివరాలు ఇవే.. 

గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌. 

గృహలక్ష్మి కింద ప్రతి ఇంటికి గృహిణికి నెలకు రూ. వేలు. 

► అన్న భాగ్య పథకం కింద ప్రతీ వ్యక్తికి 10కిలోల బియ్యం. 

► శక్తి పథకంలో భాగంగా  ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. 

► యువనిధి నిరుద్యోగ భృతి కింద రూ.3వేలు(రెండేళ్లపాటు) అందజేత. 

► డిప్లొమా చేసిన వారికి రూ.1500. 

ఇది కూడా చదవండి: Karnataka assembly elections 2023: 3 ఉచిత సిలిండర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement